ATM Withdrawal: ఏటీఎమ్‌లో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలో తెలుసా.?

ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ పెరిగిన ఈ రోజుల్లోనూ ఇప్పటికీ ఏటీఎమ్‌లో డబ్బులు విత్‌డ్రా చేస్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ఏటీఎమ్‌లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం సులభతరమైంది. అయితే ఏటీఎమ్‌లో డబ్బు తీసుకునే సమయంలో చిరిగిన నోట్లు రావడం కూడా సర్వసాధారణమైన విషయం తెలిసిందే.

మనలో చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. చిరిగిన నోట్లను మార్చుకోవడం అంత సులభమైన విషయమేమి కాదు. ఎవరికీ ఇచ్చినా తీసుకోవడానికి నిరాకరిస్తుంటారు. మరి ఏటీఎమ్‌ నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి.? బ్యాంక్‌ నియమాలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.. ఏటీఎమ్‌ల నుంచి చిరిగిన నోట్లు వస్తే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకునే వెసులుబాటు ఉందని మీకు తెలుసా.? అవును.. మ్యుటిలేడెట్ నోట్లను సులభంగా భర్తీ చేసుకోవచ్చు. ఏటీఎమ్‌లో వచ్చిన చిరిగిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు నిరాకరించకూడదని ఆర్‌బీఐ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. కేవలం నిమిషాల్లోనే నోట్లను మార్చుకోవచ్చు.

ఇందుకోసం మీకు చిరిగిన నోటు వచ్చిన ఏటీఎమ్‌ లింక్‌ చేసిన బ్యాంకులో సంప్రదించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకుకు వెళ్లి అప్లికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం, ఏటీఎమ్‌ పేరును పేర్కొనాలి. దీంతో పాటు ఏటీఎమ్‌ ట్రాన్సాక్షన్‌ తర్వాత వచ్చే స్లిప్‌ను అప్లికేషన్‌కు జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్లిప్‌ ఇవ్వకపోతే మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించినా సరిపోతుంది. ఈ వివరాలను అన్నింటినీ అందిస్తే వెంటనే బ్యాంకులో నోట్లను మార్చుకోవచ్చు. చిరిగిన నోట్లను మార్చడాన్ని బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో నిరాకరించకూడదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2017 ఏప్రిల్‌లో తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఏటీఎమ్‌లలో చిరిగిన నోట్లు రాకుండా ఉండడానికి దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ అత్యాధునిక నోట్ సార్టింగ్ మిషన్‌ను ఉపయోగిస్తుంది. దీంతో చిరిగిన నోట్లు ఏటీఎమ్‌లో రాకుండా చేస్తుంది. అయితే ఒకవేళ పొరపాటున ఏదైనా చిరిగిన నోటు వచ్చినా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇదిలా ఉంటే ఒకవేళ ఏదైనా బ్యాంకు చిరిగిన నోటును మార్చడానికి నిరాకరిస్తే రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం చిరిగిన నోట్లను మార్చే బాధ్యత బ్యాంకుపై పాత్రమే ఉంటుంది. డబ్బును ఏటీఎమ్‌లో ఇన్‌స్టాల్‌ చేసే ఏజేన్సీలకు ఎలాంటి సంబంధం ఉండదు.
ఇక చిరిగిన నోట్లను బ్యాంకులు మాత్రమే కాకుండా రిజర్వ్‌ బ్యాంక్ కార్యాలయాల్లో కూడా మార్చుకోవచ్చు. ఆర్‌బీఐ నిబంధలన ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు, ఈ నోట్ల గరిష్ట విలువ రూ. 5000 మించకూడదు. అయితే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. నోట్లు బాగా కాలిపోయినా, ముక్కలుగా మారినా వాటిని మార్చుకోవడానికి కుదరదు.

Ducati Multistrada V4 RS: రేసింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. డుకాటి నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్.. టాప్ రేంజ్.. సెన్సేషనల్ ఫీచర్స్..

స్పోర్ట్స్ బైక్ లకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాటి ధర ఎక్కువైన అధిక సామర్థ్యం కలిగిన ఈ తరహా బైక్ లను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. అయితే ఈ స్పోర్ట్స్ బైక్ లలో డుకాటి కంపెనీ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ క్రమంలో డుకాటి కంపెనీ మరో కొత్త స్పోర్ట్స్ బైక్ ను ఆవిష్కరించింది. డుకాటి మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ పేరుతో దీనిని ఆవిష్కరించింది. దీనిలో ఏకంగా 1103 సీసీ ఇంజిన్ ఉంటుంది. పూర్తి స్థాయి స్పోర్ట్స్ లుక్ లో అదరగొడుతుంది. దీనిలో టైటానియం సబ్ ఫ్రేమ్, లైట్ వెయిట్ తో అధిక పనితీరు అందించే విధంగా డ్రైవింగ్ మోడ్లు ఉంటాయి. ఈ బైక్ 180 బీహెచ్పీ పవర్, 118ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వీ4ఆర్ఎస్ బైక్ చాలా శక్తివంతమైంది. ఇంతకు ముందుకు ఉన్న మల్టీస్ట్రాడా వీ4 పైక్స్ పీక్ బైక్ కంటే చాలా సామర్థ్యం కలిగినది. ఈ మల్టీస్ట్రాడా వీ4ఆర్ఎస్ అత్యంత శక్తివంతమైన డ్రై క్లచ్ ఉంటుంది. ఈ బైక్ లో సన్నటి ఫ్లాట్ హ్యాండిల్ బార్ ఉంది.

ఎప్పుడు లాంచింగ్ అంటే.. ఇప్పటికే ఈ డుకాటి మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ ను ప్రదర్శంచిన కంపెనీ మార్కెట్లోకి 2024 జనవరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 31.48లక్షలు ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

డుకాటి మల్టీస్ట్రాడా వీ4ఆర్ఎస్ డిజైన్.. దీనిలోని భాగాలు కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. ఐస్ బర్గ్ వైట్ లివరీని కలిగి ఉంది. ఈ బైక్ లో టెక్నో పాలిమర్ టైల్, టైటానియం సబ్ ఫ్రేమ్ ఉంటుంది. వీటి సాయంతో 2.5 కేజీ తక్కువ బరువుతో ఉంటుంది. ఈ బైక్ కి ఇరు పక్కలా సైడ్ కేసెస్.. ప్యాసెంజర్ సీట్ బ్యాగ్స్ ఉంటాయి.

రెండు మోడ్లు.. ఈ బైక్లో రెండు మోడ్లు ఉంటాయి. ఫుల్ పవర్, రేస్ రైడింగ్ మోడ్లు ఉంటాయి. స్టాండర్డ్ రేర్ రాడార్ కంట్రోల్ టెక్నాలజీ ద్వారా అడాప్టివ్ కంట్రోల్ క్రూయిజ్ కంట్రోల్ అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సాధ్యమవుతుంది.

భద్రతకు భరోసా.. ఈ బైక్ లో పవర్ మోడ్, ఏబీఎస్ కార్నరింగ్, డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్, డుకాటి వీలీ కంట్రోల్, డేటైం రన్నింగ్ లైట్, వెహికల్ హోల్డ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.

హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్ల ధరల్లో వృద్ధి

హైదాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 13 శాతం పెరిగాయి. చదరపు అడుగు రూ.10,410గా ఉంది. ఈ వివరాలను క్రెడాయ్, కొలియర్స్, లైసెస్‌ ఫొరాస్‌ సంయుక్తంగా విడుదల చేసిన ‘హౌసింగ్‌ ప్రైస్‌ ట్రాకర్‌ రిపోర్ట్‌ క్యూ1 2023’ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున 8 శాతం మేర క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు పెరిగాయి.

 
రానున్న రోజుల్లో ధరల పెరుగుదల మోస్తరుగా ఉండొచ్చని లైసెస్‌ ఫొరాస్‌ ఎండీ పంకజ్‌ కపూర్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్‌ ధరల ఫలితంగా ఇళ్ల ధరలు కూడా పెరిగాయి. అయినా కానీ, స్థిరమైన డిమాండ్‌ నెలకొంది. ఈ బలమైన ధోరణి కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. కొత్త ఇల్లు కొనుగోలు పట్ల వినియోగదారులు స్పష్టమైన ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఇళ్లు, మెరుగైన సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు, వడ్డీ రేట్ల రూపంలో ఎదురైన సవాళ్ల మధ్య హౌసింగ్‌ రంగం బలంగా నిలబడినట్టు కొలియర్స్‌ సర్వీసెస్‌ కు చెందిన అక్యుపయర్‌ సర్వీసెస్‌ ఎండీ పీయూష్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. సొంతిల్లు కలిగి ఉండేందుకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో అందుబాటు ధరలు, నాణ్యతో కూడిన ప్రాజెక్టులు ఈ రంగం వృద్ధికి తోడ్పడతాయన్నారు. 

హైదరాబాద్‌లో కోరమ్‌ ‘డిస్ట్రిక్ట్‌150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు

Follow Us :

ఆఫీసు కార్యకలాపాలు, సమావేశాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వంటి ఈవెంట్ల నిర్వహణకు కూడా వేదికగా ఉపయోగపడేలా హైదరాబాద్‌లో ’డిస్ట్రిక్ట్‌150’ పేరిట కొత్త వెంచర్‌ను ప్రారంభిస్తున్నట్లు కోరమ్‌ క్లబ్‌ వెల్లడించింది. దేవ్‌భూమి రియల్టర్స్‌ భాగస్వామ్యంలో రూ. 16.5 కోట్ల పెట్టుబడితో దీన్ని నెలకొల్పుతున్నట్లు మంగళవారం విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో వివేక్‌ నారాయణ్‌ వెల్లడించారు. 

దాదాపు 35,000 చదరపు అడుగుల  విస్తీర్ణంలో ఉండే ’డిస్ట్రిక్ట్‌150’ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు వివరించారు. ఇందులో ఒపెరా తరహా హాల్, పాడ్‌కాస్ట్‌ రికార్డింగ్‌ స్టూడియో, కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, థియేటర్, జిలా బ్రాండ్‌ ఇండియన్‌ రెస్టారెంట్, సబ్‌కో కాఫీ బ్రాండ్‌ మొదలైనవి ఉంటాయని పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో 8 పైగా ఇటువంటి వెంచర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి వెంచర్‌ను బెంగళూరులో నెలకొల్పుతున్నట్లు నారాయణ్‌ వివరించారు.