God OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ.. నయనతార ‘గాడ్‌’ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార నటించిన చిత్రం ఇరైవన్‌. కోలీవుడ్ స్టార్‌ హీరో జయం రవి మరో కీలక పాత్ర పోషించాడు. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా సెప్టెంబర్‌ 28 తమిళంలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో రెండు వారాల తర్వాత అంటే అక్టోబర్‌ 13న తెలుగులో కూడా విడుదలైంది. గాడ్‌గా విడుదలైన ఈ మూవీ ఇక్కడ కూడా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద బాగానే కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ గాడ్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ముందుగా నిర్ణయించిన టైమ్‌ ప్రకారం గురువారం (అక్టోబర్‌ 26) అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ గాడ్‌ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇక గాడ్‌ సినిమాలో నయన్‌, జయం రవి లతో వినోద్ కిషన్‌, రాహుల్ బోస్‌, విజయలక్ష్మి, నరైన్‌, ఆశిష్ విద్యార్థి,చార్లీ, అశ్విన్‌ కుమార్‌, భగవత్ పెరుమాల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. సిటీలో ఒక సైకో కిల్లర్ (రాహుల్ బోస్) అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి అతి క్రూరంగా చంపేస్తుంటాడు. అతనిని ఐపీఎస్‌ ఆఫీసర్‌ అర్జున్‌ (జయం రవి), స్నేహితుడు (నరైన్‌) కలిసి పట్టుకుంటారు. అయితే ఈ క్రమంలో నరైన్‌ చనిపోతాడు. దీనికి తోడు ఆ కిల్లర్‌ను పట్టుకున్న తర్వాత కూడా వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. మరి అసలు వాళ్లని చంపేది ఎవరు? ఎందుకు ఇలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? ప్రియ (నయనతార) పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే గాడ్‌ సినిమా చూడాల్సిందే. థియేటర్లలో ఈ సైకో థ్రిల్లర్‌ మూవీని మిస్‌ అయిన వారికి ఈ మూవీ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

Akshay Kumar: అక్షయ్ కుమార్ సినిమాకు కొత్త కష్టం.. ఓటీటీ రిలీజ్చేయాలంటే ఇలా చేయాల్సిందే

అక్షయ్ కుమార్ సినిమాలకు కష్టాలు తప్పడం లేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసే హీరోగా అక్షయ్ కు పేరుంది. ఏడాదికి ఆయన 7 సినిమాలు వరకు రిలీజ్ చేస్తుంటాడు. కానీ ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఓఎంజీ 2 సినిమా ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాథియేటర్స్ లో రిలీజ్ అయ్యే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ‘OMG 2’ సెన్సార్ సమస్యను ఎదుర్కొంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు డైలాగ్స్ కు సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ చిత్రయూనిట్ దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో అక్షయ్ కుమార్ సహా చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా పెద్దగా రెస్పాన్స్ లేకుండా థియేటర్లలో సినిమా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా OTT విడుదలకు సమస్య ఏర్పడింది.
OMG 2’ చిత్రం అక్టోబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అక్షయ్ కుమార్ స్వయంగా తన సినిమాను నెట్‌ఫ్లిక్స్ OTTలో చూడమని ఒక ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడింది. ‘OMG 2’ సినిమా OTT వెర్షన్‌పై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి దీంతో సినిమా 27 కట్స్ తో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.
తన సినిమా OTT విడుదల గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, “నాకు ఫైట్ చేయడం ఇష్టం లేదు. నాకు రూల్స్ గురించి తెలియదు, రూల్ బుక్ ఎప్పుడూ చదవను. ఇది అడల్ట్ సినిమా అని అనుకుంటే మనం ఏమీ చేయలేం. చాలా మందికి సినిమా చూపించాం, సినిమా అందరికీ నచ్చుతుంది. యువత కోసం ఈ సినిమా చేశాం అని అన్నారు. ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి శివ భక్తుడి పాత్రలో కనిపించాడు. యామీ గుప్తా, పంకజ్ మల్హోత్రా కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.