ATM Withdrawal: ఏటీఎమ్‌లో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలో తెలుసా.?

ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ పెరిగిన ఈ రోజుల్లోనూ ఇప్పటికీ ఏటీఎమ్‌లో డబ్బులు విత్‌డ్రా చేస్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ఏటీఎమ్‌లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం సులభతరమైంది. అయితే ఏటీఎమ్‌లో డబ్బు తీసుకునే సమయంలో చిరిగిన నోట్లు రావడం కూడా సర్వసాధారణమైన విషయం తెలిసిందే.

మనలో చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. చిరిగిన నోట్లను మార్చుకోవడం అంత సులభమైన విషయమేమి కాదు. ఎవరికీ ఇచ్చినా తీసుకోవడానికి నిరాకరిస్తుంటారు. మరి ఏటీఎమ్‌ నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి.? బ్యాంక్‌ నియమాలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.. ఏటీఎమ్‌ల నుంచి చిరిగిన నోట్లు వస్తే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకునే వెసులుబాటు ఉందని మీకు తెలుసా.? అవును.. మ్యుటిలేడెట్ నోట్లను సులభంగా భర్తీ చేసుకోవచ్చు. ఏటీఎమ్‌లో వచ్చిన చిరిగిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు నిరాకరించకూడదని ఆర్‌బీఐ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. కేవలం నిమిషాల్లోనే నోట్లను మార్చుకోవచ్చు.

ఇందుకోసం మీకు చిరిగిన నోటు వచ్చిన ఏటీఎమ్‌ లింక్‌ చేసిన బ్యాంకులో సంప్రదించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకుకు వెళ్లి అప్లికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం, ఏటీఎమ్‌ పేరును పేర్కొనాలి. దీంతో పాటు ఏటీఎమ్‌ ట్రాన్సాక్షన్‌ తర్వాత వచ్చే స్లిప్‌ను అప్లికేషన్‌కు జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్లిప్‌ ఇవ్వకపోతే మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించినా సరిపోతుంది. ఈ వివరాలను అన్నింటినీ అందిస్తే వెంటనే బ్యాంకులో నోట్లను మార్చుకోవచ్చు. చిరిగిన నోట్లను మార్చడాన్ని బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో నిరాకరించకూడదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2017 ఏప్రిల్‌లో తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఏటీఎమ్‌లలో చిరిగిన నోట్లు రాకుండా ఉండడానికి దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ అత్యాధునిక నోట్ సార్టింగ్ మిషన్‌ను ఉపయోగిస్తుంది. దీంతో చిరిగిన నోట్లు ఏటీఎమ్‌లో రాకుండా చేస్తుంది. అయితే ఒకవేళ పొరపాటున ఏదైనా చిరిగిన నోటు వచ్చినా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇదిలా ఉంటే ఒకవేళ ఏదైనా బ్యాంకు చిరిగిన నోటును మార్చడానికి నిరాకరిస్తే రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం చిరిగిన నోట్లను మార్చే బాధ్యత బ్యాంకుపై పాత్రమే ఉంటుంది. డబ్బును ఏటీఎమ్‌లో ఇన్‌స్టాల్‌ చేసే ఏజేన్సీలకు ఎలాంటి సంబంధం ఉండదు.
ఇక చిరిగిన నోట్లను బ్యాంకులు మాత్రమే కాకుండా రిజర్వ్‌ బ్యాంక్ కార్యాలయాల్లో కూడా మార్చుకోవచ్చు. ఆర్‌బీఐ నిబంధలన ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు, ఈ నోట్ల గరిష్ట విలువ రూ. 5000 మించకూడదు. అయితే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. నోట్లు బాగా కాలిపోయినా, ముక్కలుగా మారినా వాటిని మార్చుకోవడానికి కుదరదు.

Ducati Multistrada V4 RS: రేసింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. డుకాటి నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్.. టాప్ రేంజ్.. సెన్సేషనల్ ఫీచర్స్..

స్పోర్ట్స్ బైక్ లకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాటి ధర ఎక్కువైన అధిక సామర్థ్యం కలిగిన ఈ తరహా బైక్ లను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. అయితే ఈ స్పోర్ట్స్ బైక్ లలో డుకాటి కంపెనీ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ క్రమంలో డుకాటి కంపెనీ మరో కొత్త స్పోర్ట్స్ బైక్ ను ఆవిష్కరించింది. డుకాటి మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ పేరుతో దీనిని ఆవిష్కరించింది. దీనిలో ఏకంగా 1103 సీసీ ఇంజిన్ ఉంటుంది. పూర్తి స్థాయి స్పోర్ట్స్ లుక్ లో అదరగొడుతుంది. దీనిలో టైటానియం సబ్ ఫ్రేమ్, లైట్ వెయిట్ తో అధిక పనితీరు అందించే విధంగా డ్రైవింగ్ మోడ్లు ఉంటాయి. ఈ బైక్ 180 బీహెచ్పీ పవర్, 118ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వీ4ఆర్ఎస్ బైక్ చాలా శక్తివంతమైంది. ఇంతకు ముందుకు ఉన్న మల్టీస్ట్రాడా వీ4 పైక్స్ పీక్ బైక్ కంటే చాలా సామర్థ్యం కలిగినది. ఈ మల్టీస్ట్రాడా వీ4ఆర్ఎస్ అత్యంత శక్తివంతమైన డ్రై క్లచ్ ఉంటుంది. ఈ బైక్ లో సన్నటి ఫ్లాట్ హ్యాండిల్ బార్ ఉంది.

ఎప్పుడు లాంచింగ్ అంటే.. ఇప్పటికే ఈ డుకాటి మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ ను ప్రదర్శంచిన కంపెనీ మార్కెట్లోకి 2024 జనవరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 31.48లక్షలు ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

డుకాటి మల్టీస్ట్రాడా వీ4ఆర్ఎస్ డిజైన్.. దీనిలోని భాగాలు కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. ఐస్ బర్గ్ వైట్ లివరీని కలిగి ఉంది. ఈ బైక్ లో టెక్నో పాలిమర్ టైల్, టైటానియం సబ్ ఫ్రేమ్ ఉంటుంది. వీటి సాయంతో 2.5 కేజీ తక్కువ బరువుతో ఉంటుంది. ఈ బైక్ కి ఇరు పక్కలా సైడ్ కేసెస్.. ప్యాసెంజర్ సీట్ బ్యాగ్స్ ఉంటాయి.

రెండు మోడ్లు.. ఈ బైక్లో రెండు మోడ్లు ఉంటాయి. ఫుల్ పవర్, రేస్ రైడింగ్ మోడ్లు ఉంటాయి. స్టాండర్డ్ రేర్ రాడార్ కంట్రోల్ టెక్నాలజీ ద్వారా అడాప్టివ్ కంట్రోల్ క్రూయిజ్ కంట్రోల్ అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సాధ్యమవుతుంది.

భద్రతకు భరోసా.. ఈ బైక్ లో పవర్ మోడ్, ఏబీఎస్ కార్నరింగ్, డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్, డుకాటి వీలీ కంట్రోల్, డేటైం రన్నింగ్ లైట్, వెహికల్ హోల్డ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.

Flipkart Dussehra Sale 2023 : రూ. 30వేల లోపు ధరలో ఆపిల్ ఐఫోన్ 14 కొనేసుకోండి.. ఈ డీల్ ఎలా పనిచేస్తుందంటే?

Flipkart Dussehra Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్‌ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. అక్టోబర్ 22, 2023న ప్రారంభమైన ఈ సేల్.. అక్టోబర్ 29, 2023 వరకు కొనసాగుతుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్‌ Flipkart Sale Offers సమయంలో డ్రెస్సులు, గాడ్జెట్‌లు, ఎలక్ట్రానిక్స్, మరిన్నింటితో సహా అనేక రకాల ప్రొడక్టులపై గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది.
ఐఫోన్ 14పై బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లు :
ప్రస్తుతం ఇ-కామర్స్ దిగ్గజం (Apple iPhone 14)ని కేవలం రూ. 56,999 ఆకర్షణీయమైన ధరకు అందిస్తోంది. అధికారిక స్టోర్ ధర నుంచి ఆకట్టుకునే రూ. 12,901 తగ్గించింది. SBI, RBL బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 750 అదనపు తగ్గింపును పొందవచ్చు. తద్వారా ధరను ఆకర్షణీయమైన రూ. 56,249కి తగ్గించవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. :
ఆపిల్ హ్యాండ్‌సెట్ శక్తివంతమైన A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా 128GB, 256GB, 512GB స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. కొనుగోలుదారులు ఐఫోన్ 14 మల్టీ కలర్ వేరియంట్‌ల నుంచి ఎంచుకోవచ్చు. అంతేకాదు.. మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ RED, బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.

కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ 12MP ప్రైమరీ సెన్సార్‌తో 12MP అల్ట్రా వైడ్ సెన్సార్‌తో వస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 2532×1170 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,800గా ఉంది.

* ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. గురువారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది. ఒఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 77,500గా నమోదైంది.
* ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఫోన్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడమే. 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయి.

Apple iOS 17.1 Update : ఆపిల్ ప్రొడక్టుల కోసం iOS 17.1 కొత్త అప్‌డేట్ వస్తోంది.. సరికొత్త ఫీచర్లు, బగ్ ఫిక్స్ చేసుకోవచ్చు!

Apple iOS 17.1 Update : ఆపిల్ iOS 17 నుంచి ఫస్ట్ మేజర్ అప్‌డేట్ డెవలప్ చేస్తోంది. గత సెప్టెంబర్‌లో లాంచ్ కాగా.. ప్రస్తుతం టెస్టింగ్ చేస్తోంది. iOS 17.1అప్‌డేట్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి కొత్త ఫీచర్‌లు, బగ్ పరిష్కారాలు ఉన్నాయి. ఫ్రెంచ్ నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ANFR) ప్రకారం.. ఐఫోన్ 12 నుంచి అధిక విద్యుదయస్కాంత వికిరణ ఉద్గారాల గురించి ఆందోళనలను కూడా పరిష్కరిస్తుంది.

అక్టోబరు 24 నుంచి iOS అప్‌డేట్ లైవ్ అవుతుందని అధికారులు పేర్కొన్నారు. కొత్త OS అప్‌డేట్ గురించి ఆపిల్ నుంచి ఇంకా ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు. అయితే, స్టాండ్‌బై మోడ్, ఫొటో షఫుల్ అప్‌గ్రేడ్, మరిన్నింటికి కస్టమైజడ్ తీసుకువస్తుందని తెలిపింది. iOS 17.1తో రాబోయే సరికొత్త ఫీచర్ల సంబంధించి పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

iOS 17.1 కొత్త ఫీచర్లు, యాక్షన్ బటన్ మార్పులు :
కొత్త iPhone 15 సిరీస్ వినియోగదారులు రాబోయే అప్‌డేట్‌లో యాక్షన్ బటన్‌కు మార్పులను ఆశించవచ్చు. ఈ కొత్త ఐఫోన్ యాక్షన్ బటన్‌ను ట్యాప్ చేయడం వల్ల ఇకపై కెమెరా, ఫ్లాష్‌లైట్, ఫోకస్, మాగ్నిఫైయర్, వాయిస్ మెమో ట్రిగ్గర్ చేయవు. అయితే, మ్యూట్ ఫంక్షన్, షార్ట్‌కట్‌లు వంటి కొన్ని ఫీచర్‌లు ఐఫోన్ జేబులో ఉన్నప్పటికీ ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంది.

డైనమిక్ ఐలాండ్ ఫ్లాష్‌లైట్ నోటిఫికేషన్ :
రాబోయే iOS అప్‌డేట్ నాన్-ప్రో iPhone 15 మోడల్‌లకు ఫ్లాష్‌లైట్ నోటిఫికేషన్‌ను అందిస్తుంది. అంటే.. iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 15, iPhone 15 Plus వినియోగదారులు తమ ఫ్లాష్‌లైట్‌లను ఆన్ చేసినప్పుడు, ఫ్లాష్ ఆన్‌లో ఉందని సూచించే నోటిఫికేషన్ డైనమిక్ ఐలాండ్‌లో కనిపిస్తుంది.

కస్టమైజడ్ స్టాండ్‌బై మోడ్ (Customisable StandBy mode) :
ఐఫోన్ యూజర్లు త్వరలో iOS 17 లాంచ్‌లో ప్రకటించిన కొత్త స్టాండ్‌బై మోడ్ ఫీచర్‌లను పొందవచ్చు. 9to5Mac ప్రకారం.. ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు తమ ఐఫోన్‌లను స్మార్ట్ డిస్‌ప్లేలుగా మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లో స్క్రీన్ టైమ్‌అవుట్ సెట్టింగ్ మాదిరిగానే ఐఫోన్ యూజర్లు 3 ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. గురువారం తులం గోల్డ్ ఎంతకు చేరిందంటే..

దేశంలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. రోజురోజుకీ ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం తులం బంగారంపై రూ. 200 వరకు పెరగగా ఈరోజు (గురువారం) కూడా గోల్డ్‌ ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి, రూ. 61,800కి చేరింది. ఇక దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690వద్ద కొనసాగుతోంది.

* ముంబయిలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 వద్ద కొనసాగుతోంది.

* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800గా ఉంది.

* ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,800గా ఉంది.

* ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. గురువారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది. ఒఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 77,500గా నమోదైంది.
* ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఫోన్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడమే. 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయి.

Komaki Electric Scooter: అప్‌డేటెట్ ఫీచర్లతో కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్ రీ లాంచ్.. అదిరే రేంజ్.. ధర మాత్రం అందుబాటులోనే..

మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద ఎత్తున లాంచ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్కూటర్లకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. పురుషులు, మహిళలు వినియోగించకునే వీలుండటం, సిటీ పరిధికి సరిగ్గా సరిపోతుండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని కంపెనీలు విద్యుత్ శ్రేణి స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఉన్న పలు మోడళ్లలో కొత్త ఫీచర్లు యాడ్ చేసి అప్ గ్రేడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో ఇప్పటికే తన సత్తా చూపిన కోమకి కంపెనీ ఇప్పుడు పాత మోడల్ ను సరికొత్తగా అడ్ డేట్ చేసి ఆవిష్కరించింది. కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొత్త ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ మోడల్ ఇప్పుడు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ తో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్, విడా వీ1 ప్రో వంటి వాటితో పోటీపడనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..

కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, లభ్యత..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో, స్పోర్ట్ స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, వీటి ధరలు వరుసగా ధర రూ. 96,968, రూ. 1,29,938, రూ. 1,38,427 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ జెట్ బ్లాక్, రాయల్ బ్లూ, ప్యూర్ గోల్డ్, గార్నెట్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది .

కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్‌లు..

ఈ స్కూటర్ లో 3 kW సామర్థ్యంతో హబ్ మోటార్ ఉంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై ఎకో వేరియంట్ 75 కి.మీ నుండి 90 కి.మీల రేంజ్ ఇస్తుంది. అదే స్పోర్ట్స్ వేరియంట్ స్కూటర్ అయితే 110 కిమీల నుంచి 140 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. అదే స్పోర్ట్స్ పెర్ఫామెన్స్ అప్ గ్రేడ్ వెర్షన్ అయితే 150 కి.మీ నుంచి 180 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. బ్యాటరీ చార్జింగ్ ఇంట్లో చేస్తే నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది. గరిష్టంగా గంటకు 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలుగుతుంది.