Vijayadashami: ఆర్మీతో కలిసి ఆయుధపూజ చేసిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ..

దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయుధ పూజ ఘనంగా నిర్వహిస్తున్నారు.  అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వార్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో సరిహద్దులను కాపాడుతున్న సైనికులను రక్షణ మంత్రి కొనియాడారు. పుష్పగుచ్ఛం ఉంచిన అనంతరం సైనికులను ఉద్దేశించి రక్షణ మంత్రి మాట్లాడుతూ..  తమ విధి నిర్వహణలో సైనికులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలని ఉద్ఘాటించారు. సైనికుల అంకితభావంతో దేశానికి గర్వకారణమని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సైనికుల యూనిఫాం ప్రాముఖ్యత, సరిహద్దుల భద్రతను నిర్ధారించడంలో వారి ముఖ్యమైన పాత్రను రక్షణ మంత్రి రాజ్ నాథ్ మరోమారు ప్రస్తావించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రపంచ వేదికపై భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఆ ధైర్యాన్ని ఇచ్చిన ఘనత సైనికులకు సొంతం అని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సాధించిన ఆర్థికాభివృద్ధి, ప్రగతిని ప్రశంసించిన రక్షణ మంత్రి, సరిహద్దుల రక్షణలో సైనికుల కృషి లేకుండా ఇలాంటి విజయాలు సాధించలేవని ఉద్ఘాటించారు.

తవాంగ్‌లో ఆయుధ పూజ
తన పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ వ్యూహాత్మకంగా ముఖ్యమైన తవాంగ్ సెక్టార్‌లో మోహరించిన సైనికులతో సమావేశమయ్యారు. తవాంగ్‌లో సాంప్రదాయకమైన ఆయుధ పూజను నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతే కాకుండా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయన సైనికులతో కలిసి విజయదశమి వేడుకలు జరుపుకున్నారు. తవాంగ్ సెక్టార్‌లో చైనా పిఎల్‌ఎ ఆక్రమణలకు సంబంధించిన అనేక సంఘటనలు జరిగాయి. గత ఏడాది డిసెంబర్‌లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)ని ఉల్లంఘించింది. అప్పటి నుండి సరిహద్దుల వద్ద మరింత భద్రత పెంచడం ఆవశ్యకత గురించి పదే పదే చెబుతూనే ఉంది. తగిన ఏర్పాట్లు చేస్తూ.. ఆర్మీకి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఉంది.

Char Dham yatra : పాత రికార్డులన్నీ బద్దలు కొట్టిన చార్‌ధామ్‌ యాత్ర.. తొలిసారిగా 50 లక్షల మార్కును దాటింది!

ఈసారి చార్ ధామ్ యాత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. ఈ ఏడాది చార్ ధామ్‌ను సందర్శించిన భక్తుల సంఖ్య గతంలోని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ ఏడాది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న వారి సంఖ్య 50 లక్షల మార్కును దాటింది. చార్‌ధామ్ యాత్రను సందర్శించే భక్తుల సంఖ్య పెరగడం అన్నిరకాల అనుకూల పరిస్థితులు ఉన్నాయి. వాతావరణం, రహదారుల నిర్వహణ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమర్థ నిర్వహణను చూపుతుంది. డిసెంబర్‌లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు ముందు, ఈ గణాంకాలు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే చాలా మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.

2021లో కోవిడ్ మహమ్మారి కారణంగా యాత్రకు నష్టం వాటిల్లినందున 5.18 లక్షల మంది భక్తులు మాత్రమే సందర్శించగలిగారు. 2022లో 46.27 లక్షల మంది భక్తులు తీర్థయాత్రకు వచ్చారు. 27 డిసెంబర్ 2016న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌లో ఆల్-వెదర్ రోడ్‌కు శంకుస్థాపన చేయడం ద్వారా మెరుగైన కనెక్టివిటీకి ఒక ముఖ్యమైన అడుగు వేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రాథమిక లక్ష్యం చార్ ధామ్: యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు అన్ని వాతావరణ కనెక్టివిటీని మెరుగుపరచడం.

ఈ ప్రాజెక్ట్ యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణాను అందించింది. వాతావరణ పరిస్థితులు లేదా సహజమైన అడ్డంకులు లేకుండా వారి ప్రయాణాన్ని చేపట్టేందుకు వీలు కల్పించింది. ఈ శాశ్వత రహదారి ప్రాజెక్ట్ పూర్తి చేయడం వల్ల ఈ ప్రాంతానికి, అక్కడి నివాసితులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దీని సానుకూల ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇది పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ ప్రాంతంలో వాణిజ్యాన్ని కూడా సులభతరం చేస్తుంది. ఇది ఉత్తరాఖండ్ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేస్తుంది.

Vastu Tips: ఈ మొక్కలను ఇంట్లో పెంచితే.. అదృష్టం కలిసి వస్తుంది!

ఇంట్లోని అందరూ సంతోషంగా, శ్రేయస్సుతో ఉండాలంటే.. వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి. ఇంట్లో సరైన విధంగా వాస్తు లేకపోతే.. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, పేదరికం తాండవిస్తుంది. ఇలాంటివేమీ లేకుండా ఉండాలంటే.. కొన్ని రకాల వాస్తు టిప్స్ మనకు బాగా సహకరిస్తాయి. ఇంట్లోని వస్తువులు, మనుషులకే కాదు.. మొక్కలను పెంచడానికి కూడా వాస్తు ఉంటుందన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కొన్ని రకాల మొక్కలను ఈ దిక్కుల్లో పెడితే.. ఇంట్లో ఆరోగ్యం, అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ మొక్కలు ఏంటి? వాటిని ఏ దిక్కుల్లో పెడితే మంచిదో ఇప్పుడు చూద్దాం.

అరటి చెట్టు:

అరటి చెట్టును విశాలంగా ఉంటుంది కాబట్టి.. చాలా మంది దీన్ని ఇంట్లో పెంచరు. కానీ దీన్ని కూడా చిన్న కుండీల్లో నాటవచ్చు. ఈ అరటి చెట్టు తూర్పు దిక్కన పెట్టాలి. అరటి చెట్టును ఇంట్లో పెంచడం వల్ల శ్రేయస్సు పెరుగుతుంది. అంతే కాకుండా అరటి చెట్టు దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్ర పరుస్తుంది.

మనీ ప్లాంట్:

ఇప్పుడు ఈ మొక్క అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. ఈ మొక్క ఆరోగ్యంగా ఎదిగితే.. ఇంట్లో కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండని అందరూ భావిస్తూంటారు. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంటి ఆగ్రేయ మూలలో ఉంచాలి. ఇలా చేస్తే వాస్తు దోషాలు తొలగుతాయి.

అశోక చెట్టు:

అశోక చెట్టుకు మంచి శుభ శక్తులు ఉంటాయని నమ్మకం. అందుకే దీన్ని పవిత్రమైన మొక్కగా గుర్తిస్తారు. ఈ చెట్టు ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి. ఇది ఇంటికి సాను కూల శక్తిని తెస్తుంది.

తులసి మొక్క:

తులసి మొక్క గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మొక్క గురించి అందరికీ తెలుసు. తులసి మొక్కను కూడా పవిత్రమైన మొక్కగా భావించి పూజలు అనేవి చేస్తూంటారు. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల వాస్తు దోషాలు తొలగి.. కుటుంబం అంతా ఆనందంగా ఉంటారు. తులసిని ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులో పెట్టాలి. ఇలా పెడితే శుభ ఫలితాలు ఉంటాయి. తులసి మొక్క అస్సలు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయదు. కాబ్టటి ఇది ఆరోగ్యంగా కూడా చాలా మంచి ఫలితాలను అందిస్తుంది.

లక్కీ బ్యాంబూ మొక్క:

ఇప్పుడు చాలా మంది లక్కీ బ్యాంబూ మొక్కను కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. దీని వల్ల కూడా అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారు. ఈ మొక్క సంపద, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. అందుకే ఇది ఇండోర్ ప్లాంట్ గా బాగా ప్రాచూర్యం పొందింది. ఈ మొక్కను ఇల్లు లేదా ఆఫీసుల్లో ఉంచడం వల్ల అన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది.

Ayodhya Ram Mandir: అయోధ్య రాములవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రండి.. ప్రధాని మోదీని ఆహ్వానించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు

Ram Mandir Prana Pratishtha: శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ ముహూర్తం ఖరారు అయింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్, నృపేంద్ర మిశ్రా, మరో ఇద్దరు ప్రధాని మోదీని కలిసి.. ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ట్రస్ట్ సభ్యుల అభ్యర్థన మేరకు, ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు.

విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ ముహూర్తం ఖరారు అయింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్, నృపేంద్ర మిశ్రా, మరో ఇద్దరు ప్రధాని మోదీని కలిసి.. ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ట్రస్ట్ సభ్యుల అభ్యర్థన మేరకు,  ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు.

వెయ్యేళ్లు అయినా సరే.. చెక్కు చెదరని.. ప్రపంచంలోనే అత్యద్భుతమైన రామమందిర నిర్మాణం జరుగుతోంది. భక్తుల ఆశలకు.. ఆకాంక్షలకు అనుగుణంగా రామమందిర నిర్మాణం పూర్తి అయ్యింది. ఈక్రమంలోనే.. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని… అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది.

రాంలాలా ప్రతిష్ట ఎప్పుడంటే..
2024 జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి అయోధ్యలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ మందిర ప్రాణప్రతిష్ఠపన మహోత్సవానికి రావాలంటూ స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఇలా రాశారు- ‘జై శ్రీరామ్! ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. ఇటీవల శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆయన నన్ను ఆహ్వానించారు. ఇది రాములవారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. అంటూ ట్వీట్ ప్రధాని మోదీ చేశారు.

Jagannath Temples: పూరీ తరహా భారత్‌లోని ప్రసిద్ధ జగన్నాథ దేవాలయాలివే.. ఆ దేశంలోనూ..

Jagannath Temples: జగన్నాథ ఆలయం అనే మాట వినగానే ఒడిశాలోని పూరి క్షేత్రమే అందరికీ గుర్తు వస్తుంది. కానీ పూరీ దేవాలయంతో పాటు దేశంలో కూడా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. మైయన్మార్‌లోనూ ప్రసిద్ధ జగన్నాథ దేవాలయం ఉంది.

స్వామివారి రథాన్ని చూసిన భాగ్యం.. తాకిన ధన్యం.. అందుకే భక్తకోటి పురవీధుల్లోకి వేంచేసి స్వామివారికి స్వాగతం పలుకుతుంటారు. దేవదేవుల రథాలను లాగడానికి భక్తజనులు పోటీ పడుతుంటారు. దాదాపు పదిహేను లక్షల మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య.. జగన్నాథుడి వైభవం చూడతరమా.. స్వామివారి ఆలయం దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గుండీచా మందిరం వరకు ప్రతి ఏటా ఈ రథోత్సవం ఉంటుంది. కానీ మూడు కిలోమీటర్లలో జనాలు కిక్కిరిసిపోతారు.

గుండీచా మందిరం చేరుకున్నాక.. రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయాన్నే మేళతాళాలతో లోపలికి తీస్కెళ్తారు. అక్కడే స్వామి వారు ఏడు రోజుల పాటు ఉంటారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగుముఖం పడతారు. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ మర్నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతులిస్తారు. ద్వాదశి నాడు తిరిగి విగ్రహాలను ర్నతసింహాసనంపై ప్రతిష్టించడంతో ఈ యాత్ర పూర్తవుతుంది. స్వామిలేక చిన్నబోయిన పూరీ ఆలయం తిరిగి కళకళలాడటం మొదలవుతుంది.

సాక్షాత్తూ భగవంతుడే తన మందిరం వీడి.. పురవీధుల్లోని అందరినీ పలకరిస్తూ పులకరించే ఉత్సవ వేళ.. పూరీలో వైకుంఠమే దిగివచ్చిన అనుభూతి.
భక్తుల మోదమే తప్ప తనకు ఎలాంటి భేదమూ తెలియదని.. వైకుంఠనాధుడే వినయంగా విన్నవించుకునే విడ్డూరమిది.
ఆడినా.. పాడినా.. కలిసినా.. కలహించినా.. అన్నీ ఆ జగన్నాధునితోటే. ఇక్కడ వేదనలుంటాయి. వేదనలకు తోడు నివేదనలూ ఉంటాయి. అన్నింటినీ సాంత్వన పరిచే జగన్నాథ తత్వమూ ఉంటుంది. ఇంత అబ్బుర పరిచే రథోత్సవ విన్యాసాలు.. బహుశా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా ఉండవంటే అతిశయోక్తి కాదు.

పూరీలో రథయాత్రే కాదు.. ఆలయంలోనూ అడుగడుగునూ విశిష్టతలే.. పూరీ దేవాలయంలో మూల విరాట్‌ నుండి ప్రసాదం వరకు అంతా విశిష్టమే. దేవాలయాల్లో ఎక్కడ చూసినా మూలవిరాట్‌ విగ్రహాలు రాతితో ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు పంచలోహములతో తయారుచేస్తారు. కానీ ఈ విశిష్ట దేవాలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి. అదే విగ్రహాలు ఉత్సవమూర్తులుగా ఊరేగింపబడతాయి. ప్రసాదంగా ఇచ్చే అన్నం, పప్పు మొదలైనవి కుండల్లోనే వండుతారు. ఇతర దేవాలయాల్లో మాదిరిగా స్వామి తన దేవేరులతో కాకుండా.. సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కొలువై ఉంటాడు.

Ganesh Temples: దర్శనంతోనే దోషాలు తొలగించే ఈ 5 గణపతి ఆలయాలు.. జోడీ మేకర్‌గా ఫేమస్ ఈ గుడి

గణేశుడు జ్ఞానానికి అధిపతి. భారతదేశంలో గణేశుడికి సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లోని గణేషుడిని దర్శనంతోనే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ రోజు గణేశుడికి సంబంధించిన ప్రముఖ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి, పూజ  ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..
హిందూ సనాతన ధర్మంలో ఆదిపూజ్యుడు విఘ్నలకధిపతి గణేశుడు. ఏ భక్తుడైనా ముందుగా గణపతిని నిష్టతో, భక్తితో పూజిస్తే శుభాలు జరుగుతాయి.. జీవితం సుఖమయం అవుతుంది. గణపతిని ఆరాధించడం ద్వారా జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగి సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం. జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆశించిన విజయం లభిస్తుంది. గణేశుడు జ్ఞానానికి అధిపతి. భారతదేశంలో గణేశుడికి సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లోని గణేషుడిని దర్శనంతోనే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ రోజు గణేశుడికి సంబంధించిన ప్రముఖ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి, పూజ  ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

సిద్ధి వినాయక దేవాలయం (ముంబై): ముంబయిలోని సిద్ధివినాయక దేవాలయం దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఒక భక్తుడు సిద్ధివినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత అతడిపై అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. గణపతి ఆశీస్సులతో ఎటువంటి సమస్యలైనా క్షణాల్లో పరిష్కారమవుతాయి. సిద్ధి వినాయక దేవాలయాన్ని సామాన్యులు మాత్రమే కాదు.. బాలీవుడ్ , టీవీ పరిశ్రమకు చెందిన పెద్ద ప్రముఖులు దర్శించుకుంటారు. తమ కోరికను గణపయ్యకు చెప్పుకోవడానికి చెప్పులు లేకుండా ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం దేశంలోని గొప్ప గణపతి దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారీ సంఖ్యలో భక్తులు కానుకలు సమర్పిస్తారు.

దగ్దుసేత్ హల్వాయి మందిర్ (పుణె): పూణేలోని సుందర్ నగర్‌లోని గణపతికి కి చెందిన దగ్దుసేత్ హల్వాయి ఆలయం అద్భుతాలతో నిండి ఉంది.  ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. ఈ ఆలయాన్ని దగ్దుసేత్ హల్వాయి నిర్మించాడని అప్పటి నుంచి ఈ పేరుతోనే ప్రసిద్ధిగాంచింది. బంగారంతో చేసిన గణపతి  విగ్రహాన్ని దర్శనంతోనే అన్ని బాధలు తొలగిపోయి కోరికలు కూడా తీరుతాయని నమ్మకం.

Balamurugan Statue: ఎత్తైన ఏకశిలా బాలమురుగన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు.. 2000 లీటర్ల పాలతో అభిషేకం

కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు, బలమురుగన్ వంటి పేర్లతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ముఖ్యంగా తమిళనాడులో బలమురుగన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో  40 అడుగుల ఎత్తు.. 180 టన్నుల బరువుతో కూడిన ఏకశిలా విగ్రహం భక్తులను కనువిందు చేసింది. 2వేల లీటర్ల పాలతో ఏకశిలా విగ్రహాన్ని అభిషేకించారు. శివ పార్వతుల తనయుడు తారకాసుర వధ కోసం జన్మించిన వాడు సుబ్రమణ్య స్వామి. మన దేశ వ్యాప్తంగానే కాదు మలేషియా వంటి దేశాల్లో కూడా సుబ్రహ్మణ్యుడి అనేక దేవాలయాలున్నాయి. కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు, బలమురుగన్ వంటి పేర్లతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ముఖ్యంగా తమిళనాడులో బాలమురుగన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో  40 అడుగుల ఎత్తు.. 180 టన్నుల బరువుతో కూడిన ఏకశిలా విగ్రహం భక్తులను కనువిందు చేసింది. 2వేల లీటర్ల పాలతో ఏకశిలా విగ్రహాన్ని అభిషేకించారు. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్ తాండలం దగ్గర 40 అడుగుల ఎత్తు.. 180 టన్నుల ఉన్న ఏకశిల విగ్రహం విశ్వరూప బాలమురుగన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాలకు సుమారు 2000 వేల లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. రత్నగిరి బాలమురుగన్ స్వామి నేతృత్వంలో 108 మంది మహిళలు పాల బిందెలు తీసుకుని వచ్చి మురుగన్ కు పాలాభిషేకం చేశారు.స్వామి వారికీ చేసిన పాలాభిషేకం భక్తులను కనువిందు చేసింది. కొండల నుంచి జాలు వారీ జలపాతాన్ని తలపిస్తూ.. మురుగన్ విగ్రహం మీద నుంచి పాల ధార జాలువారింది… ఇది చూసిన భక్తులు దైవంపై భక్తితో    ఆనందంతో పరవశించిపోయారు. అంతకుముందు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Srikalahasti: శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు

Srikalahasti – Governing Council: శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి ఇవాళ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం పాలక మండలి ఛైర్మన్ శ్రీనివాసులు (Srinivasulu) వివరాలు తెలిపారు.ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న 4 దేవాలయాలకు కుంభాభిషేకం, 12 దేవాలయాలకు జీర్ణోదరణ పనులు చేయాలని నిర్ణయించామని శ్రీనివాసులు చెప్పారు. అలాగే, స్వర్ణముఖి నదిలో మురికి నీరు చేరకుండా అడ్డుకట్ట వేస్తామని అన్నారు. టీటీడీ తరహాలో ముక్కంటి ఆలయంలోనూ ఆశీర్వాద మండపం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అలయ పైభాగంలో లీకేజీల నివారణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు శ్రీనివాసులు చెప్పారు. ఇందుకోసం దాతల ద్వారా లేదంటే ఆలయ నిధులతో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అన్నదాన మండపాన్ని మరింత విస్తరిస్తామని చెప్పారు. ప్రొటోకాల్ దర్శనానికి ఒక ప్రత్యేక సమయం ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు

Ayodhya: శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం.. దీపావళికి తొలి అంతస్తు సిద్ధం

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయం శరవేగంగా నిర్మాణమవుతోంది. సుదీర్ఘ వివాదాల తర్వాత 2020లో ప్రారంభమైన నిర్మాణ పనులు చకచకా సాగిపోతున్నాయి. మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయంలో మొదటి దశ.. తొలి అంతస్తు (First Floor) ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి సిద్ధం కానుంది. వచ్చే జనవరి ఫస్ట్ కల్లా మిగిలిన పనులు పూర్తిచేసి సంక్రాంతి (Sankranti) నాటికి గర్భగుడి (Garba gudi)లో దేవుడిని ప్రతిష్టించాలని పట్టుదలగా ఉంది రామాలయ ట్రస్ట్ (Ramalay Trust).

దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వచ్చేఏడాది జనవరి ఫస్ట్ నాటికి నిర్మాణం పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులను పరుగు తీయిస్తోంది రామజన్మభూమి తీర్థ ట్రస్ట్. మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయంలో మొదటి అంతస్తు చాలా వరకు పూర్తయింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి తొలి అంతస్తు నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది ఆలయ నిర్మాణ సమితి. దీపావళికి తొలి అంతస్తు సిద్ధం చేసి.. మిగిలిన పనులు డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తామని చెబుతున్నారు. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తవడం ఖాయం.

దేశప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాలయ నిర్మాణానికి అధికార బీజేపీ తీవ్రంగా కృషిచేస్తోంది. 2024 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని కోరుకుంటున్న బీజేపీ.. రామాలయ నిర్మాణం పూర్తిచేశామని చెప్పి ఓట్లు అడగాలని అనుకుంటోంది. అయోధ్యలో రామాలయం నిర్మాణం బీజేపీ ప్రధాన అజెండా.. ఆ పార్టీ స్థాపించిన నుంచి ఇదే ప్రధాన అజెండాగా పనిచేసింది. ఎన్నో పోరాటాలు చేసింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయోధ్యలో ఆలయ నిర్మాణంపై కదలిక వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కారం కాని వివాదాలను సంప్రదింపులతో కొలిక్కి తెచ్చింది. వివాదాలన్నీ ముగియడంతో 2020 ఆగస్టులో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ (PM Modi).

అందరిలో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న రామాలయం ఎలా ఉండబోతుందోననే చర్చ జరుగుతోంది. రామాలయ నిర్మాణంపై సమాచారం బయటకు వచ్చిన ప్రతిసారి నిర్మాణ విశిష్టతలు.. విశేషాలపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు భక్తులు. రాజస్థాన్ నుంచి ప్రత్యేక పాలరాతిని తీసుకువచ్చి ఆలయ గోడలను రమణీయంగా తీర్చిదిద్దుతున్నారు శిల్పులు. ఇక నేపాల్ నుంచి తెచ్చిన శాలగ్రామంతో దేవతా విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఒకవైపు దేవుడి విగ్రహాలు.. మరోవైపు ఆలయ నిర్మాణాలు చకచక సాగుతుండటంతో.. అయోధ్యలో సందడి కనిపిస్తోంది. దీపావళి నాటికి తొలి అంతస్తు పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది రామ జన్మభూమి ట్రస్ట్.

Tirumala : శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదల.. రూ. 861 కోట్ల విరాళాలు

Srivani Trust Donations : తిరుమల శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదల అయింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. శ్రీవాణి ట్రస్ట్ కు ఇప్పటివరకు రూ. 861 కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపారు. బ్యాంకుల్లో రూ. 603 కోట్లు డిపాజిట్ చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.వివిధ బ్యాంకుల్లో రూ. 139 కోట్లు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్లపై రూ. 36 కోట్ల వడ్డీ వచ్చిందని తెలిపారు. ఆలయాల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.120 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.

ఇచ్చిన విరాళాలకు రసీదులు ఇస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.దళారీ వ్యవస్థను అరికట్టేందుకే శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేశామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 70 మంది దళారులను అరెస్టు చేసి, 214 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు.