ఎప్పుడు లాంచింగ్ అంటే.. ఇప్పటికే ఈ డుకాటి మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ ను ప్రదర్శంచిన కంపెనీ మార్కెట్లోకి 2024 జనవరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 31.48లక్షలు ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
డుకాటి మల్టీస్ట్రాడా వీ4ఆర్ఎస్ డిజైన్.. దీనిలోని భాగాలు కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. ఐస్ బర్గ్ వైట్ లివరీని కలిగి ఉంది. ఈ బైక్ లో టెక్నో పాలిమర్ టైల్, టైటానియం సబ్ ఫ్రేమ్ ఉంటుంది. వీటి సాయంతో 2.5 కేజీ తక్కువ బరువుతో ఉంటుంది. ఈ బైక్ కి ఇరు పక్కలా సైడ్ కేసెస్.. ప్యాసెంజర్ సీట్ బ్యాగ్స్ ఉంటాయి.
రెండు మోడ్లు.. ఈ బైక్లో రెండు మోడ్లు ఉంటాయి. ఫుల్ పవర్, రేస్ రైడింగ్ మోడ్లు ఉంటాయి. స్టాండర్డ్ రేర్ రాడార్ కంట్రోల్ టెక్నాలజీ ద్వారా అడాప్టివ్ కంట్రోల్ క్రూయిజ్ కంట్రోల్ అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సాధ్యమవుతుంది.
భద్రతకు భరోసా.. ఈ బైక్ లో పవర్ మోడ్, ఏబీఎస్ కార్నరింగ్, డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్, డుకాటి వీలీ కంట్రోల్, డేటైం రన్నింగ్ లైట్, వెహికల్ హోల్డ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.