Venkatesh : వెంకటేష్ కూతురి నిశ్చితార్థం వేడుకలో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఫోటోలు..

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ తన రెండో కూతురి హయవాహిని నిశ్చితార్థం వేడుక నిన్న సైలెంట్ గా జరిగిపోయింది. దగ్గుబాటి కుటుంబ సభ్యులు, వరుడు కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ నుంచి దగ్గర స్నేహితులు మాత్రమే ఈ నిశ్చితార్థం వేడుకకు హాజరయ్యారు. చిరంజీవి, మహేష్ బాబు, నాగచైతన్య.. తదితరులు ఈ వేడుకలో కనిపించారు.

1 / 5
2 / 5
3 / 5
4 / 5
5 / 5

Valmiki Caves: పర్యాటకులను సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తోన్న వాల్మీకి గుహలు.. ప్రత్యేకతలేంటో తెలుసా?

ఆశ్చర్యం.. సంభ్రమాశ్చర్యం… బోరా గుహలు, బెలూం గుహలను తలదన్నే విధంగా అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా వెలుగులోకి వచ్చాయి వాల్మీకి గుహలు. సహజ సిద్ధం తో పాటు అతి ప్రాచీన చరిత్ర కలిగి రామాయణంతో ముడిపడి ఉండటం ఈ గుహలకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నల్ల మేకల పల్లి దగ్గర వాల్మీకి గుహలు వెలుగు చూశాయి. అత్యంత సహజ సిద్ధంగా ఉన్నాయి
1 / 5
2 / 5
3 / 5
4 / 5
5 / 5

Aadi Keshava : ఆదికేశవ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో వైష్ణవ తేజ్, శ్రీలీల డాన్స్.. ఫోటోలు..

వైష్ణవ తేజ్, శ్రీలీల కలిసి చేస్తున్న సినిమా ఆదికేశవ. ఈ మూవీ నుంచి తాజాగా మూడో సాంగ్ ని రిలీజ్ చేశారు. నిన్న ఒక ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో వైష్ణవ తేజ్, శ్రీలీల డాన్స్ వేసి అదరగొట్టేశారు.
1 / 10
2 / 10
3 / 10
4 / 10
5 / 10
6 / 10
7 / 10
8 / 10
9 / 10
10 / 10

Mrunal Thakur : బ్లాక్ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ స్టైలిష్ ఫోటోషూట్..

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సినిమాల్లో తన పాత్రలతో, సోషల్ మీడియాలో అందాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ ఫోటోషూట్ చేసి వావ్ అనిపిస్తుంది.

1 / 6
2 / 6
3 / 6
4 / 6
5 / 6
6 / 6

Leo: రజనీకాంత్‌ని టార్గెట్‌ చేసిన విజయ్‌.. లియో 500కోట్లు!

డైరక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ లేటెస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ లియో 500 కోట్ల మార్క్ దాటేసింది. దళపతి విజయ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన సినిమా లియో. బాక్సాఫీస్‌ దగ్గర మామూలుగా లేవు వసూళ్లు. సినిమా విడుదలైన తొలి వారంలోనే దాదాప 500 కోట్ల మార్కు దాటేసింది లియో. లియో డొమెస్టిక్‌ కలెక్షన్లు 262 కోట్లు. డొమెస్టిక్‌ వైజ్‌ కలెక్షన్లలో తమిళ సినిమాల్లో రెండో హయ్యస్ట్ గ్రాసింగ్‌ సినిమాగా రికార్డు క్రియేట్‌ చేస్తోంది లియో. ఆల్రెడీ రజనీకాంత్‌ నటించిన జైలర్‌ 343.47 కోట్ల లైఫ్‌ టైమ్‌ కలెక్షన్లతో నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో ఉంది. ఆల్‌ టైమ్‌ తమిళ సినిమా కలెక్షన్లలో మూడో ప్లేస్‌లో ఉంది లియో. రజనీకాంత్‌ నటించిన జైలర్‌ ఫస్ట్ ప్లేస్‌లో, 2.0 సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాయి.
1 / 4
2 / 4
3 / 4
4 / 4

Viral News: ఓరీ దేవుడో.. ఎంతపెద్ద కొండచిలువ.. మేకను సజీవంగా మింగేస్తుంటే చూసిన జనాలను..

పైథాన్ విషపూరితం కానప్పటికీ, దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, భయంకర పాముగానే పిలుస్తారు. ఈ పాము తన బాధితుడిని పట్టుకున్న తర్వాత, దానిని చంపిన తర్వాత మాత్రమే విడిచిపెడుతుంది. మలేషియాలోని కెడా నుంచి ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. 23 అడుగుల పొడవైన కొండచిలువ మేకను సజీవంగా మింగేసింది. అయితే దానిని తిన్న తర్వాత కొండచిలువ కదలలేని స్థితిలో ఉండిపోయింది. నివేదిక ప్రకారం.. సుమారు 140 కిలోల బరువున్న ఈ కొండచిలువ ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. అయితే అగ్నిమాపక సిబ్బంది దానిని చాకచక్యంగా పట్టుకుని బంధించారు. మైక్రో బ్లాగింగ్ సైట్‌లో వైరల్ అయిన ఫోటోలలో పాము పొడవు చాలా భయానకంగా కనిపిస్తుంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కొండచిలువ మేకను మింగినట్లు తమకు సమాచారం వచ్చిందని చెప్పారు రెస్క్యూ టీం. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న బృందం సహాయక చర్యలు చేపట్టింది.

జనావాసాల సమీపంలోకి వచ్చిన ఒక భారీ కొండచిలువ.. అక్కడ ఎదురుపడిన ఒక మేకను మింగేసింది. కానీ అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వల్ల అది కదలలేకపోయింది. ఈ సంఘటన అక్టోబర్ 19న జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం.. ఆ భారీ సర్పాన్ని పట్టి బంధించారు. 140 కిలోల బరువు, భారీ పొడవైన కొండచిలువ మేకను సజీవంగా మింగేసింది. పాము పొడవు చూసి ప్రజలు భయంతో వణికిపోయారు.

సజీవంగా ఉన్న మేకను మింగుతుండగా చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేక తన ఇంటి సమీపంలోని ఎన్‌క్లోజర్‌లో ఉండగా, కొండచిలువ దాడి చేసిందని చెప్పారు. అయితే అది కనిపించిన వెంటనే కొండచిలువ దానిపై దాడి చేసిందన్నారు.. కొండచిలువ పూర్తిగా కదలలేక పోవడంతో దానిని పట్టుకునేందుకు ఆ శాఖ పెద్దగా శ్రమించాల్సిన పనిలేకపోయింది. 25 నిమిషాల్లోనే కొండచిలువను అదుపు చేశారు. కొండచిలువను అడవిలోకి విడుదల చేయడానికి ముందు పెనిన్సులర్ మలేషియా డిపార్ట్‌మెంట్ వన్యప్రాణి, నేషనల్ పార్క్‌లకు అప్పగించారు.

అయితే, ఇది పైథాన్‌లో అత్యంత ప్రమాదకరమైన జాతిగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవి మనుషులను కూడా మింగేస్తాయని చెప్పారు. పాములలో ఇది అతి పొడవైన జాతి అని చెప్పారు. ఇలాంటి పైథాన్‌లు దక్షిణ, ఆగ్నేయాసియాలో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు.

Israel-Hamas War: గాజా ప్రజలకు ఆపన్నహస్తం.. మాటల్లో కాదు చేతల్లో చూపిన భారత్

ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ ప్రతినిధి, రాయబారి ఆర్‌. రవీంద్ర బుధవారం గాజా స్ట్రిప్‌లోని పౌరులకు మానవతా సహాయం పంపడానికి న్యూఢిల్లీ చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఈ ప్రాంతానికి 38 టన్నుల ఆహారం, క్లిష్టమైన వైద్య పరికరాలను పంపినట్లు పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బహిరంగ చర్చలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా రవీంద్ర ఈ ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో శత్రుత్వాల తాజా అధ్యాయంపై బహిరంగ చర్చకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)కి కృతజ్ఞతలు తెలుపుతూ, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి, కొనసాగుతున్న వార్‌లో పౌరులు పెద్ద ఎత్తున నష్టపోవడంపై భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోందని అన్నారు. పెరుగుతున్న మానవతా సంక్షోభం కూడా అంతే భయంకరంగా ఉందని ఆయన అన్నారు.

ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం నడుమ గాజాలోని సాధారణ పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ ని దిగ్భంధించింది. ఉత్తర గాజాలోని ప్రజలను సురక్షితమైన దక్షిణ ప్రాంతాలకు వెళ్లాలని సూచించడంతో, ఆ ప్రాంతంలోని 10 లక్షల మందిలో 7 లక్షల మంది దక్షిణ వైపు వెళ్లారు. యుద్ధంతో తల్లడిల్లిపోతున్న గాజా ప్రజలకు భారత్ కూడా ఆపన్నహస్తం అందించింది. పాలస్తీనా ప్రజల కోసం దాదాపుగా 6.5 టన్నుల వైద్యసాయాన్ని, 32 టన్నుల విపత్తు సహాయ సామాగ్రిని పాలస్తీనాకు చేరవేర్చింది. అయితే ఈజిప్టు గుండా గాజాలోకి ఈ సాయం చేరుతుంది.

భారతదేశం పాలస్తీనా ప్రజలకు మందులు, పరికరాలతో సహా 38 టన్నుల మానవతా వస్తువులను పంపిందని అన్నారు. ఈ దేశాల మధ్య చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతంలో మా యుటిలిటీల పెరుగుదల భయంకరమైన మానవతా పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7న జరిగిన ఉగ్రదాడులు దిగ్భ్రాంతికి గురిచేశాయని, వాటిని భారత్ నిర్ద్వంద్వంగా ఖండించిందని ఐరాసలో డిప్యూటీ శాశ్వత రాయబారి పేర్కొన్నారు. ప్రాణనష్టం, అమాయక బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థనలు చేసి తన సంతాపాన్ని తెలియజేసిన మొదటి ప్రపంచ నాయకులలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు అని ఆయన పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ ఈ తీవ్రవాద దాడులను ఎదుర్కొంటున్నప్పుడు వారి సంక్షోభ సమయంలో మేము వారికి సంఘీభావంగా నిలిచామని రవీంద్ర అన్నారు. గాజాలోని అల్ హలీ ఆసుపత్రిలో అనేక వందల మంది పౌరులు మరణించారు. వేలాది మంది గాయపడిన విషాదకరమైన ప్రాణనష్టంపై మేము తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసాము. బాధిత కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతి, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము అని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ డిప్యూటీ శాశ్వత రాయబారి తెలిపారు.

మరోసారి కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 22 మంది మృతి, 60 మందికి గాయాలు

అమెరికాలో కాల్పులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. దేశంలో రోజురోజుకీ గన్‌కల్చర్‌ పెరిగిపోతోంది..తాజగా అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అమెరికాలోని మైనేలోని లెవిస్టన్ ప్రాంతంలో ఆగంతకులు జరిపిన కాల్పుల్లో 22 మంది చనిపోయారు. 60 మంది వరకూ గాయపడ్డారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారికి ఆస్పత్రులకు తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

కాల్పులు జరిపిన ఓ వ్యక్తి చేతిలో రైఫిల్‌ పట్టుకొని ఉన్న ఫోటోలు విడుదల చేయగా..పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికులు ప్రస్తుతానికి ఇళ్లలోనే ఉండాలని, ఇళ్ల తలుపులు మూసి ఉంచుకోవాలని అధికారులు సూచించారు. లూయిస్టన్‌లో నిందితుడు ఉపయోగించిన బ్లాక్ పెయింట్ కలిగిన వాహనం కోసం వెతుకుతున్నామని..  నిందితుడి ఆచూకి తెలిస్తే సమాచారం ఇవ్వాలని  లూయిస్టన్ పోలీసులు సూచించారు.

అమెరికాలో గన్‌ కల్చర్‌పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సామాన్యుల ప్రాణాలు పదుల సంఖ్యలో గాల్లో కలిసిపోతున్నాయి. దీనికి ఎలా చెక్‌ పెట్టాలనే అంశంపై అధ్యక్షుడు సైతం ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదో మనసులో పెట్టుకుని అన్నెం పున్నెం ఎరుగని అమాయకులపై తూటాల వర్షం కురిపిస్తున్న ఘటనలు తరచు జరుగుతూనే ఉన్నాయి.

Israel Hamas War: భారత్ కలల ప్రాజెక్టును ఆపడానికి హమాస్ దాడి.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక ప్రకటన చేశారు. భారత్ కలల ప్రాజెక్టును ఆపడానికి హమాస్ దాడి చేసిందని పేర్కొన్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా భారత్‌-పశ్చిమ ఆసియా-యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (ఐఎంఈఈసీ)పై చేసిన ప్రకటన హమాస్‌ దాడికి ఒక కారణమని ఆయన అన్నారు. ఈ కారిడార్ మొత్తం ప్రాంతాన్ని రైల్వే నెట్‌వర్క్‌కు కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రాంతాన్ని రైల్వే నెట్‌వర్క్‌కు కలుపుతుంది.

అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడుల్లో 1,400 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. ఈ దాడి తర్వాత హమాస్‌పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ప్రతీకార చర్యను ప్రారంభించింది. ఇద్దరి మధ్య ఇంకా యుద్ధం నడుస్తోంది.

అమెరికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి విలేకరుల సమావేశంలో బిడెన్ ఈ ప్రకటన చేశారు.  ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో బిడెన్ మాట్లాడుతూ.. ” హమాస్ దాడికి ఇది కూడా ఒక కారణమని నేను నమ్ముతున్నాను. దీనికి నా దగ్గర ఎలాంటి రుజువు లేదు. కానీ నా మనస్సాక్షి చెబుతోంది. ఇజ్రాయెల్ కోసం ప్రాంతీయ సమైక్యత, మొత్తం ప్రాంతీయ సమైక్యత కోసం మేము చేసిన కృషి కారణంగా, హమాస్ ఈ దాడికి పాల్పడింది. మేము దాడికి పాల్పడినవారిని వదిలిపెట్టలేం.  మేము ఈ ప్రాజెక్ట్‌ను వదిలిపెట్టలేం.. కొనసాగిస్తాం.”

వారంలో రెండోసారి ఈ ఆందోళన..
హమాస్ దాడికి జో బిడెన్ ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)ని ఒక వారంలోపే ప్రస్తావించడం ఇది రెండోసారి. చాలా మంది ఈ ఆర్థిక కారిడార్‌ను చైనా BRI ప్రాజెక్ట్‌కు ప్రత్యామ్నాయంగా కూడా చూస్తున్నారు. ఇది అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐరోపా దేశాలను సంయుక్తంగా కలుపుతుంది. సెప్టెంబరులో న్యూఢిల్లీలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా భారత్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ కారిడార్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగం భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతంతో అనుసంధానించే తూర్పు కారిడార్, మరొక భాగం గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్‌తో అనుసంధానించే ఉత్తర కారిడార్.
1 2 3 7