Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్.. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా.. ఎలక్షన్స్ ముందే రిలీజ్..

Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్.. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా.. ఎలక్షన్స్ ముందే రిలీజ్..

Nitin Gadkari Biopic : ఇటీవల బయోపిక్స్ ఎక్కువగా వస్తున్నా సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా, పలు రంగాల ప్రముఖుల జీవిత చరిత్రలను వెండితెరపై చూపించడానికి వారి జీవిత కథలతో బయోపిక్ సినిమాలని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు అన్ని సినీ పరిశ్రమలలోను బయోపిక్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ బయోపిక్ హంగామా మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అనేక బయోపిక్స్ రాగా బాలీవుడ్ నుంచి ఇప్పుడు మరో ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్ రాబోతుంది.
ప్రముఖ బీజేపీ(BJP) సీనియర్ నేత, ప్రస్తుత కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్ రానుంది. ‘గడ్కరీ’ అనే టైటిల్ తో ‘హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే ట్యాగ్ లైన్ ప్రమోషన్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ అనంత్ దేశముఖ్ నిర్మాణంలో అనురాగ్ రాజన్ బుసారి దర్శకత్వంలో ‘గడ్కరీ’ సినిమా నితిన్ గడ్కరీ బయోపిక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇది కేవలం మరాఠీ సినిమాగా తెరకెక్కుతుంది. మరి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. అయితే ఈ సినిమాలో నితిన్ గడ్కరీ రోల్ ని ఎవరు చేస్తున్నారో ఇంకా ప్రకటించకపోవడం విశేషం.

నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు చెందిన నేత. స్టూడెంట్ గా ఉన్నప్పట్నుంచే బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మొదటి నుంచి కూడా రోడ్స్, ట్రాన్స్ పోర్ట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. అటల్ బిహారి వాజపేయి ఉన్నప్పుడు దేశంలోని రవాణా సౌకర్యం లేని గ్రామాలకు రోడ్లు వేయాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే కార్యక్రమాన్ని ఈయనే ప్రపోజ్ చేశారు. మహారాష్ట్ర గవర్నమెంట్ లో కూడా రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేసి మహారాష్ట్ర రవాణా రోడ్డు శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు.

కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా దేశ రోడ్ల మీద ఫోకస్ చేశారు. గత 9 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రిగా పనిచేస్తూ దేశంలో ఎన్నో కొత్త రోడ్లని, హైవేలను, ఎక్స్ ప్రెస్ హైవేలను తీసుకొచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో రవాణాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు గడ్కరీ. ఇంకా దేశం మొత్తం మీద అనేక హైవేల నిర్మాణం జరుగుతుంది. దేశమంతటా ప్రయాణం అందరికి సులభతరం చేయాలనే ఉద్దేశంతో ముందు నుంచి కూడా ఒకే శాఖపై పట్టు సాధించి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలువురు గడ్కరీపై బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *