Telangana Election 2023: Minister KTR Counter To PM Modi Says We Are Not B Team Of BJP, C Team Of Congress

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అంతేకాకుండా.. మాటల తూటాలు పేల్చుతూ.. ఎన్నికల రణరంగంలో సవాల్ చేసుకుంటున్నాయి. తాజాగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయాలను మరింత హీటెక్కించింది. బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి నుంచే తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారన్నారు. మోదీని ప్రధానిని చేసే ఘట్టానికి పునాది పడింది ఇక్కడే అన్న ఆయన.. ఈ నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తెలంగాణలో మార్పు తుఫాన్‌ కనిపిస్తోంది.. ఇక్కడ గెలిచేది బీజేపీనే అన్నారు.. కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ బీఆర్‌ఎస్‌ పార్టీ అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ డీఎన్‌ఏలో 3 అంశాలు ఉన్నాయన్నారు. లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్‌ మాపై ఆరోపణలు చేస్తోందని.. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదని, కచ్చితంగా జైలులో వేస్తామంటూ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ జన్మలో బీసీని సీఎంని చేయనివ్వరు.. మాది ఎన్డీయే, బీజేపీ.. ఓబీసీ మిత్రులపై అత్యంత ప్రేమ ఉంటుందంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

కాగా.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. రాహుల్‌ వచ్చి.. బీఆర్‌ఎస్‌ని బీజేపీ బీ టీమ్‌ అంటారని.. ఇప్పుడు మోదీ.. కాంగ్రెస్‌కి సీ టీమ్ అంటున్నారని.. తమది మాత్రం ముమ్మాటికీ టీ టీమ్‌, అంటే తెలంగాణ టీమ్‌ అన్నారు కేటీఆర్‌. బీఆర్‌ఎస్‌ అంటేనే భారత రైతు సమితి అన్నారు. ఇక ఒక్కసారి కూడా రుణమాఫీ చేయని వాళ్లు.. మాపై విమర్శలు చేయడం విడ్డూమన్నారు. నిన్నటి వరకు మత రాజకీయాలు చేశారు.. ఇప్పుడు కుల రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. బీజేపీ హయాంలో బీసీలకు మిగిలింది అరణ్య రోదనేనన్నారు. ఇక TSPSC పేపర్లు లీక్‌ చేసింది మీ బీజేపీ నేతలే అని.. నిందితులతో వేదిక పంచుకుని మాపై నిందలా అంటూ మండిపడ్డారు.

Telangana Election: తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం.. సహాయకుడిగా వచ్చే వారికి ఇంక్ తప్పనిసరి..!

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను ఈసీ సమీక్షించింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ విషయంలో కొన్ని సూచనలు, నిబంధనలు జారీ చేసింది ఎన్నికల కమిషన్.

తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక మార్పులు చేసింది. ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెడతారు. సహాయకుడు అదే బూత్‌కు చెందిన ఓటరై ఉండాలి. తన ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలి. ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కీలక మార్పులు చేసింది.

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అందరూ ఎన్నికల కోడ్ పాటించాలని సూచించింది ఎన్నికల కమిషన్. నిబంధనలు పాటించకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రచారంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించే స్థలం, సమయం తదితర వివరాలను స్థానిక పోలీస్ అధికారులకు తెలియజేయాలని తెలిపారు. కుల, మత, భాషలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదన్నారు.

నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అఫిడవిట్ లోని అన్ని కాలమ్స్‌ను తప్పనిసరిగా అభ్యర్థులకు సూచించారు. నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ ద్వారా కూడా స్వీకరించడం జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. పోటీలో ఉండే అభ్యర్థులు తమ క్రిమినల్ రికార్డులను  లీడింగ్ న్యూస్ పేపర్స్, టీ.వీ ఛానళ్లలో పబ్లిష్ చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చును అధ్యయనం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం రాష్ట్రంలో ఇప్పటికే పర్యటిస్తోంది. అటు ఈసారి ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రారంభిస్తారు. పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూడా కూర్చునేందుకు అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. మరోవైపు పోలింగ్ శాతం పెంచే అంశంపైనా ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు సదస్సులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది.

Khammam Student: అమెరికాలో కత్తిపోట్లకు గురైన తెలుగు విద్యార్థి మృతి.. MS చదివేందుకు వెళ్లి..

Khammam student dies in US: అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో తెలంగాణలోని ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్‌ (29) MS చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. అక్టోబర్ 30న జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో అతడిపై దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వరుణ్​ను ఆస్పత్రికి తరలించారు.. అనంతరం కేసు నమోదు చేసుకుని దుండగుడిని అరెస్టు చేశారు.
గతనెల 30 నుంచి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్‌రాజ్‌ తొమ్మిది రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడి మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు అమెరికా అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వరుణ్‌రాజ్‌ మృతితో అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వరుణ్‌ మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ దాడి జరిగిన మూడు రోజుల తర్వాత ఈ ఘటనపై స్పందించిన అమెరికా.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. అంతేకాదు, ఈ ఘటన అత్యంత బాధాకరమంటూ విచారం వ్యక్తం చేసింది.

Telangana Election: తెలంగాణ అమాత్యుల్లో టెన్షన్ టెన్షన్.. మంత్రులు సేఫ్ జోన్‌లో ఉన్నారా..?

ఎన్నికల సమయం ఆసన్నమైదంటే చాలు.. రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకోవడానికి తమ శక్తియుక్తులను కూడగట్టుకుని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తారు. ప్రజల మధ్యకు చేరుకుని వారిని ఆకట్టుకుని, ఆకర్షించడానికి చేసే యత్నాల గురించి ఎంత చెప్పినా తక్కువే..! ఇప్పుడు ఇదే విధంగా తెలంగాణలో ప్రచారం హోరెత్తుతుంది. పల్లెలు, పట్టణాల్లో రాజకీయ కోలాహలం నెలకొంది.

నామినేషన్లపర్వం ప్రారంభం కావటంతో అటు విపక్షాలు సైతం ప్రచారంలో జోరు పెంచాయి. ప్రచార రథాల రాక, మైకుల మోత, నేతల పర్యటనలు, కార్యకర్తల హడావిడితో పల్లెలు పట్టణాల్లో రాజకీయ కోలాహాలం నెలకొంది. ఎన్నికల గడువు నెల రోజులు కూడా లేకపోవటంతో, తెల్లవారింది మొదలు.. సాయంత్రం పొద్దుబోయేదాకా అభ్యర్థులు ఊరూవాడా చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న మంత్రులు అంతా సేఫ్ జోన్లో ఉన్నారా? ఎంత మంది మంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు? సేఫ్ జోన్‌లో ఉన్న మంత్రులు ఎవరు? రిస్క్ జోన్‌లోకి వెళుతున్నదీ ఎవరు అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కి‌ల్స్‌లో మొదలైంది.

పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల గెలుపోటములపై చర్చ మొదలైంది. ఇటు బెట్టింగ్‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. అధికార పార్టీకి చెందిన మంత్రుల్లో బరిలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో అన్న హాట్ హాట్ చర్చ మొదలైంది. కేసీఅర్ కేబినెట్‌లో ఉన్న మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్‌లు పోటీలో లేరు. మిగిలిన వారంతా బరిలో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావులను పక్కన పెడితే, మిగిలిన వారిపై చర్చ మొదలైంది. అటు కాంగ్రెస్ ,ఇటు బిజెపి పార్టీలు బరిలో ఉన్న మంత్రులపై బలమైన అభ్యర్థులను దింపే ప్రయత్నం చేసింది. అదే సమయంలో ప్రధాన పార్టీలు మంత్రుల నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాయి. ఆయా పార్టీల అగ్ర నేతలు మంత్రుల నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి వెళుతున్నారు.

మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డీ బరిలో ఉండడంతో నిర్మల్ నియోజకవర్గంపై అందరి నజర్ ఉంది. ఇటు ప్రశాంత్ రెడ్డిపై సునీల్ రిడ్డీ పోటీలో ఉండడంతో ఇప్పుడు బాల్కొండ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. ఇటు కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సై అనడంతో ఆ నియోజకవర్గం సెన్సేషనల్‌గా మారింది. ఇక ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ గెలుపోటములపై హాట్ హాట్ గా చర్చలు మొదలు అయ్యాయి. ఇటు పువ్వాడ అజయ్‌పై కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తుండడంతో ఆ సీటు ఫలితంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగి రెడ్డీ నిరంజన్ రెడ్డి పోటీలో ఉన్న నియోజకవర్గాల ఫలితాలపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్న సనత్ నగర్, మల్లా రెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గాల రిజల్స్ట్‌పై ఉత్కంఠ భరింతంగా మారింది.

మొత్తంగా పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ మంత్రులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు మారేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇక వీరి రాజకీయ భవిష్యత్ తేలాలంటే డిసెంబర్ మూడో తేదీ వరకు ఆగాల్సిందే..!

Telangana Election: హాట్ సీటుగా పాలేరు.. కాంగ్రెస్, సీపీఎం పొత్తు కటీఫ్.. ఎవరి ఓట్లకు గండి..!

తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ సీటుగా మారిన పాలేరు నియోజక వర్గంలో.. రోజుకో విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అందరూ ఊహించినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ షర్మిల పాలేరు పోటీ నంచి తప్పుకున్నారు. అనూహ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయితే షర్మిల తప్పుకున్నా.. ఇపుడు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీకి సై అంటున్నారు. దీంతో గెలుపు ఓటములను ప్రభావితం చేసే లెఫ్ట్ ఓటు బ్యాంకుతో.. ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంచనాలకు అందని, ఊహించని రాజకీయ పరిణామాలతో ఆసక్తి కరంగా మారింది. చివరి వరకు టికెట్‌పై ఆశ పెట్టుకున్న తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రె కి బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడంతో.. తుమ్మల కాంగ్రెస్ గూటికి చేరారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి, గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్ళు కడుగుతానని, దాని కోసమే పాలేర లో పోటీ చేస్తున్నట్లు తుమ్మల ప్రకటించారు. కానీ అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణాలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెరపైకి వచ్చారు. దీంతో తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు.

వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాలేరులో పోటీ చేస్తానని మాట ఇచ్చారు. నియోజకవర్గంలో నూతన క్యాంపు కార్యాలయం, సొంతంగా ఇళ్ళు కూడా నిర్మిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేశారు. అయితే ఉహించని విధంగా ఒక దశలో కాంగ్రెస్‌లో పార్టీ విలీనం పై చర్చలు జరిపారు. కానీ దానికి బ్రేక్ పడటంతో ఒంటరిగా పాలేరు లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు షర్మిల. కానీ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో పాలేరు రాజకీయం మరో మలుపు తిరిగింది. షర్మిల పోటీ చేస్తే..కాంగ్రెస్ ఓటు బ్యాంకు, వైఎస్ అభిమానుల ఓట్లు చీల్చి, అంతిమంగా పొంగులేటికి మైనస్ అయ్యి.. బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందనే లెక్కలు వేసుకున్నారు. ఆ ప్రచారమే జరిగింది. కానీ ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం కాంగ్రెస్‌కు ,ముఖ్యంగా పొంగులేటికి కొంత ఊరట కలిగించింది.

పాలేరు నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటి వరకూ ఉప ఎన్నికలతో కలుపుకుని 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, రెండు సార్లు సీపీఎం, ఒకసారి సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు గెలుపొందాయి. ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్, కాంగ్రెస్ మధ్య పొత్తులో సీట్ల సర్దుబాటు కుదరక, సీపీఎం, కాంగ్రెస్ మధ్య బ్రేకప్ అయ్యింది. దీంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంత నియోజకవర్గం కావడంతో, ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సీపీఎం పోటీతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ జరుగుతోంది. పాలేరులో కమ్యూనిస్టులు గెలిచే స్థితిలో లేకపోయినా, ఒకరి గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు ఉన్నాయి. సీపీఎం, సీపీఐలకు కొంత ఓటు బ్యాంకు ఉంది. ఇపుడు పోటీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుతారన్న భావిస్తున్నారు. అది మళ్ళీ అధికార బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ గా మారుతుందా.. అనే కోణంలో చర్చ జరుగుతోంది. గతంలో బలంగా ఉన్న వామ పక్షాలు రాను రానూ ఉద్యమాలకే పరిమితం అయ్యాయి. ఆ పార్టీ లు బలహీన పడ్డారనే వాదన వినిపిస్తోంది. మరి ఇపుడు పాలేరులో సీపీఎం పోటీతో ఎంత మేరకు ప్రభావితం చేస్తోంది..? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి..? అన్నదీ వేచి చూడాలి..!

Hyderabad: తగ్గేదేలే.. అంటూ పుష్ప సినిమాను మించిన సీన్.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

తగ్గేదేలే.. పుష్ప సినిమా ట్రెండ్ గురించి మనం చెప్పాల్సిన పనేలేదు.. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టర్.. ముఖ్యంగా గంధపు చెక్క అక్రమ రావాణా కథాంశంగా తీసిన ఈ సినిమా.. పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది.. త్వరలోనే పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ కానుంది. అయితే, పుష్ప సినిమా తర్వాత.. అక్రమ రవాణా ఎలా జరుగుతుంది..? ఇలాంటి స్టైల్లో కూడా రవాణా చేస్తారా..? అనే కొత్త విషయాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే.. అదే తరహాలో డబ్బు, గంజాయ్, బంగారం, డ్రగ్స్.. ఇలా ఎన్నో విలువైన వస్తువులు అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. అయితే.. తాజాగా.. పుష్ప సినిమా స్టైల్లో అక్రమంగా గంజాయ్ తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్‌ పేట్ బషీరాబాద్ ‌పీఎస్ పరిధి దూలపల్లి క్రాస్ రోడ్డు దగ్గర నిర్వహించిన వాహన తనిఖీలతో గంజాయి ముఠా ఆపరేషన్‌ బయటపడింది. కారు నెంబర్‌ AP 36 R 3033కి పుష్ప సినిమా తరహాలో ప్రత్యేకంగా సీటు అమర్చి గంజాయి సప్లై చేస్తున్న ముఠా పట్టుబడింది. కారు వెనుక‌ భాగంలో డిఫరెంట్ సెటప్ ఏర్పాటు చేశారు నిందితులు. కారు ఆపి తనిఖీ చేయగా 41 ప్యాకెట్‌లు, 82 రెండు కిలోల గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యుల బాగోతం బయటపడింది.

సుచిత్ర సెంటర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారును దూలపల్లిలో నిలిపి తనిఖీలు చేశారు పోలీసులు. నిందితుల నుంచి ‌కారు, రెండు సెల్ ఫోన్లు, ‌41 ప్యాకెట్‌లలో అమర్చిన 82 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అమర్నాథ్, సంజీవ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితులను లోతైన సమాచారం రాబడుతున్నారు పేట్ బషీర్‌బాద్ పోలీసులు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? వీరి ఆపరేషన్ ఎలా సాగుతుందనే కోణంలో కూపీ లాగుతున్నారు.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. గురువారం తులం గోల్డ్ ఎంతకు చేరిందంటే..

దేశంలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. రోజురోజుకీ ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం తులం బంగారంపై రూ. 200 వరకు పెరగగా ఈరోజు (గురువారం) కూడా గోల్డ్‌ ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి, రూ. 61,800కి చేరింది. ఇక దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690వద్ద కొనసాగుతోంది.

* ముంబయిలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 వద్ద కొనసాగుతోంది.

* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800గా ఉంది.

* ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,800గా ఉంది.

* ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. గురువారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది. ఒఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 77,500గా నమోదైంది.
* ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఫోన్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడమే. 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయి.

Telangana Elections: బోధన్‌లో నాన్ కేడర్ పాలిటిక్స్.. వారి ఓట్లపైనే అన్ని పార్టీల పోక‌స్

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన పవన్.. మూడు అంశాలపై క్లారిటీ ఇచారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఈపరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు పవన్. టీడీపీతో పొత్తు విషయం బీజేపీతో మాట్లాడి.. డిల్లీలో ప్రకటించాలి అనుకున్నా.. వైసీపీ తీరు వల్లే రాజమండ్రిలో ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చాక పొత్తులపై కోఆర్డినేషన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పవన్‌. ఇప్పటికి జనసేన ఎన్డీఏలోనే ఉందని స్పష్టం చేశారు పవన్. కూటమిలో బీజేపీ కచ్చితంగా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జగన్‌ ఎన్డీఏలో లేరని.. కేవలం ఆయనను ఒక రాష్ట్ర సీఎంగానే కేంద్రం గౌరవిస్తుందని చెప్పారు పవన్. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే నిధులు విడుదల చేసిందని బీజేపీ తనతో చెప్పిందన్నారు పవన్. వారాహి విజయయాత్రలో భాగంగా పెడనలో వైసీపీ ప్రభుత్వంపై పవన్‌ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని.

బోధన్ నియోజకవర్గం కొత్తగా నమోదైన మైనారిటీ ఓట‌ర్లపై బీజేపీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, బిలోలి ప్రాంతాలకు చెందిన మైనారిటీ వర్గాల వారిని బోధన్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతలు అక్రమంగా ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. దొంగ ఓట్లను తొలగించాలంటూ ఆందోళ‌న బాట ప‌ట్టింది బీజేపీ. ఏకంగా నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మెడ‌పాటి ప్రకాశ్ రెడ్డి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో దాదాపు 8 వేలా ఓట్లను తొల‌గించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు వేసిన స్కెచ్‌తో బీజేపీ మెజారిటీగా హిందూ ఓటు బ్యాంక్ పోల‌రైజెష‌న్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 8 వేల ఓట్లు పోవ‌డంతో డైలామాలో ప‌డింద‌ట బీఆర్ఎస్. ఇక హిందూ ఓటు బ్యాంక్‌ను చేసుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్ బీఆర్ఎస్. ఈనేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టాయి. బీజేపీతో ఇప్పటి వ‌ర‌కు ఉన్న వాళ్లను టార్గెట్ చేసి తమ పార్టీల్లోకి ఆక‌ర్షిస్తున్నార‌ట. బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్‌గా పైట్ మార‌డంతో ఏవ‌రి బ‌లం వాళ్లు చూపించుకోవాడానికి ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బీజేపీ ఫైర్
బీజేపీ నియోజక‌వ‌ర్గ ఇంచార్జ్‌గా ప్రకాశ్ రెడ్డి టికెట్ వ‌స్తే ఇబ్బంది అవుతుంద‌నే ఆలోచ‌న‌తో మ‌రో వ్యక్తికి టికెట్ వ‌స్తుంద‌నే మైండ్ గేమ్ అడుతున్నాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం పోటీ బీఆర్ఎస్, బీజేపీ మ‌ద్యే ఉండ‌టంతో.. కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ చేస్తుంద‌ని ఆరోపిస్తున్నార‌ు బీజేపీ నేతలు.ఇక ఇన్ని రోజులు క్యాడ‌ర్‌ను న‌మ్ముకున్న పార్టీలు ఇప్పుడు వ‌ర్గాల‌ను న‌మ్ముకోవ‌డం ఎల‌క్షన్ హీట్ క‌నిపించేలా చేస్తుంద‌ట. ఇప్పటికే ఎన్నిక‌ల వేడి స్టార్ట్ అయిపోవ‌డంతో బీజేపీ అభ్యర్థి ఫైన‌ల్ అయితే పోటి ఇంకా ర‌స‌వ‌త్తరంగా ఉండ‌నుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ‌ర్గాలు, కులాలు అంటూ బోధన్ పాలిటిక్స్ ఇంకా ఎన్ని మ‌లుపు తిరుగుతుందో వేచి చూడాలి..!

Minister KTR: ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంటు ఆపేయమంటారేమో..? కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్..

Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ మాటల తూటాలను పేల్చుతూ.. ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు (KTR) కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదంటూ పేర్కొన్నారు. ‘రైతుబంధు’ నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయడంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ద్వారా విమర్శలు గుప్పించారు.

ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో? అందులో కూడా కేసీఆరే కనిపిస్తారు కదా? అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతులు భరించరు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.

కాంగ్రెస్ అంటేనే.. రైతు విరోధి .. అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్.. కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది.. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక 3 గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.. అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్లర్ లో రాశారు.

Raja Singh: నన్ను, యోగిని చంపేస్తారట.. బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదు చేసిన బీజీపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

Telangana Assembly Election 2023: ఎన్నికల సమయంలో గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. తన భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తనతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కు ప్రాణహాని ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. చంపేస్తానంటూ కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ పేర్కొన్న రాజాసింగ్ బుధవారం తనకు మరో బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపారు. తనను, తన కుంటుంబాన్ని, ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోతో పాటు నగర పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు లేఖను రాజాసింగ్ విడుదల చేశారు. కాల్ చేసిన వ్యక్తి సుమారు 6 నిమిషాల పాటు మాట్లాడాడని.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ ఫిర్యాదులో తెలిపారు.

సిటీ పోలీసులకు ఇచ్చిన వీడియో స్టేట్‌మెంట్‌లో.. బుధవారం మధ్యాహ్నం 1:59 గంటలకు తనకు కాల్ వచ్చిందని రాజాసింగ్ చెప్పారు. “ఎన్నికలు లేదా కౌంటింగ్ రోజు ముందు నన్ను, నా కుటుంబానికి హాని కలిగిస్తామని కాలర్ బెదిరించాడు.. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గోష్‌మహల్‌లో ప్రచారం చేసేందుకు నగరానికి వచ్చినప్పుడు తమకు హాని తలపెడతామని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు.. ఆ నంబర్ కాలర్ ఐడీ విదేశాలకు చెందినది..’’ అంటూ రాజాసింగ్ తెలిపారు.

“ఈ వ్యక్తికి నా ప్రతి కదలిక గురించి హైదరాబాద్‌లో నివసించే వ్యక్తి నిరంతరం వివరిస్తున్నాడు. నా కుటుంబ సభ్యుల గురించి.. నేను ప్రచారానికి వెళ్లినప్పుడు.. ఏ బుల్లెట్ నడుపుతానో, అలాగే పలు విషయాల గురించి అతనికి తెలుసు” అని రాజా సింగ్ వివరించారు. “నేను గతంలో బెదిరింపు కాల్‌లను ఎదుర్కొన్నప్పటికీ, పోలీసులు ఈ ప్రత్యేక ముప్పును పరిష్కరించడం అత్యవసరం, ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్న ప్రస్తావన కారణంగా.. చర్యలు తీసుకోండి” అంటూ డిజిపికి విజ్ఞప్తి చేశారు.

కాగా.. వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం ఏడాది తర్వాత భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అంతేకాకుండా.. మళ్లీ బీజేపీ గోషామహాల్ టికెట్ ను కేటాయించింది. ఈ మేరకు ఫస్ట్ లిస్ట్‌లోనే బీజేపీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.