World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో తొలి మ్యాచ్‌లో సెంచరీల వరద.. లిస్టులో భారత్ నుంచి ఇద్దరు.. ఎవరో తెలుసా?

World Cup 2023: ప్రపంచ కప్‌లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడికైనా ఇది పెద్ద అవకాశం. ప్రతి ఆటగాడు తన మంచి ప్రదర్శన ఆధారంగా ప్రపంచ కప్‌లో తన దేశ జట్టులో భాగం కావాలని ప్రయత్నిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక బ్యాట్స్‌మన్ దృక్కోణంలో 50 ఓవర్ల టోర్నమెంట్‌లో సెంచరీ చేయడం కూడా చాలా గౌరవప్రదమైన విషయం. టోర్నమెంట్‌లోని ఏ ఎడిషన్‌లోనైనా చేసిన తొలి సెంచరీతో దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైన ప్రపంచ కప్ 2023లో ఇదే విధమైన ఫీట్ చేశాడు. ఇంతకు ముందు ఇలాంటి ఫీట్ చేసిన దిగ్గజాల జాబితాలో అతని పేరు చేరింది.

డెవాన్ కాన్వే తన దేశం తరపున తొలిసారి వన్డే ప్రపంచ కప్ ఆడుతున్నాడు. టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసి కేవలం 83 బంతుల్లో తన కెరీర్‌లో ఐదో సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఈ సెంచరీ తొలి సెంచరీ కూడా.ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎడిషన్‌లోనూ పలు దేశాల ఆటగాళ్లు ఆయా ఎడిషన్‌లో తొలి సెంచరీ సాధించిన ఘనత సాధించారు. ఈ జాబితాలో భారత జట్టులోని ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ కూడా ఉన్నారు.

ODI ప్రపంచకప్ యొక్క ప్రతి ఎడిషన్‌లో సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితా..

1975 ప్రపంచ కప్ – డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్): 137 vs భారతదేశం

1979 ప్రపంచ కప్ – గోర్డాన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్): 106* vs భారతదేశం

1983 ప్రపంచ కప్ – అలాన్ లాంబ్ (ఇంగ్లండ్): 102 vs న్యూజిలాండ్

1987 ప్రపంచ కప్ – జావేద్ మియాందాద్ (పాకిస్తాన్): 103 vs శ్రీలంక

1992 ప్రపంచ కప్ – మార్టిన్ క్రో (న్యూజిలాండ్): 100* vs ఆస్ట్రేలియా

1996 ప్రపంచ కప్ – నాథన్ ఆస్టిల్ (న్యూజిలాండ్) :101 vs ఇంగ్లాండ్

1999 ప్రపంచ కప్ – సచిన్ టెండూల్కర్ (భారతదేశం): 140* vs కెన్యా

2003 ప్రపంచ కప్ – బ్రియాన్ లారా (వెస్టిండీస్): 116 vs దక్షిణాఫ్రికా

2007 ప్రపంచ కప్ – రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా): 113 vs స్కాట్లాండ్

2011 ప్రపంచ కప్ – వీరేంద్ర సెహ్వాగ్ (భారతదేశం): 175 vs బంగ్లాదేశ్

2015 ప్రపంచ కప్ – ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా): 135 vs ఇంగ్లాండ్

2019 ప్రపంచ కప్ – జో రూట్ (ఇంగ్లండ్): 107 vs పాకిస్థాన్

2023 ప్రపంచ కప్ – డెవాన్ కాన్వే (న్యూజిలాండ్): 152* vs ఇంగ్లాండ్

Asian Games : ఆసియా క్రీడ‌ల్లో స్వ‌ర్ణం గెలిచిన భార‌త పురుషుల క్రికెట్ జ‌ట్టు

Asian Games 2023 : చైనా వేదిక‌గా జ‌రుగుతున్న‌ ఆసియా క్రీడ‌ల్లో భార‌త పురుషుల క్రికెట్ జ‌ట్టు స్వ‌ర్ణం గెలిచింది. అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. దీంతో సీడింగ్ ఆధారంగా టీమ్ఇండియా గోల్డ్ మెడ‌ల్ అందుకుంది. ఆసియా క్రీడ‌ల్లో భార‌త పురుషుల క్రికెట్ జ‌ట్టు టాప్ సీడింగ్‌తో బ‌రిలోకి దిగింది. ఈ క్రీడ‌ల్లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు కూడా స్వ‌ర్ణం గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే.

ఫైన‌ల్‌ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. భార‌త బౌల‌ర్ల ధాటికి మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 52 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. షాహిదుల్లా కమల్ (49 నాటౌట్; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), గుల్బాదిన్ నైబ్ (27 నాటౌట్; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స‌ర్లు) జ‌ట్టును ఆదుకున్నారు. వీరిద్ద‌రు భార‌త బౌల‌ర్లను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని ప‌రుగులు సాధించారు. అభేధ్య‌మైన ఐదో వికెట్‌కు 60 ప‌రుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు.

అయితే.. 18.2 ఓవ‌ర్లకి పూర్తి అవ‌గానే వ‌ర్షం ఆరంభమైంది. అప్ప‌టికి ఆఫ్గానిస్తాన్ స్కోరు 112/5. డ‌క్ వ‌ర్త్ ప‌ద్ద‌తిలో విజేత‌ను నిర్ణ‌యించాల‌న్నా ఇరు జ‌ట్లు క‌నీసం 5 ఓవ‌ర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎంత‌సేప‌టికీ వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. ఆసియా క్రీడ‌ల్లోని నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏదైన మ్యాచ్ ర‌ద్దు అయితే.. ఇరు జ‌ట్ల‌లో టాప్ సీడింగ్ ఉన్న జ‌ట్టును విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. భార‌త్ టాప్ సీడింగ్‌తో బ‌రిలోకి దిగ‌డంతో టీమ్ఇండియా విజేత‌గా నిల‌వ‌డంతో స్వ‌ర్ణ ప‌త‌కం ల‌భించింది.

Video: ‘ప్రత్యేక అభిమానిని’ కలుసుకున్న విరాట్ కోహ్లి.. గుండెలను పిండేసే వీడియో షేర్ చేసిన బీసీసీఐ..

CWC 2023: ఈ ప్రపంచ కప్ (ICC Cricket World Cup 2023)లో విరాట్ కోహ్లీపై భారత జట్టుతోపాటు అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈసారి కింగ్ కోహ్లీ (Virat Kohli) తన వన్డే కెరీర్‌లో నాలుగో ప్రపంచకప్‌ను ఆడుతున్నాడు. టోర్నీ కోసం కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. టీమ్ ఇండియా (Team India) తొలి మ్యాచ్ ఆదివారం ఆస్ట్రేలియాతో (IND vs AUS) జరగనుంది. దీని కోసం ఇరు జట్లు చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇంతలో, కోహ్లీ మ్యాచ్ ఆడకుండానే తన ప్రత్యేక అభిమానులలో ఒకరి హృదయాన్ని గెలుచుకున్నాడు.

ప్రపంచ కప్ కోసం భారత జట్టు కొత్త శిక్షణా కిట్‌ను పొందింది. అక్టోబరు 5న, భారత ఆటగాళ్లు ఆరెంజ్ జెర్సీలో మూడు గంటలపాటు తీవ్రమైన ప్రాక్టీస్ చేశారు. జట్టు మొత్తం ప్రాక్టీస్‌లో లీనమైంది. ఈ సమయంలో భారత క్రికెట్ జట్టును చూసేందుకు ఓ వికలాంగ అభిమాని టిక్కెట్ కొనడానికి స్టేడియంకు చేరుకున్నాడు. ఈ అభిమాని విరాట్ కోహ్లి చిత్రాన్ని కూడా తన చేతితో గీసి, స్టేడియానికి తీసుకొచ్చాడు. అది అతనికి 40 గంటల కంటే ఎక్కువ సమయం పట్టిందంట. కోహ్లితో పాటు టీమిండియా ఆటగాళ్లు కూడా ఈ అభిమానిని కలుసుకుని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

కోహ్లి కవర్ డ్రైవ్ నన్ను అభిమానిని చేసింది – శ్రీనివాస్

వీడియోలోని ఇంటర్వ్యూలో, శ్రీనివాస్ అనే అభిమాని మాట్లాడుతూ, నేను ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం టిక్కెట్లు కొనడానికి వచ్చాను. అయితే, నేను విరాట్ కోహ్లీని కలిశాను. 40 గంటల సమయం పట్టిన ఈ చిత్రాన్ని నా చేతులతో రూపొందించాను. కోహ్లీ నా దగ్గరకు వచ్చి దీనిపై నా ఆటోగ్రాఫ్ కావాలా అని అడిగాడు. తను ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. నేను తరతో ఫొటోలు కూడా తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

తను మైదానంలో దూకుడుగా ఉంటాడు. కానీ, మైదానం వెలుపల అతను చాలా దయగల, మంచి వ్యక్తి. ఆయన కవర్ డ్రైవ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన ఫ్యాన్ అయ్యాను. మేం అభిమానులు బహుశా జట్టుపై ఒత్తిడి తెస్తాం. కానీ, అది వారి పట్ల మనకున్న ప్రేమ మాత్రమే. మొత్తం జట్టుకు శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు.

World Cup 2023 RSA Vs SL ODI : నిల‌క‌డ‌గా ఆడుతున్న ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు, డుసెన్‌, డికాక్ హాఫ్ సెంచ‌రీలు

క్వింట‌న్ డికాక్ హాఫ్ సెంచ‌రీ

దునిత్ వెల్లలగే బౌలింగ్‌లో (21.2వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 61 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్ సెంచ‌రీ చేశాడు. అత‌డితో పాటు వాన్ డ‌ర్ డుసెన్ 65 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. 22 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాప్రికా స్కోరు 127/1.

వాన్ డ‌ర్ డుసెన్ అర్థ‌శత‌కం

పతిరణ బౌలింగ్‌లో (17.3వ ఓవ‌ర్‌) ఫోర్ కొట్టి వాన్ డ‌ర్ డుసెన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 18 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 105/1. వాన్ డ‌ర్ డుసెన్ (51), క్వింట‌న్ డికాక్ (43) లు ఆడుతున్నారు.

10 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 48/1

ఆరంభంలోనే వికెట్ కోల్పోయి న‌ప్ప‌టికీ ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. స‌ఫారీల ఇన్నింగ్స్‌లో మొద‌టి 10 ఓవ‌ర్లు ముగిశాయి. వికెట్ న‌ష్టానికి 48 ప‌రుగులు చేసింది. వాన్ డ‌ర్ డుసెన్ (18), క్వింట‌న్ డికాక్ (21) లు ఆడుతున్నారు.

కెప్టెన్ బావుమా ఔట్‌

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు ఆరంభంలోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. మధుశంక బౌలింగ్‌లో స‌ఫారీ కెప్టెన్ బావుమా (8) ఎల్భీ డ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 1.4వ ఓవ‌ర్‌లో 10 ప‌రుగుల వ‌ద్ద సౌతాఫ్రికా మొద‌టి వికెట్ కోల్పోయింది.

శ్రీలంక తుది జ‌ట్టు : కుసల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీప‌ర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్‌), దునిత్ వెల్లలగే, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక, కసున్ రజిత

దక్షిణాఫ్రికా తుది జ‌ట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీప‌ర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), వాన్ డ‌ర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ

IND vs AUS : ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు వ‌రుస షాక్‌లు.. హార్దిక్ వేలికి గాయం, అనారోగ్యం బారిన గిల్‌..!

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టైలే వేరు. హాట్ హాట్ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో ఉంటారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవికి పోటీపడే నేతలు వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. తాజాగా సీఎం పదవిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరైనా సీఎం కావచ్చు , ఏదో ఒక రోజు నేను కూడా సీఎం అవుతానని ఆయన అన్నారు. కోమటిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
నెట్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా..

ఆసీస్ తో మ్యాచ్ కోసం టీమ్ఇండియా స‌న్న‌ద్ద‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న హార్దిక్ పాండ్య కుడి చేతి వేలికి గాయ‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అత‌డికి అయిన గాయం గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. అయితే.. ఆ త‌రువాత హార్దిక్ బ్యాటింగ్ చేయ‌లేక‌పోయాడ‌ని అంటున్నారు. దీనిపై బీసీసీఐ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. ఒక‌వేళ ఆసీస్‌తో మ్యాచ్ స‌మ‌యానికి హార్దిక్ కోలుకోలేక‌పోతే టీమ్ఇండియాకు క‌ష్టాలు త‌ప్ప‌వు.

అనారోగ్యం బారిన గిల్‌..

యువ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ అనారోగ్యం బారిన ప‌డిన‌ట్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలియ‌జేసింది. అయితే.. అత‌డికి ఏమైంది అన్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు. అందుకున్న స‌మాచారం ప్ర‌కారం గిల్ డెంగ్యూ బారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆసీస్‌తో మ్యాచ్‌కు అత‌డు అందుబాటులో ఉండ‌డం అనుమాన‌మే. సాధార‌ణంగా డెంగ్యూ నుంచి కోలుకునేందుకు వారం నుంచి ప‌ది రోజుల స‌మ‌యం ప‌డుతుంది. దీంతో గిల్ పాకిస్తాన్‌తో జ‌రిగే మ్యాచ్ వ‌ర‌కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు.

ఆసీస్‌తో మ్యాచ్‌కు గిల్ దాదాపుగా దూరం అయిన‌ట్లే. దీంతో అత‌డి స్థానంలో ఇషాన్ కిష‌న్ ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగొచ్చు. రోహిత్‌తో క‌లిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం గిల్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌ల్లో ఉన్న‌ట్లు భార‌త హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ చెప్పాడు. అత‌డు త్వ‌ర‌లోనే కోలుకుంటాడ‌ని, వైద్యులు ఏం చెబుతారో వేచి చూడాల‌ని అని, గిల్ ఆసీస్‌తో మ్యాచ్‌లో ఆడ‌తాడా లేదా అనే దానిపై శ‌నివారం నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నాడు.

Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్.. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా.. ఎలక్షన్స్ ముందే రిలీజ్..

Nitin Gadkari Biopic : ఇటీవల బయోపిక్స్ ఎక్కువగా వస్తున్నా సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా, పలు రంగాల ప్రముఖుల జీవిత చరిత్రలను వెండితెరపై చూపించడానికి వారి జీవిత కథలతో బయోపిక్ సినిమాలని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు అన్ని సినీ పరిశ్రమలలోను బయోపిక్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ బయోపిక్ హంగామా మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అనేక బయోపిక్స్ రాగా బాలీవుడ్ నుంచి ఇప్పుడు మరో ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్ రాబోతుంది.
ప్రముఖ బీజేపీ(BJP) సీనియర్ నేత, ప్రస్తుత కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్ రానుంది. ‘గడ్కరీ’ అనే టైటిల్ తో ‘హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే ట్యాగ్ లైన్ ప్రమోషన్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ అనంత్ దేశముఖ్ నిర్మాణంలో అనురాగ్ రాజన్ బుసారి దర్శకత్వంలో ‘గడ్కరీ’ సినిమా నితిన్ గడ్కరీ బయోపిక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇది కేవలం మరాఠీ సినిమాగా తెరకెక్కుతుంది. మరి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. అయితే ఈ సినిమాలో నితిన్ గడ్కరీ రోల్ ని ఎవరు చేస్తున్నారో ఇంకా ప్రకటించకపోవడం విశేషం.

నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు చెందిన నేత. స్టూడెంట్ గా ఉన్నప్పట్నుంచే బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మొదటి నుంచి కూడా రోడ్స్, ట్రాన్స్ పోర్ట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. అటల్ బిహారి వాజపేయి ఉన్నప్పుడు దేశంలోని రవాణా సౌకర్యం లేని గ్రామాలకు రోడ్లు వేయాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే కార్యక్రమాన్ని ఈయనే ప్రపోజ్ చేశారు. మహారాష్ట్ర గవర్నమెంట్ లో కూడా రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేసి మహారాష్ట్ర రవాణా రోడ్డు శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు.

కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా దేశ రోడ్ల మీద ఫోకస్ చేశారు. గత 9 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రిగా పనిచేస్తూ దేశంలో ఎన్నో కొత్త రోడ్లని, హైవేలను, ఎక్స్ ప్రెస్ హైవేలను తీసుకొచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో రవాణాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు గడ్కరీ. ఇంకా దేశం మొత్తం మీద అనేక హైవేల నిర్మాణం జరుగుతుంది. దేశమంతటా ప్రయాణం అందరికి సులభతరం చేయాలనే ఉద్దేశంతో ముందు నుంచి కూడా ఒకే శాఖపై పట్టు సాధించి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలువురు గడ్కరీపై బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.

Rajinikanth: కేరళలో సూపర్ స్టార్ నయా మూవీ షురూ. వైరల్ అవుతోన్న వీడియో

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గరబోల్తా కొట్టాయి. దాంతో రజిని ఫ్యాన్స్ అంతా కాస్త నిరాశకు గురయ్యారు. అయితే జైలర్ సినిమా సంచలన విజయం సాధించి అభిమానులను ఫుల్ ఖుష్ చేసింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసింది. జైలర్ సినిమాను లేపింది అనిరుధ్ సంగీతం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ జైలర్ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు.
లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కు లోకేష్పెట్టింది పేరు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా విక్రమ్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దళపతి విజయ్ నటిస్తున్న లియో సినిమాకు ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా లియో సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ షూటింగ్ కేరళలో మొదలైంది. సూపర్ స్టార్ సినిమా కావడంతో షూటింగ్ స్పాట్ కు అభిమానులు భారీగా వచ్చారు. షూటింగ్‌ స్పాట్‌కి రజనీ వచ్చినప్పుడు తలైవా అంటూ నినాదాలు చేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలు సూపర్ స్టార్ మరింత యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, రానా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Akshay Kumar: అక్షయ్ కుమార్ సినిమాకు కొత్త కష్టం.. ఓటీటీ రిలీజ్చేయాలంటే ఇలా చేయాల్సిందే

అక్షయ్ కుమార్ సినిమాలకు కష్టాలు తప్పడం లేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసే హీరోగా అక్షయ్ కు పేరుంది. ఏడాదికి ఆయన 7 సినిమాలు వరకు రిలీజ్ చేస్తుంటాడు. కానీ ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఓఎంజీ 2 సినిమా ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాథియేటర్స్ లో రిలీజ్ అయ్యే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ‘OMG 2’ సెన్సార్ సమస్యను ఎదుర్కొంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు డైలాగ్స్ కు సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ చిత్రయూనిట్ దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో అక్షయ్ కుమార్ సహా చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా పెద్దగా రెస్పాన్స్ లేకుండా థియేటర్లలో సినిమా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా OTT విడుదలకు సమస్య ఏర్పడింది.
OMG 2’ చిత్రం అక్టోబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అక్షయ్ కుమార్ స్వయంగా తన సినిమాను నెట్‌ఫ్లిక్స్ OTTలో చూడమని ఒక ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడింది. ‘OMG 2’ సినిమా OTT వెర్షన్‌పై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి దీంతో సినిమా 27 కట్స్ తో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.
తన సినిమా OTT విడుదల గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, “నాకు ఫైట్ చేయడం ఇష్టం లేదు. నాకు రూల్స్ గురించి తెలియదు, రూల్ బుక్ ఎప్పుడూ చదవను. ఇది అడల్ట్ సినిమా అని అనుకుంటే మనం ఏమీ చేయలేం. చాలా మందికి సినిమా చూపించాం, సినిమా అందరికీ నచ్చుతుంది. యువత కోసం ఈ సినిమా చేశాం అని అన్నారు. ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి శివ భక్తుడి పాత్రలో కనిపించాడు. యామీ గుప్తా, పంకజ్ మల్హోత్రా కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Varun Lavanya : వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ఫోటోలు షేర్ చేసిన మెగాస్టార్..

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని(Lavanya Tripathi) నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లుగా ఎవరికీ తెలియకుండా ప్రేమించుకుంటూ సడెన్ గా నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపోయారు. మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ మధ్యే ఈ నిశ్చితార్థం జరిగింది. మెగా అభిమానులు వరుణ్ పెళ్లిపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పుడు చేసుకుంటారా అని చూస్తున్నారు.

ఇటీవలే బాలీవుడ్ ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వద్దకు వెళ్లి తమ పెళ్లి బట్టలు కూడా డిజైనింగ్ కి ఆర్డర్ ఇచ్చారు. వరుణ లావణ్య పెళ్లి అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ లో ఉండొచ్చని సమాచారం. నిన్న రాత్రి వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కి చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిల మధ్య ఈ సెలబ్రేషన్స్ జరిగాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు తన ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అభిమానులు ఈ ఫోటోల కింద కామెంట్స్ పెడుతూ వీరి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుపుతున్నారు. మరి ఈ ప్రేమ జంట ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కనుందో చూడాలి.

Mahesh Babu: నాని మూవీ సాంగ్ చూసి ఎమోషనల్ అయిన మహేష్ బాబు…

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హయ్ నాన్న. నాని రీసెంట్ గా దసరా సినిమాతో హిట్ అందుకున్నాడు. నాని ఊర మాస్ లుక్ లోకి మారి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటించింది. దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు హాయ్ నాన్న అంటూ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మృణాల్ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు నాని తో కలిసి సినిమా చేస్తోంది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

తండ్రి కూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల మందికి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి గాజు బొమ్మ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ అందమైన సాంగ్ తండ్రి కూతురికి మధ్య సాగే పాట. ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈసాంగ్ పై మహేష్ బాబు రియాక్ట్ అయ్యారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా లో ఈసాంగ్ లింక్ ను షేర్ చేస్తూ.. చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. ‘ఒక తండ్రి నుంచి అతని కుమార్తె వరకు.. ప్రతి తండ్రి మదిలో ప్రతి ధ్వనించే పాట ఇది. హాయ్ నాన్న చిత్రబృందానికి నా ఆల్‌ ది బెస్ట్ అంటూ మహేష్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. హాయ్ నాన్న సినిమాకు అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు.