అక్కడ మునిగిపోయిన ఓడలో టన్నుల కొద్దీ బంగారం, వెండి, పచ్చలు..! మాదంటే మాదంటూ కొట్టుకుంటున్న 3దేశాలు

సముద్రంలో మునిగిపోయిన 17వ శతాబ్దానికి చెందిన ఒక ఓడ ధ్వంసానికి సంబంధించిన అవశేషాలను తిరిగి పొందింది. ధ్వంసమైన ఆ ఓడ శకలాలో బిలియన్ల డాలర్ల విలువైన 200 టన్నుల బంగారం, వెండి, పచ్చలు ఉన్నాయని నమ్ముతున్నారు. నీటి అడుగున నిక్షిప్తమైపోయిన నిధులను తిరిగి పొందేందుకు ఆ దేశం జాతీయ మిషన్‌ను ప్రకటించింది. ఈ సంచలనాత్మక సంఘటన కొలంబియాలో చోటు చేసుకుంది. నివేదికల ప్రకారం, కొలంబియా ప్రస్తుత అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ విషయాన్ని ప్రకటించారు. అతని పదవీకాలం 2026లో ముగుస్తుంది. అతని పదవీకాలం ముగిసేలోపు నిధిని స్వాధీనం చేసుకోవాలని కొలంబియా దేశం యోచిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

1708లో కొలంబియాలోని కార్టజేనా ఓడరేవులో మునిగిపోయిన ఓడ స్పెయిన్‌కు చెందినదని ఓ నివేదిక వెల్లడించింది. ఈ నౌకను బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించారు. ఇంతలో ఓడ పేలి మునిగిపోయింది. 1708లో పనామాలోని పోర్టోబెల్లో నుండి 14 వ్యాపార నౌకలు, మూడు స్పానిష్ యుద్ధనౌకలు ప్రయాణించాయి. కానీ, అది బారు చేరుకున్నప్పుడు అది బ్రిటిష్ స్క్వాడ్రన్‌ను ఎదుర్కొంది. ఆ సమయంలో స్పెయిన్‌లో వారసత్వ హక్కుపై స్పెయిన్, బ్రిటన్ మధ్య యుద్ధం జరిగింది. స్పానిష్ ఓడ కనిపించిన వెంటనే, బ్రిటీష్ వారు దాడిని ప్రారంభించారు. ఈ క్రమంలోనే స్పానిష్ ఓడను తగలబెట్టి పూర్తిగా నీళ్లలోకి మునిగిపోయేలా చేశారని పేర్కొంది.

నేటికి ఈ నిధి విలువ 20 బిలియన్ డాలర్లు. మునిగిపోయిన ఓడ 2015లో గుర్తించారు. కొలంబియా నేవీకి చెందిన డైవర్ల బృందం 3100 అడుగుల లోతులో నౌకను కనుగొంది. 2022లో కూడా ఓ బృందం ఓడ దగ్గరికి వెళ్లి అందులోని నిధిని ఫోటో తీశారు. కొలంబియా ఇప్పుడు జాతీయ మిషన్ కింద ఓడ నుండి బిలియన్ల డాలర్ల విలువైన నిధిని సేకరించబోతోంది. కొలంబియా సాంస్కృతిక శాఖ మంత్రి జువాన్ డేవిడ్ కొరియా మాట్లాడుతూ నిధిని వెలికితీసే చర్యలు ఆసన్నమవుతాయని అన్నారు. ఇది ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని, పనిని వేగవంతం చేయాలని రాష్ట్రపతి కోరారు.

ఇదిలా ఉంటే, మరోవైపు ఓడ సంపదపై వివాదం కూడా తలెత్తింది. స్పెయిన్, కొలంబియా, బొలీవియాకు చెందిన ఖరా ఖరా నేషన్ అనే తెగ వారు ఓడ నిధిపై దావా వేశారు. స్పానిష్ వారి పూర్వీకులను విలువైన లోహాలను తవ్వమని బలవంతం చేశారని గిరిజన దేశం పేర్కొంది. మునిగిపోయిన ఓడలోని వెలకట్టలేని నిధిని తమ పూర్వీకులు తవ్వించారని, అందుకే దానిపై తమకే హక్కు ఉందని చెప్పారు.

అదే సమయంలో, అమెరికన్ కంపెనీ గ్లోకా మోరా కూడా నిధిని క్లెయిమ్ చేసింది. 1981లో దాన్ని కనుగొన్నామని, ఆ తర్వాత ఓడ ఎక్కడ మునిగిపోయిందో కొలంబియా ప్రభుత్వానికి చెప్పిందని అమెరికా కంపెనీ చెబుతోంది. కొలంబియా ఓడ నిధిలో సగం విలువ చెల్లిస్తానని హామీ ఇచ్చిందని కంపెనీ ఆరోపించింది.

Viral: చెత్తకుప్పలో దొరికిన బ్యాగ్.. తెరిచి చూడగా కనిపించిన ఓ పెద్ద లెటర్.. అందులో ఏముందంటే.?

లచ్చిందేవి ఎవ్వరి తలుపు అంత ఈజీగా తట్టదు. ఒకవేళ తట్టిందంటే.. ఆడు కచ్చితంగా కోటీశ్వరుడు అవ్వాల్సిందే. అయితే ఇక్కడ ఓ బిచ్చగాడికి చిత్తు కాగితాలు ఏరుకునే సమయంలో ఓ నల్ల బ్యాగ్ దొరికింది. అందులో ఏమున్నాయో అని ఆశగా దాన్ని తెరిచి చూశాడు. అంతే.! కనిపించినవి చూసి దెబ్బకు కళ్లు తేలేశాడు. ఈ ఘటన మరెక్కడో కాదు.. మన భారతదేశంలోనే.. అదీనూ బెంగళూరులో చోటు చేసుకుంది. ఇక ఆ స్టోరీ ఇలా ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మీరూ ఓసారి చెక్ చేయండి.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తికి చెత్తకుప్పలో ఒక నల్ల బ్యాగ్ దొరికింది. ఇక అందులో డబ్బు ఉంటుందని ఆశతో ఓపెన్ చేసిన అతడికి దెబ్బకు లచ్చిందేవే వరిచింది. ఆ బ్యాగ్‌లో ఏకంగా 30 లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి. అంటే మన భారత కరెన్సీలో అది సుమారు రూ. 25 కోట్లు. ఈ ఘటన నవంబర్ 3వ తేదీన బెంగళూరులోని నాగవార రైల్వేస్టేషన్‌ పట్టాల వద్ద జరిగింది. ఆ బ్యాగ్ దొరికిన సదరు వ్యక్తి పేరు సాల్మన్. ఆ బ్యాగ్‌పై యునైటెడ్ నేషన్స్ ముద్ర ఉండగా.. సాల్మన్ ఇంటికి వెళ్లి దాన్ని తెరిచి చూశాడు కంగుతిన్నాడు. అంత డబ్బు చూసిన సాల్మన్‌కు రెండు రోజులు అస్సలు నిద్రపట్టలేదు. అనంతరం మూడో రోజున తన స్నేహితుడు, స్వరాజ్‌ ఇండియా సామాజిక కార్యకర్త అయిన ఆర్‌.కలీముల్లాను కలిసి జరిగిన విషయాన్ని వివరించాడు. అతడు ఈ విషయాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ దయానందకు తెలిపాడు.

సాల్మన్‌ నుంచి సదరు బ్యాగ్, డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అవి దొరికిన ప్రదేశాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. అలాగే బ్యాగ్‌లో లభించిన డాలర్లు నకిలీవని భావిస్తున్నారు ఖాకీలు. క్షుణ్ణంగా పరిశీలించేందుకు వాటిని రిజర్వు బ్యాంకుకు పంపినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆ బ్యాగ్ తెరిచినప్పుడు ఓ పెద్ద లెటర్ లభించడం విశేషం. అందులో ‘బ్యాగులో విషపూరితమైన రసాయనాలున్నందున.. తెరిచేటప్పుడు జాగ్రత్త’ అని పేర్కొని ఉంది.

America’s quietest town: ఆ నగరంలో స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు వాడితే జైలుకే..! రీజన్ ఏమిటో తెలిస్తే షాక్..

ప్రస్తుత కాలంలో ఫోన్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం. అప్పుడే పుట్టిన శిశువు నుంచి కాటికి కాళ్లు చాచిన ముదుసలికి సైతం సెల్ ఫోన్ జీవితంగా మారిపోయింది. మరి అలాంటి పరిస్థితిలో మీరు సెల్ ఫోన్‌ను ఉపయోగించకూడదంటూ నిషేధం చేస్తే.. అసలు ఇది నిజమేనా అని ఆలోచిస్తారు. అయితే సెల్ ఫోన్‌లను ఉపయోగించడంపై నిషేధం ఉన్న నగరం ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ నివసించే ప్రజలు ఫోన్‌లు లేదా ఆధునిక సాంకేతికతను ఉపయోగించరు. ఫోన్‌లు లేకుండా ఏ నగరం నడుస్తోందో.. అక్కడ ఉన్న ప్రజల జీవితం సాధారణంగా ఎలా సాగుతుందో ఈ రోజు తెలుసుకుందాం..
ఎలక్ట్రికల్ పరికరాలను వాడితే జైలు శిక్ష తప్పదు.
అమెరికాలోని ఓ నగరంలో సెల్ ఫోన్ పై నిషేధం అమల్లో ఉంది. వెస్ట్ ఆఫ్ అమెరికాలోని వర్జీనియాలోని పోకాహోంటాస్ కౌంటీలో ఉన్న గ్రీన్ బ్యాంక్ సిటీలోని ప్రజలు సాంకేతికతను ఉపయోగించరు.
మొబైల్, టీవీ , రేడియోను ఉపయోగించడం పై నిషేధం
ఈ నగరంలో నివసించే ప్రజలు మొబైల్, టీవీ , రేడియోలను ఉపయోగించరు. ఈ పరికరాలు ఈ నగరంలో పూర్తిగా నిషేధించబడ్డాయి. ఈ నగరంలో ఈ పరికరాలను ఉపయోగించిన ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. అంటే ఇక్కడ నివసించే వారు ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
ఎందుకు ఉపయోగించలేరంటే
నిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ ఈ నగరంలో ఉంది. ఈ ఊరి జనాభా కేవలం 150 మంది మాత్రమే. ఈ గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ చాలా పెద్దది. దీని పొడవు 485 అడుగులు.. బరువు 7600 మెట్రిక్ టన్నులు. ఈ టెలిస్కోప్ గొప్పదనం ఏమిటంటే టెలిస్కోప్ కదిలే విధంగా ఉంటుంది.. అంటే దీనిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా మార్చుకోవచ్చు. అమెరికా నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ ఈ స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ సమీపంలో ఉంది. ఇక్కడి నుంచి అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చే అలలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. ఈ నగరంలో ఎలక్ట్రిక్ పరికరం ఉపయోగించకపోవడానికి కారణం ఇదే.

Viral Video: అమ్మ ప్రేమ ఇంతే మరి.. తల్లి వీపు తనయుడికి సింహాసనం.. హృదయం ద్రవించే వీడియో వైరల్

ప్రపంచంలో అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ లేదు. ఆమెను ఎవరితోనూ పోల్చలేము. ఈ ప్రపంచంలో పిల్లలను ఎక్కువగా ప్రేమించే తల్లి.. తన పిల్లలు ఎలాంటి కష్టాల్లో ఉన్నా.. పిల్లలను ఆ దుర్భర పరిస్థితుల నుంచి దూరంగా ఉంచాలన్నదే తల్లి కోరిక. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరి హృదయం అయినా ద్రవిస్తుంది. కళ్లు చెమరుస్తాయి.

జీవితం మనకు కనిపించినంత సులువు కాదని అంటారు. చాలా సార్లు మనం ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం.. జీవితాన్ని నడపడం కోసం చాలా కష్టపడాలి. పేదరికం చాలా క్రూరమైనది అని ఎవరో సరిగ్గా చెప్పారు..! పేదరికం కొందరిని మరణం వరకు విడిచిపెట్టదు. తన పరిస్థితితో సంబంధం లేకుండా కష్టపడి పని చేస్తారు. వీరి లక్ష్యం డబ్బు సంపాదన మాత్రమే. ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక మహిళ ఊతకర్రల మీద నడుస్తూ అడుక్కుంటోంది. ఆ సమయంలో కూడా ఆ మహిళ తన బిడ్డను విడిచి పెట్టలేదు.

ఓ వికలాంగురాలు రోడ్డుపై ఊతకర్రల సాయంతో నడుస్తోన్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. స్వతహాగా ఆ మహిళ నిటారుగా నిలబడలేని పరిస్థితి. అయితే ఆ మహిళ వీపు మీద పిల్లను పెట్టుకుంది. అప్పుడు ఆ చిన్నారి పుచ్చకాయ ఆనందంగా తింటోంది. ఇంతలో ఆ మహిళకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు.

ఈ వీడియో @RobertLyngdoh2 అనే ఖాతా Xలో షేర్ చేశారు. 80 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోను షేర్ చేస్తున్నప్పుడు.. ఇది చూసిన తర్వాత మీ గుండె కొట్టుకోవడం ఆగిపోతుందని క్యాప్షన్ కూడా ఇచ్చారు. నరకం నుండి బయటపడవచ్చు .. అయితే భూమిపై పేదరికమే నిజమైన నరకం అని కొందరు కామెంట్ చేశారు.