ICC World Cup 2023: టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. ప్రాక్టీస్‌లో గాయపడిన స్టార్‌ ప్లేయర్‌..

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్లు వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచింది. ఏడో మ్యాచ్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేయడంతో టీమిండియా ప్రపంచకప్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లను కూడా టీమిండియా ఓడించింది. టోర్నీలో లీగ్ రౌండ్‌లో టీమిండియా ఆఖరి, తొమ్మిదో ఓవరాల్ మ్యాచ్ ఆదివారం (నవంబర్‌ 12) నెదర్లాండ్స్‌తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌, నాకౌట్‌ గేమ్స్‌కు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ నెదర్లాండ్స్‌తో తమ మ్యాచ్‌కు ముందు బుధవారం (నవంబర్ 8) టీమ్‌ ఇండియా ప్రత్యామ్నాయ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఈ ప్రాక్టీస్‌లో బుమ్రా బాగానే బౌలింగ్ చేశాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లోనే బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తోన్న యువ వికెట్ కీపర్ అండ్‌ బ్యాటర్‌ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. బంతి బలంగా ఇషాన్ పొట్టను తాకింది. దీంతో ఇషాన్‌ మైదానంలో పడిపోయాడు. అయితే ఇషాన్‌కు తగిలిన గాయం తీవ్రమైనది కాదని తెలుస్తోంది. ఇక గాయం కారణంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మొత్తం టోర్నమెంట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్ తమ చివరి మ్యాచ్ నెదర్లాండ్‌తో ఆడనుంది. ఇందుకోసం ఆదివారం దక్షిణాఫ్రికాపై గెలిచిన అనంతరం సోమవారం సాయంత్రం కోల్‌కతా నుంచి నేరుగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు టీమిండియా ప్లేయర్స్‌. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది.

వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

Pongal 2024 : పొంగల్ రేసులోకి మరో తమిళ్ సినిమా.. ఆల్రెడీ అరడజను తెలుగు చిత్రాలు..

Pongal 2024 : తెలుగు వారికీ పెద్ద పండగ అంటే సంక్రాంతి. ఈ ఫెస్టివల్ ని బంధువులంతా కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు. ఇక అలాంటి పండుగలో మరింత సందడి పెంచడానికి సినిమా మేకర్స్ కూడా ఉత్సాహపడుతుంటారు. ఈక్రమంలోనే పొంగల్ కి థియేటర్స్ లో అదిరిపోయే సినిమాలు తీసుకు వచ్చి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటారు. ప్రేక్షకులు కూడా పండక్కి తమ అభిమాన హీరో సినిమా వస్తే చూడాలని ఆశిస్తుంటారు.

దీంతో ఇండస్ట్రీలోని స్టార్స్ ఆ పండక్కి వచ్చేందుకు పోటీ పడుతుంటారు. ఈక్రమంలోనే వచ్చే సంక్రాంతికి పండగ అంతా థియేటర్స్ వద్దనే ఉండబోతుందని తెలుస్తుంది. 2024 పొంగల్ బరిలో నిలిచేందుకు అరడజను తెలుగు సినిమాలు పోటీ పడుతుంటే, రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఆ బరిలో చేరేందుకు సిద్ధమవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ ‘గుంటూరు కారం’.. సంక్రాంతికి వస్తున్నామంటూ ముందుగా ప్రకటించారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇదే రోజు తేజ సజ్జా నటిస్తున్న ‘హనుమాన్’ కూడా రిలీజ్ కాబోతుంది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.

ఇక టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ తన 75వ చిత్రంగా ‘సైంధవ్‌’ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కాబోతుంది అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇదే రోజు రవితేజ ‘ఈగల్’ని కూడా తీసుకు వస్తున్నామంటూ ఆ చిత్ర నిర్మాతలు కచ్చితంగా చెప్పేసారు. ఈ రెండు సినిమాలు యాక్షన్ థ్రిల్లర్ జోనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.

వీటితో పాటు కింగ్ నాగార్జున నటిస్తున్న ‘నా సామిరంగ’, రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాలను కూడా సంక్రాంతికే తీసుకు రావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. కచ్చితమైన డేట్ ప్రకటించినప్పటికీ సంక్రాంతికి వస్తున్నామంటూ చెబుతున్నారు. ఇక ఈ రేసులోకి తమిళ హీరోలు కూడా వచ్చి చేరుతున్నారు. మామాఅల్లుళ్లు రజినీకాంత్, ధనుష్ పండక్కే వస్తున్నామంటున్నారు.

రజినీకాంత్ నటిస్తున్న ‘లాల్ సలామ్’ని సంక్రాంతికి తీసుకు వస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. తాజాగా ధనుష్ తన ‘కెప్టెన్ మిల్లర్’ని కూడా పొంగల్ కే తీసుకు వస్తున్నామంటూ ప్రకటించాడు. అయితే ఈ మామాఅల్లుళ్లు కచ్చితమైన డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. మరి ఈ చిత్రాలు అన్ని చెప్పినట్లు పండక్కే వస్తాయా? లేదా వెనక్కి తగ్గుతాయా? అనేది చూడాలి.

Salaar : ఆ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన ‘సలార్’ మూవీ మేకర్స్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..

ఇప్పుడు అంతా ‘సలార్’ కోసమే ఎదురుచూపులు. దాదాపు మూడు నెలల తర్వాత ఇటలీ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. గత కొన్నాళ్లుగా మోకాలీ నొప్పితో బాధపడుతున్న ప్రభాస్.. ఇటీవల ఇటలీలో సర్జరీ చేయించుకున్నారు. అనంతరం అక్కడే విశ్రాంతి తీసుకున్న ఆయన.. బుధవారం తిరిగి రాగా.. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ప్రభాస్ తిరిగి రావడంతో ‘సలార్’ ఆగయా.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు ఫ్యాన్స్. ఇక త్వరలోనే సలార్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ సెన్సెషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ కాగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

కేజీఎఫ్ చిత్రాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన నీల్.. ఇప్పుడు ప్రభాస్ ప్రధాన పాత్రలో సలార్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండడంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడూ చూడాలా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ షూరు కానున్నట్లు తెలుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో సలార్ ఈవెంట్స్ జరగనున్నాయని.. అన్నింటిలోనూ ప్రభాస్ పాల్గొని మీడియాతో ఇంట్రాక్ట్ కానున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే తాజాగా సలార్ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్ 22న విడుదల చేస్తున్నామని చిన్న క్లిప్ షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇన్నాళ్లుగా సలార్ వాయిదా అంటూ నెట్టింట జరుగుతున్న రూమర్లకు చెక్ పడింది. అలాగే హిందీ థియేట్రికల్ రైట్స్ విషయంలో సమస్యలు ఉన్నాయని.. దాంతో మరోసారి సినిమా వాయిదా పడుతుందని టాక్ నడుస్తోంది. దీంతో సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Bharateeyudu 2 : విజయవాడలో ఇండియన్ 2 షూటింగ్.. రెండు భాగాలుగా సినిమా..

Indian 2 : కమల్ హాసన్ హీరోగా శంకర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో హీరో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇటీవల ఈ మూవీ డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పడంతో షూటింగ్ చివరి దశకు వచ్చింది అందుకున్నారు.

అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా ఉందట. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. అయితే ఎడిటింగ్ టేబుల్ మీదకి సినిమా వచ్చినప్పుడు చాలా ఎక్కువ రన్ టైంతో వచ్చిందట. దానిని కట్ చేయడానికి కూడా పెద్దగా ఆస్కారం లేకపోవడంతో.. రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారట. ఇండియన్ 2, ఇండియన్ 3 గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయట. ఇప్పుడు ఈ ఇండియన్ 3కి సంబంధించిన షూటింగే జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ విజయవాడలో జరుగుతుంది.

కమల్ హాసన్ లేని సన్నివేశాలను శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఇండియన్ 3 షూటింగ్ కోసం కమల్ హాసన్ ని 40 రోజులు కాల్‌షీట్స్ అడిగారట. అందుకు కమల్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఇక ఇండియన్ 2ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే ఇండియన్ 3ని వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ చేయనున్నారట. అయితే ఈ రిలీజ్ వార్త రామ్ చరణ్ అభిమానులను భయపెడుతుంది. ఈ సినిమా షూటింగ్ వల్ల గేమ్ ఛేంజర్ చిత్రీకరణ లేటు అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇండియన్ 3కి మరో నలభై రోజులు అంటే గేమ్ ఛేంజర్ సంగతి ఏంటని కంగారు పడుతున్నారు.

Unstoppable with NBK: అన్‏స్టాపబుల్ షోకు రానున్న బాలీవుడ్ హీరో.. రష్మికతో కలిసి సందడి..

ఇప్పటివరకు సినిమాల్లో యాక్షన్ హీరోగా అలరించిన నందమూరి బాలకృష్ణ.. అటు యాంకరింగ్‏తోనూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలయ్య. ఇప్పటివరకు రెండు సీజన్స్ విజయవంతగా కంప్లీట్ చేసుకున్న ఈషో.. ఇప్పుడు సీజన్ 3 రన్ అవుతుంది. ఇందులో సెలబ్రెటీల సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. వారి వ్యక్తిగత విషయాల గురించి సైతం ఆసక్తికర ప్రశ్నలు వేసి అభిమానులకు కావాల్సిన విషయాలను తెలుసుకుంటారు బాలయ్య. అంతేకాకుండా తన కామెడీ టైమింగ్‏తో అలరిస్తుంటారు. ఇక ఇటీవల స్టార్ట్ అయిన సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ కోసం భగవంత్ కేసరి టీమ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాలో శ్రీలీల, కాజల్ హీరోయిన్లుగా నటించగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీలీల, కాజల్, అనిల్ రావిపూడి అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.

ఇక ఇప్పుడు నెట్టింట వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈషోలో యానిమల్ చిత్రయూనిట్ సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా, సందీప్ రెడ్డి వంగా రాబోతున్నారని తెలుస్తోంది. వీరి కాంబోలో తెరకెక్కిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్, టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

అయితే ఇప్పుడు వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ షోలో రణబీర్ కపూర్ పాల్గొంటే.. బాలయ్య హోస్టింగ్‏కు ఫిదా అయ్యే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా బాలయ్యకు రష్మిక ఫేవరేట్ హీరోయిన్ కూడా. దీంతో యానిమల్ టీం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ రాబోతుందనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు.

Guntur Karam: ‘దమ్ మాసాలా’ ఆల్ టైమ్ రికార్డ్.. ఆ టాప్ లిస్ట్‏లో గుంటూరు కారం సాంగ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం టీజర్ రిలీజ్ కాగా.. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన దమ్ మసాలా సాంగ్ మ్యూజిక్ లవర్స్‏ను ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేష్ క్రేజ్, చరిష్మాకు తగినట్లుగా రామజోగయ్య శాస్త్రి పవర్ఫుల్ లిరిక్స్ తో రాసిన ఈ పాటకు థమన్ అదిరిపోయే ట్యూన్ అందించారు. ఈ సాంగ్ అన్ని వర్గాల అడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. అంతేకాకుండా ఈ పాటలో మహేష్ లుక్స్ చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు దమ్ మసాలా సాంగ్ ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 19.2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని టాలీవుడ్ ఫస్ట్ డే అత్యధిక వ్యూస్ అందుకున్న పాటగా నిలిచింది.

ఇప్పటివరకు సౌత్ నుంచి వచ్చిన అన్ని హిట్ సాంగ్స్ లో 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టాప్ పాటలలో మొదటి స్థానంలో బీస్ట్ మూవీ అరబిక్ కతు సాంగ్ ఉంది. ఈ పాట ఏకంగా 23.27 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే రెండో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం నుంచి విడుదలైన దమ్ మసాలా సాంగ్ నిలవడం విశేషం. ఈ పాట ఇప్పటివరకు 17.42 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. మూడో స్థానంలో విజయ్ వారిసు సినిమాలోని రంజితమే సాంగ్ 16.68 మిలియన్ వ్యూస్‏తో నిలిచింది. ఇక విజయ్ నటించిన లియో చిత్రంలోని నా రెడీ సాంగ్ 16.55 మిలియన్ వ్యూస్ తో నాలుగో స్థానంలో నిలిచింది. సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ 16.38 మిలియన్ వ్యూస్ తో టాప్ 5 లోకి వచ్చింది. ఇవే కాకుండా కళావతి సాంగ్ 14.78 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని టాప్ 6గా నిలిచింది. ఈ జాబితాలో మొత్తం టాప్ 6 సాంగ్స్ లో మూడు పాటలు మహేష్ బాబువి ఉండడం విశేషం.

అక్కడ మునిగిపోయిన ఓడలో టన్నుల కొద్దీ బంగారం, వెండి, పచ్చలు..! మాదంటే మాదంటూ కొట్టుకుంటున్న 3దేశాలు

సముద్రంలో మునిగిపోయిన 17వ శతాబ్దానికి చెందిన ఒక ఓడ ధ్వంసానికి సంబంధించిన అవశేషాలను తిరిగి పొందింది. ధ్వంసమైన ఆ ఓడ శకలాలో బిలియన్ల డాలర్ల విలువైన 200 టన్నుల బంగారం, వెండి, పచ్చలు ఉన్నాయని నమ్ముతున్నారు. నీటి అడుగున నిక్షిప్తమైపోయిన నిధులను తిరిగి పొందేందుకు ఆ దేశం జాతీయ మిషన్‌ను ప్రకటించింది. ఈ సంచలనాత్మక సంఘటన కొలంబియాలో చోటు చేసుకుంది. నివేదికల ప్రకారం, కొలంబియా ప్రస్తుత అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ విషయాన్ని ప్రకటించారు. అతని పదవీకాలం 2026లో ముగుస్తుంది. అతని పదవీకాలం ముగిసేలోపు నిధిని స్వాధీనం చేసుకోవాలని కొలంబియా దేశం యోచిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

1708లో కొలంబియాలోని కార్టజేనా ఓడరేవులో మునిగిపోయిన ఓడ స్పెయిన్‌కు చెందినదని ఓ నివేదిక వెల్లడించింది. ఈ నౌకను బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించారు. ఇంతలో ఓడ పేలి మునిగిపోయింది. 1708లో పనామాలోని పోర్టోబెల్లో నుండి 14 వ్యాపార నౌకలు, మూడు స్పానిష్ యుద్ధనౌకలు ప్రయాణించాయి. కానీ, అది బారు చేరుకున్నప్పుడు అది బ్రిటిష్ స్క్వాడ్రన్‌ను ఎదుర్కొంది. ఆ సమయంలో స్పెయిన్‌లో వారసత్వ హక్కుపై స్పెయిన్, బ్రిటన్ మధ్య యుద్ధం జరిగింది. స్పానిష్ ఓడ కనిపించిన వెంటనే, బ్రిటీష్ వారు దాడిని ప్రారంభించారు. ఈ క్రమంలోనే స్పానిష్ ఓడను తగలబెట్టి పూర్తిగా నీళ్లలోకి మునిగిపోయేలా చేశారని పేర్కొంది.

నేటికి ఈ నిధి విలువ 20 బిలియన్ డాలర్లు. మునిగిపోయిన ఓడ 2015లో గుర్తించారు. కొలంబియా నేవీకి చెందిన డైవర్ల బృందం 3100 అడుగుల లోతులో నౌకను కనుగొంది. 2022లో కూడా ఓ బృందం ఓడ దగ్గరికి వెళ్లి అందులోని నిధిని ఫోటో తీశారు. కొలంబియా ఇప్పుడు జాతీయ మిషన్ కింద ఓడ నుండి బిలియన్ల డాలర్ల విలువైన నిధిని సేకరించబోతోంది. కొలంబియా సాంస్కృతిక శాఖ మంత్రి జువాన్ డేవిడ్ కొరియా మాట్లాడుతూ నిధిని వెలికితీసే చర్యలు ఆసన్నమవుతాయని అన్నారు. ఇది ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని, పనిని వేగవంతం చేయాలని రాష్ట్రపతి కోరారు.

ఇదిలా ఉంటే, మరోవైపు ఓడ సంపదపై వివాదం కూడా తలెత్తింది. స్పెయిన్, కొలంబియా, బొలీవియాకు చెందిన ఖరా ఖరా నేషన్ అనే తెగ వారు ఓడ నిధిపై దావా వేశారు. స్పానిష్ వారి పూర్వీకులను విలువైన లోహాలను తవ్వమని బలవంతం చేశారని గిరిజన దేశం పేర్కొంది. మునిగిపోయిన ఓడలోని వెలకట్టలేని నిధిని తమ పూర్వీకులు తవ్వించారని, అందుకే దానిపై తమకే హక్కు ఉందని చెప్పారు.

అదే సమయంలో, అమెరికన్ కంపెనీ గ్లోకా మోరా కూడా నిధిని క్లెయిమ్ చేసింది. 1981లో దాన్ని కనుగొన్నామని, ఆ తర్వాత ఓడ ఎక్కడ మునిగిపోయిందో కొలంబియా ప్రభుత్వానికి చెప్పిందని అమెరికా కంపెనీ చెబుతోంది. కొలంబియా ఓడ నిధిలో సగం విలువ చెల్లిస్తానని హామీ ఇచ్చిందని కంపెనీ ఆరోపించింది.

Viral: చెత్తకుప్పలో దొరికిన బ్యాగ్.. తెరిచి చూడగా కనిపించిన ఓ పెద్ద లెటర్.. అందులో ఏముందంటే.?

లచ్చిందేవి ఎవ్వరి తలుపు అంత ఈజీగా తట్టదు. ఒకవేళ తట్టిందంటే.. ఆడు కచ్చితంగా కోటీశ్వరుడు అవ్వాల్సిందే. అయితే ఇక్కడ ఓ బిచ్చగాడికి చిత్తు కాగితాలు ఏరుకునే సమయంలో ఓ నల్ల బ్యాగ్ దొరికింది. అందులో ఏమున్నాయో అని ఆశగా దాన్ని తెరిచి చూశాడు. అంతే.! కనిపించినవి చూసి దెబ్బకు కళ్లు తేలేశాడు. ఈ ఘటన మరెక్కడో కాదు.. మన భారతదేశంలోనే.. అదీనూ బెంగళూరులో చోటు చేసుకుంది. ఇక ఆ స్టోరీ ఇలా ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మీరూ ఓసారి చెక్ చేయండి.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తికి చెత్తకుప్పలో ఒక నల్ల బ్యాగ్ దొరికింది. ఇక అందులో డబ్బు ఉంటుందని ఆశతో ఓపెన్ చేసిన అతడికి దెబ్బకు లచ్చిందేవే వరిచింది. ఆ బ్యాగ్‌లో ఏకంగా 30 లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి. అంటే మన భారత కరెన్సీలో అది సుమారు రూ. 25 కోట్లు. ఈ ఘటన నవంబర్ 3వ తేదీన బెంగళూరులోని నాగవార రైల్వేస్టేషన్‌ పట్టాల వద్ద జరిగింది. ఆ బ్యాగ్ దొరికిన సదరు వ్యక్తి పేరు సాల్మన్. ఆ బ్యాగ్‌పై యునైటెడ్ నేషన్స్ ముద్ర ఉండగా.. సాల్మన్ ఇంటికి వెళ్లి దాన్ని తెరిచి చూశాడు కంగుతిన్నాడు. అంత డబ్బు చూసిన సాల్మన్‌కు రెండు రోజులు అస్సలు నిద్రపట్టలేదు. అనంతరం మూడో రోజున తన స్నేహితుడు, స్వరాజ్‌ ఇండియా సామాజిక కార్యకర్త అయిన ఆర్‌.కలీముల్లాను కలిసి జరిగిన విషయాన్ని వివరించాడు. అతడు ఈ విషయాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ దయానందకు తెలిపాడు.

సాల్మన్‌ నుంచి సదరు బ్యాగ్, డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అవి దొరికిన ప్రదేశాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. అలాగే బ్యాగ్‌లో లభించిన డాలర్లు నకిలీవని భావిస్తున్నారు ఖాకీలు. క్షుణ్ణంగా పరిశీలించేందుకు వాటిని రిజర్వు బ్యాంకుకు పంపినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆ బ్యాగ్ తెరిచినప్పుడు ఓ పెద్ద లెటర్ లభించడం విశేషం. అందులో ‘బ్యాగులో విషపూరితమైన రసాయనాలున్నందున.. తెరిచేటప్పుడు జాగ్రత్త’ అని పేర్కొని ఉంది.

America’s quietest town: ఆ నగరంలో స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు వాడితే జైలుకే..! రీజన్ ఏమిటో తెలిస్తే షాక్..

ప్రస్తుత కాలంలో ఫోన్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం. అప్పుడే పుట్టిన శిశువు నుంచి కాటికి కాళ్లు చాచిన ముదుసలికి సైతం సెల్ ఫోన్ జీవితంగా మారిపోయింది. మరి అలాంటి పరిస్థితిలో మీరు సెల్ ఫోన్‌ను ఉపయోగించకూడదంటూ నిషేధం చేస్తే.. అసలు ఇది నిజమేనా అని ఆలోచిస్తారు. అయితే సెల్ ఫోన్‌లను ఉపయోగించడంపై నిషేధం ఉన్న నగరం ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ నివసించే ప్రజలు ఫోన్‌లు లేదా ఆధునిక సాంకేతికతను ఉపయోగించరు. ఫోన్‌లు లేకుండా ఏ నగరం నడుస్తోందో.. అక్కడ ఉన్న ప్రజల జీవితం సాధారణంగా ఎలా సాగుతుందో ఈ రోజు తెలుసుకుందాం..
ఎలక్ట్రికల్ పరికరాలను వాడితే జైలు శిక్ష తప్పదు.
అమెరికాలోని ఓ నగరంలో సెల్ ఫోన్ పై నిషేధం అమల్లో ఉంది. వెస్ట్ ఆఫ్ అమెరికాలోని వర్జీనియాలోని పోకాహోంటాస్ కౌంటీలో ఉన్న గ్రీన్ బ్యాంక్ సిటీలోని ప్రజలు సాంకేతికతను ఉపయోగించరు.
మొబైల్, టీవీ , రేడియోను ఉపయోగించడం పై నిషేధం
ఈ నగరంలో నివసించే ప్రజలు మొబైల్, టీవీ , రేడియోలను ఉపయోగించరు. ఈ పరికరాలు ఈ నగరంలో పూర్తిగా నిషేధించబడ్డాయి. ఈ నగరంలో ఈ పరికరాలను ఉపయోగించిన ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. అంటే ఇక్కడ నివసించే వారు ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
ఎందుకు ఉపయోగించలేరంటే
నిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ ఈ నగరంలో ఉంది. ఈ ఊరి జనాభా కేవలం 150 మంది మాత్రమే. ఈ గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ చాలా పెద్దది. దీని పొడవు 485 అడుగులు.. బరువు 7600 మెట్రిక్ టన్నులు. ఈ టెలిస్కోప్ గొప్పదనం ఏమిటంటే టెలిస్కోప్ కదిలే విధంగా ఉంటుంది.. అంటే దీనిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా మార్చుకోవచ్చు. అమెరికా నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ ఈ స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ సమీపంలో ఉంది. ఇక్కడి నుంచి అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చే అలలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. ఈ నగరంలో ఎలక్ట్రిక్ పరికరం ఉపయోగించకపోవడానికి కారణం ఇదే.
1 2 3 15