ICC World Cup 2023: టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. ప్రాక్టీస్‌లో గాయపడిన స్టార్‌ ప్లేయర్‌..

ICC World Cup 2023: టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. ప్రాక్టీస్‌లో గాయపడిన స్టార్‌ ప్లేయర్‌..

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్లు వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచింది. ఏడో మ్యాచ్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేయడంతో టీమిండియా ప్రపంచకప్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లను కూడా టీమిండియా ఓడించింది. టోర్నీలో లీగ్ రౌండ్‌లో టీమిండియా ఆఖరి, తొమ్మిదో ఓవరాల్ మ్యాచ్ ఆదివారం (నవంబర్‌ 12) నెదర్లాండ్స్‌తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌, నాకౌట్‌ గేమ్స్‌కు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ నెదర్లాండ్స్‌తో తమ మ్యాచ్‌కు ముందు బుధవారం (నవంబర్ 8) టీమ్‌ ఇండియా ప్రత్యామ్నాయ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఈ ప్రాక్టీస్‌లో బుమ్రా బాగానే బౌలింగ్ చేశాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లోనే బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తోన్న యువ వికెట్ కీపర్ అండ్‌ బ్యాటర్‌ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. బంతి బలంగా ఇషాన్ పొట్టను తాకింది. దీంతో ఇషాన్‌ మైదానంలో పడిపోయాడు. అయితే ఇషాన్‌కు తగిలిన గాయం తీవ్రమైనది కాదని తెలుస్తోంది. ఇక గాయం కారణంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మొత్తం టోర్నమెంట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్ తమ చివరి మ్యాచ్ నెదర్లాండ్‌తో ఆడనుంది. ఇందుకోసం ఆదివారం దక్షిణాఫ్రికాపై గెలిచిన అనంతరం సోమవారం సాయంత్రం కోల్‌కతా నుంచి నేరుగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు టీమిండియా ప్లేయర్స్‌. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది.

వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *