Ducati Multistrada V4 RS: రేసింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. డుకాటి నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్.. టాప్ రేంజ్.. సెన్సేషనల్ ఫీచర్స్..

స్పోర్ట్స్ బైక్ లకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాటి ధర ఎక్కువైన అధిక సామర్థ్యం కలిగిన ఈ తరహా బైక్ లను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. అయితే ఈ స్పోర్ట్స్ బైక్ లలో డుకాటి కంపెనీ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ క్రమంలో డుకాటి కంపెనీ మరో కొత్త స్పోర్ట్స్ బైక్ ను ఆవిష్కరించింది. డుకాటి మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ పేరుతో దీనిని ఆవిష్కరించింది. దీనిలో ఏకంగా 1103 సీసీ ఇంజిన్ ఉంటుంది. పూర్తి స్థాయి స్పోర్ట్స్ లుక్ లో అదరగొడుతుంది. దీనిలో టైటానియం సబ్ ఫ్రేమ్, లైట్ వెయిట్ తో అధిక పనితీరు అందించే విధంగా డ్రైవింగ్ మోడ్లు ఉంటాయి. ఈ బైక్ 180 బీహెచ్పీ పవర్, 118ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వీ4ఆర్ఎస్ బైక్ చాలా శక్తివంతమైంది. ఇంతకు ముందుకు ఉన్న మల్టీస్ట్రాడా వీ4 పైక్స్ పీక్ బైక్ కంటే చాలా సామర్థ్యం కలిగినది. ఈ మల్టీస్ట్రాడా వీ4ఆర్ఎస్ అత్యంత శక్తివంతమైన డ్రై క్లచ్ ఉంటుంది. ఈ బైక్ లో సన్నటి ఫ్లాట్ హ్యాండిల్ బార్ ఉంది.

ఎప్పుడు లాంచింగ్ అంటే.. ఇప్పటికే ఈ డుకాటి మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ ను ప్రదర్శంచిన కంపెనీ మార్కెట్లోకి 2024 జనవరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 31.48లక్షలు ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

డుకాటి మల్టీస్ట్రాడా వీ4ఆర్ఎస్ డిజైన్.. దీనిలోని భాగాలు కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. ఐస్ బర్గ్ వైట్ లివరీని కలిగి ఉంది. ఈ బైక్ లో టెక్నో పాలిమర్ టైల్, టైటానియం సబ్ ఫ్రేమ్ ఉంటుంది. వీటి సాయంతో 2.5 కేజీ తక్కువ బరువుతో ఉంటుంది. ఈ బైక్ కి ఇరు పక్కలా సైడ్ కేసెస్.. ప్యాసెంజర్ సీట్ బ్యాగ్స్ ఉంటాయి.

రెండు మోడ్లు.. ఈ బైక్లో రెండు మోడ్లు ఉంటాయి. ఫుల్ పవర్, రేస్ రైడింగ్ మోడ్లు ఉంటాయి. స్టాండర్డ్ రేర్ రాడార్ కంట్రోల్ టెక్నాలజీ ద్వారా అడాప్టివ్ కంట్రోల్ క్రూయిజ్ కంట్రోల్ అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సాధ్యమవుతుంది.

భద్రతకు భరోసా.. ఈ బైక్ లో పవర్ మోడ్, ఏబీఎస్ కార్నరింగ్, డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్, డుకాటి వీలీ కంట్రోల్, డేటైం రన్నింగ్ లైట్, వెహికల్ హోల్డ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.

Flipkart Dussehra Sale 2023 : రూ. 30వేల లోపు ధరలో ఆపిల్ ఐఫోన్ 14 కొనేసుకోండి.. ఈ డీల్ ఎలా పనిచేస్తుందంటే?

Flipkart Dussehra Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్‌ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. అక్టోబర్ 22, 2023న ప్రారంభమైన ఈ సేల్.. అక్టోబర్ 29, 2023 వరకు కొనసాగుతుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్‌ Flipkart Sale Offers సమయంలో డ్రెస్సులు, గాడ్జెట్‌లు, ఎలక్ట్రానిక్స్, మరిన్నింటితో సహా అనేక రకాల ప్రొడక్టులపై గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది.
ఐఫోన్ 14పై బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లు :
ప్రస్తుతం ఇ-కామర్స్ దిగ్గజం (Apple iPhone 14)ని కేవలం రూ. 56,999 ఆకర్షణీయమైన ధరకు అందిస్తోంది. అధికారిక స్టోర్ ధర నుంచి ఆకట్టుకునే రూ. 12,901 తగ్గించింది. SBI, RBL బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 750 అదనపు తగ్గింపును పొందవచ్చు. తద్వారా ధరను ఆకర్షణీయమైన రూ. 56,249కి తగ్గించవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. :
ఆపిల్ హ్యాండ్‌సెట్ శక్తివంతమైన A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా 128GB, 256GB, 512GB స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. కొనుగోలుదారులు ఐఫోన్ 14 మల్టీ కలర్ వేరియంట్‌ల నుంచి ఎంచుకోవచ్చు. అంతేకాదు.. మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ RED, బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.

కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ 12MP ప్రైమరీ సెన్సార్‌తో 12MP అల్ట్రా వైడ్ సెన్సార్‌తో వస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 2532×1170 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,800గా ఉంది.

* ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. గురువారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది. ఒఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 77,500గా నమోదైంది.
* ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఫోన్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడమే. 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయి.

Apple iOS 17.1 Update : ఆపిల్ ప్రొడక్టుల కోసం iOS 17.1 కొత్త అప్‌డేట్ వస్తోంది.. సరికొత్త ఫీచర్లు, బగ్ ఫిక్స్ చేసుకోవచ్చు!

Apple iOS 17.1 Update : ఆపిల్ iOS 17 నుంచి ఫస్ట్ మేజర్ అప్‌డేట్ డెవలప్ చేస్తోంది. గత సెప్టెంబర్‌లో లాంచ్ కాగా.. ప్రస్తుతం టెస్టింగ్ చేస్తోంది. iOS 17.1అప్‌డేట్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి కొత్త ఫీచర్‌లు, బగ్ పరిష్కారాలు ఉన్నాయి. ఫ్రెంచ్ నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ANFR) ప్రకారం.. ఐఫోన్ 12 నుంచి అధిక విద్యుదయస్కాంత వికిరణ ఉద్గారాల గురించి ఆందోళనలను కూడా పరిష్కరిస్తుంది.

అక్టోబరు 24 నుంచి iOS అప్‌డేట్ లైవ్ అవుతుందని అధికారులు పేర్కొన్నారు. కొత్త OS అప్‌డేట్ గురించి ఆపిల్ నుంచి ఇంకా ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు. అయితే, స్టాండ్‌బై మోడ్, ఫొటో షఫుల్ అప్‌గ్రేడ్, మరిన్నింటికి కస్టమైజడ్ తీసుకువస్తుందని తెలిపింది. iOS 17.1తో రాబోయే సరికొత్త ఫీచర్ల సంబంధించి పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

iOS 17.1 కొత్త ఫీచర్లు, యాక్షన్ బటన్ మార్పులు :
కొత్త iPhone 15 సిరీస్ వినియోగదారులు రాబోయే అప్‌డేట్‌లో యాక్షన్ బటన్‌కు మార్పులను ఆశించవచ్చు. ఈ కొత్త ఐఫోన్ యాక్షన్ బటన్‌ను ట్యాప్ చేయడం వల్ల ఇకపై కెమెరా, ఫ్లాష్‌లైట్, ఫోకస్, మాగ్నిఫైయర్, వాయిస్ మెమో ట్రిగ్గర్ చేయవు. అయితే, మ్యూట్ ఫంక్షన్, షార్ట్‌కట్‌లు వంటి కొన్ని ఫీచర్‌లు ఐఫోన్ జేబులో ఉన్నప్పటికీ ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంది.

డైనమిక్ ఐలాండ్ ఫ్లాష్‌లైట్ నోటిఫికేషన్ :
రాబోయే iOS అప్‌డేట్ నాన్-ప్రో iPhone 15 మోడల్‌లకు ఫ్లాష్‌లైట్ నోటిఫికేషన్‌ను అందిస్తుంది. అంటే.. iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 15, iPhone 15 Plus వినియోగదారులు తమ ఫ్లాష్‌లైట్‌లను ఆన్ చేసినప్పుడు, ఫ్లాష్ ఆన్‌లో ఉందని సూచించే నోటిఫికేషన్ డైనమిక్ ఐలాండ్‌లో కనిపిస్తుంది.

కస్టమైజడ్ స్టాండ్‌బై మోడ్ (Customisable StandBy mode) :
ఐఫోన్ యూజర్లు త్వరలో iOS 17 లాంచ్‌లో ప్రకటించిన కొత్త స్టాండ్‌బై మోడ్ ఫీచర్‌లను పొందవచ్చు. 9to5Mac ప్రకారం.. ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు తమ ఐఫోన్‌లను స్మార్ట్ డిస్‌ప్లేలుగా మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లో స్క్రీన్ టైమ్‌అవుట్ సెట్టింగ్ మాదిరిగానే ఐఫోన్ యూజర్లు 3 ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు.

Hyderabad: తగ్గేదేలే.. అంటూ పుష్ప సినిమాను మించిన సీన్.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

తగ్గేదేలే.. పుష్ప సినిమా ట్రెండ్ గురించి మనం చెప్పాల్సిన పనేలేదు.. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టర్.. ముఖ్యంగా గంధపు చెక్క అక్రమ రావాణా కథాంశంగా తీసిన ఈ సినిమా.. పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది.. త్వరలోనే పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ కానుంది. అయితే, పుష్ప సినిమా తర్వాత.. అక్రమ రవాణా ఎలా జరుగుతుంది..? ఇలాంటి స్టైల్లో కూడా రవాణా చేస్తారా..? అనే కొత్త విషయాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే.. అదే తరహాలో డబ్బు, గంజాయ్, బంగారం, డ్రగ్స్.. ఇలా ఎన్నో విలువైన వస్తువులు అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. అయితే.. తాజాగా.. పుష్ప సినిమా స్టైల్లో అక్రమంగా గంజాయ్ తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్‌ పేట్ బషీరాబాద్ ‌పీఎస్ పరిధి దూలపల్లి క్రాస్ రోడ్డు దగ్గర నిర్వహించిన వాహన తనిఖీలతో గంజాయి ముఠా ఆపరేషన్‌ బయటపడింది. కారు నెంబర్‌ AP 36 R 3033కి పుష్ప సినిమా తరహాలో ప్రత్యేకంగా సీటు అమర్చి గంజాయి సప్లై చేస్తున్న ముఠా పట్టుబడింది. కారు వెనుక‌ భాగంలో డిఫరెంట్ సెటప్ ఏర్పాటు చేశారు నిందితులు. కారు ఆపి తనిఖీ చేయగా 41 ప్యాకెట్‌లు, 82 రెండు కిలోల గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యుల బాగోతం బయటపడింది.

సుచిత్ర సెంటర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారును దూలపల్లిలో నిలిపి తనిఖీలు చేశారు పోలీసులు. నిందితుల నుంచి ‌కారు, రెండు సెల్ ఫోన్లు, ‌41 ప్యాకెట్‌లలో అమర్చిన 82 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అమర్నాథ్, సంజీవ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితులను లోతైన సమాచారం రాబడుతున్నారు పేట్ బషీర్‌బాద్ పోలీసులు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? వీరి ఆపరేషన్ ఎలా సాగుతుందనే కోణంలో కూపీ లాగుతున్నారు.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. గురువారం తులం గోల్డ్ ఎంతకు చేరిందంటే..

దేశంలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. రోజురోజుకీ ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం తులం బంగారంపై రూ. 200 వరకు పెరగగా ఈరోజు (గురువారం) కూడా గోల్డ్‌ ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి, రూ. 61,800కి చేరింది. ఇక దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690వద్ద కొనసాగుతోంది.

* ముంబయిలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 వద్ద కొనసాగుతోంది.

* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800గా ఉంది.

* ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,800గా ఉంది.

* ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. గురువారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది. ఒఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 77,500గా నమోదైంది.
* ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఫోన్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడమే. 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయి.

Telangana Elections: బోధన్‌లో నాన్ కేడర్ పాలిటిక్స్.. వారి ఓట్లపైనే అన్ని పార్టీల పోక‌స్

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన పవన్.. మూడు అంశాలపై క్లారిటీ ఇచారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఈపరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు పవన్. టీడీపీతో పొత్తు విషయం బీజేపీతో మాట్లాడి.. డిల్లీలో ప్రకటించాలి అనుకున్నా.. వైసీపీ తీరు వల్లే రాజమండ్రిలో ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చాక పొత్తులపై కోఆర్డినేషన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పవన్‌. ఇప్పటికి జనసేన ఎన్డీఏలోనే ఉందని స్పష్టం చేశారు పవన్. కూటమిలో బీజేపీ కచ్చితంగా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జగన్‌ ఎన్డీఏలో లేరని.. కేవలం ఆయనను ఒక రాష్ట్ర సీఎంగానే కేంద్రం గౌరవిస్తుందని చెప్పారు పవన్. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే నిధులు విడుదల చేసిందని బీజేపీ తనతో చెప్పిందన్నారు పవన్. వారాహి విజయయాత్రలో భాగంగా పెడనలో వైసీపీ ప్రభుత్వంపై పవన్‌ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని.

బోధన్ నియోజకవర్గం కొత్తగా నమోదైన మైనారిటీ ఓట‌ర్లపై బీజేపీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, బిలోలి ప్రాంతాలకు చెందిన మైనారిటీ వర్గాల వారిని బోధన్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతలు అక్రమంగా ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. దొంగ ఓట్లను తొలగించాలంటూ ఆందోళ‌న బాట ప‌ట్టింది బీజేపీ. ఏకంగా నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మెడ‌పాటి ప్రకాశ్ రెడ్డి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో దాదాపు 8 వేలా ఓట్లను తొల‌గించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు వేసిన స్కెచ్‌తో బీజేపీ మెజారిటీగా హిందూ ఓటు బ్యాంక్ పోల‌రైజెష‌న్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 8 వేల ఓట్లు పోవ‌డంతో డైలామాలో ప‌డింద‌ట బీఆర్ఎస్. ఇక హిందూ ఓటు బ్యాంక్‌ను చేసుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్ బీఆర్ఎస్. ఈనేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టాయి. బీజేపీతో ఇప్పటి వ‌ర‌కు ఉన్న వాళ్లను టార్గెట్ చేసి తమ పార్టీల్లోకి ఆక‌ర్షిస్తున్నార‌ట. బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్‌గా పైట్ మార‌డంతో ఏవ‌రి బ‌లం వాళ్లు చూపించుకోవాడానికి ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బీజేపీ ఫైర్
బీజేపీ నియోజక‌వ‌ర్గ ఇంచార్జ్‌గా ప్రకాశ్ రెడ్డి టికెట్ వ‌స్తే ఇబ్బంది అవుతుంద‌నే ఆలోచ‌న‌తో మ‌రో వ్యక్తికి టికెట్ వ‌స్తుంద‌నే మైండ్ గేమ్ అడుతున్నాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం పోటీ బీఆర్ఎస్, బీజేపీ మ‌ద్యే ఉండ‌టంతో.. కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ చేస్తుంద‌ని ఆరోపిస్తున్నార‌ు బీజేపీ నేతలు.ఇక ఇన్ని రోజులు క్యాడ‌ర్‌ను న‌మ్ముకున్న పార్టీలు ఇప్పుడు వ‌ర్గాల‌ను న‌మ్ముకోవ‌డం ఎల‌క్షన్ హీట్ క‌నిపించేలా చేస్తుంద‌ట. ఇప్పటికే ఎన్నిక‌ల వేడి స్టార్ట్ అయిపోవ‌డంతో బీజేపీ అభ్యర్థి ఫైన‌ల్ అయితే పోటి ఇంకా ర‌స‌వ‌త్తరంగా ఉండ‌నుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ‌ర్గాలు, కులాలు అంటూ బోధన్ పాలిటిక్స్ ఇంకా ఎన్ని మ‌లుపు తిరుగుతుందో వేచి చూడాలి..!

Minister KTR: ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంటు ఆపేయమంటారేమో..? కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్..

Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ మాటల తూటాలను పేల్చుతూ.. ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు (KTR) కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదంటూ పేర్కొన్నారు. ‘రైతుబంధు’ నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయడంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ద్వారా విమర్శలు గుప్పించారు.

ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో? అందులో కూడా కేసీఆరే కనిపిస్తారు కదా? అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతులు భరించరు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.

కాంగ్రెస్ అంటేనే.. రైతు విరోధి .. అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్.. కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది.. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక 3 గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.. అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్లర్ లో రాశారు.

Raja Singh: నన్ను, యోగిని చంపేస్తారట.. బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదు చేసిన బీజీపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

Telangana Assembly Election 2023: ఎన్నికల సమయంలో గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. తన భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తనతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కు ప్రాణహాని ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. చంపేస్తానంటూ కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ పేర్కొన్న రాజాసింగ్ బుధవారం తనకు మరో బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపారు. తనను, తన కుంటుంబాన్ని, ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోతో పాటు నగర పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు లేఖను రాజాసింగ్ విడుదల చేశారు. కాల్ చేసిన వ్యక్తి సుమారు 6 నిమిషాల పాటు మాట్లాడాడని.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ ఫిర్యాదులో తెలిపారు.

సిటీ పోలీసులకు ఇచ్చిన వీడియో స్టేట్‌మెంట్‌లో.. బుధవారం మధ్యాహ్నం 1:59 గంటలకు తనకు కాల్ వచ్చిందని రాజాసింగ్ చెప్పారు. “ఎన్నికలు లేదా కౌంటింగ్ రోజు ముందు నన్ను, నా కుటుంబానికి హాని కలిగిస్తామని కాలర్ బెదిరించాడు.. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గోష్‌మహల్‌లో ప్రచారం చేసేందుకు నగరానికి వచ్చినప్పుడు తమకు హాని తలపెడతామని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు.. ఆ నంబర్ కాలర్ ఐడీ విదేశాలకు చెందినది..’’ అంటూ రాజాసింగ్ తెలిపారు.

“ఈ వ్యక్తికి నా ప్రతి కదలిక గురించి హైదరాబాద్‌లో నివసించే వ్యక్తి నిరంతరం వివరిస్తున్నాడు. నా కుటుంబ సభ్యుల గురించి.. నేను ప్రచారానికి వెళ్లినప్పుడు.. ఏ బుల్లెట్ నడుపుతానో, అలాగే పలు విషయాల గురించి అతనికి తెలుసు” అని రాజా సింగ్ వివరించారు. “నేను గతంలో బెదిరింపు కాల్‌లను ఎదుర్కొన్నప్పటికీ, పోలీసులు ఈ ప్రత్యేక ముప్పును పరిష్కరించడం అత్యవసరం, ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్న ప్రస్తావన కారణంగా.. చర్యలు తీసుకోండి” అంటూ డిజిపికి విజ్ఞప్తి చేశారు.

కాగా.. వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం ఏడాది తర్వాత భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అంతేకాకుండా.. మళ్లీ బీజేపీ గోషామహాల్ టికెట్ ను కేటాయించింది. ఈ మేరకు ఫస్ట్ లిస్ట్‌లోనే బీజేపీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒక్క షేక్‌హ్యాండ్‌.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.. పవన్, నాని కలయిక వెనుక ఇంత అర్ధముందా?

ఒక్క షేక్‌హ్యాండ్‌.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ముఖ్యంగా గుడివాడలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బద్ద శత్రువుల్లాంటి ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఇలా హ్యాపీగా నవ్వుతూ కరచాలనం చేసుకోవడం చాలామందిని అర్ధం కాట్లేదు. అటూ.. ఇటూ.. వార్‌ అయితే కంటిన్యూ అవుతోంది. ఒక పెళ్ళి వేడుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది.

వంగవీటి రాధా పెళ్లి.. సరికొత్త చర్చకు దారి తీసింది. ఆయన పెళ్లికి హాజరైన సమయంలో కనిపించిన సీన్స్‌ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మాజీ మంత్రి,. వైసీపీ నేత కొడాలినాని.. ఈ ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం.. పైగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు ఇలా మెలగడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపిచింది కూడా. అయితే గుడివాడలో మాత్రం పొలిటికల్‌గా దుమారం రేగింది. మాజీ మంత్రి కొడాలిపై టీడీపీ, జనసేన నేతలు మండిపడ్డారు. కేవలం పవన్‌తో కరచాలనం కోసం.. నాని ఎంతకు దిగజారారో అంతా చూశారని ఆరోపించారు నేతలు. పవన్‌ చుట్టూ అభిమానులున్నా.. కొడాలి నాని మాత్రం వారిని తోసుకుంటూ వెళ్లి పవన్‌తో చెయ్యి కలిపారని మండిపడ్డారు.

అయితే వంగవీటి రాధా పెళ్లికి వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు. తనకు సన్నిహితులైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పెళ్లికి పిలిచారు. అంతేకాదు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కొడాలి నాని.. అప్పటికే పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆయన వంగవీటి రాధాను కంగ్రాట్స్‌ చెప్పేందుకు స్టేజ్‌ ఎక్కేలోపే పవన్‌ కల్యాణ్‌ రావడం జరిగింది. ఇద్దరూ ఎదురెదురుగా రావడంతో.. ముందు కొడాలి నాని నమస్కారం చేశారు.. అది చూసి పవన్‌ ప్రతి నమస్కారం చేసి.. కరచాలనం కోసం చేయి ఇచ్చారు. దీంతో నాని కూడా ముందుకు కదిలి చేయి కలిపారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అటు జనసేన వారు పవన్‌తో షేక్‌ హ్యాండ్‌ కోసం నాని ఎగబడ్డారంటే.. నానితో పరిచయం కోసం పవన్‌ చేయి ఇచ్చారంటూ ఎవరికి నచ్చిన పోస్టులు వారు పెడుతున్నారు.

అయితే పెళ్లికి వచ్చిన అతిథులు ఎదురుపడితే ఇలా నమస్కరించుకుని.. షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం కనీస సంస్కారం అంటూ మరికొందరు స్పందించారు. తెలుగు దేశం పార్టీ – జనసేన పార్టీలు మాత్రం కొడాలి నాని టార్గెట్‌ గానే ఆరోపణలు చేస్తున్నాయి. అసలు కొడాలి ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలంటూ జనసేన అంటోంది. రెండు బస్సులతో రెండు కోట్ల బెంజ్‌ కారు ఎలా కొన్నావంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

AP Politics: ఏపీలో హీటెక్కిన రాజకీయాలు.. పోటా పోటీ యాత్రలతో జనంలోకి వైసీపీ, టీడీపీ

ఆరు నెలల్లో ఎన్నికలు జరగునున్న ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నాలుగున్నరేళ్లలో చేసిన సంక్షేమం-అభివృద్ధి ఎజెండాగా మరోసారి ప్రజల్లోకి వెళ్తుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ప్రతిపక్ష తెలుగు దేశం, జనసేన పార్టీలు పోటా పోటీ యాత్రలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆయన భార్య భువనేశ్వరి జనం మద్యలోకి వచ్చారు.

సామాజిక సాధికార యాత్ర ద్వారా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోనే ఉన్న వైసీపీ కేడర్, తాజాగా ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర చేపడుతోంది. అక్టోబర్ 26 నుంచి 60 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్రలు కొనసాగనున్నాయి. ఒక్కో రోజు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని మూడు ప్రాంతాల్లో మూడు నియోజకవర్గాల్లో యాత్రలు జరగనున్నాయి. మద్యాహ్నం ఒంటి గంట నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

వైసీపీ సామాజిక సాధికార యాత్రకు సంబంధించి షెడ్యూల్ పార్టీ వర్గాలు విడుదల చేశాయి. అయా నియోజకవర్గాల్లో ముందుగా ఎంపిక చేసిన సచివాలయాన్ని వైసీపీ నేతలు సందర్శిస్తారు. ఇక్కడే ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్లు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, స్థానికంగా ఎంపిక చేసిన 200 మందితో కలిసి సహాపంక్తి భోజనం చేస్తారు. తర్వాత మీడియా సమావేశం ఉంటుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సామాజిక సాధికారత,గత ప్రభుత్వం పేదల విషయంలో వ్యవహారించిన తీరును ప్రజలకు వివరించనున్నారు. బస్సు యాత్ర వెళ్లే మార్గంలో ముందుగా నిర్ణయించిన చోట్ల ప్రజలతో మమేకం అవుతారు. అదే రోజు సాయంత్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తారు. సామాజిక సాధికార యాత్ర లో భాగంగా బస్సు పైనుంచే ప్రజల నుద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రసంగించనున్నారు. అక్టోబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సామాజిక సాధికార యాత్ర ను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రులు,ఇతర నేతలు లాంఛనంగా ప్రారంభించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పైనే స్పెషల్ ఫోకస్
సామాజిక సాధికార యాత్ర… పేరుకు తగ్గట్లుగానే బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేసింది వైసీపీ. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏవిధంగా ప్రాధాన్యత ఇచ్చిందో, ప్రజలకు వివరించడమే యాత్ర లక్ష్యంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. కేబినెట్‌తో పాటు ఇతర పదవుల్లోనూ భారీగా కేటాయింపులు చేయడం, ఆయా వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రను ఉపయోగించుకొనున్నారు వైసీపీ నేతలు. బస్సు యాత్రలో పేదలు పాల్గొనేలా చూడాలని సీఎం జగన్ ఇప్పటికే నేతలకు సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పేదలకు-పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతుందనే నినాదాన్ని బస్సు యాత్ర ద్వారా బలంగా తీసుకెళ్లాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో వైసీపీ నేతలు క్లాస్ వార్ స్లోగన్‌తో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లేదంటే సమన్వయకర్తలు అధ్యక్షతన బస్సు యాత్ర జరగనుంది. ప్రతి బస్సులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు తప్పకుండా ఉండేలా ప్లాన్ చేశారు. సభలు ఎలా జరగాలి. ఎలాంటి అంశాలతో ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే రీజినల్ కోఆర్డినేటర్లు సమావేశాలు పెట్టి వివరించారు. మొదటి విడతలో నవంబర్ 9 వ తేదీ వరకూ ఒక్కో రోజు మూడు ప్రాంతాల్లో యాత్రలు సాగనున్నాయి.
బస్సు యాత్ర మొదటి విడత షెడ్యూల్ రిలీజ్ చేసిన వైసీపీ
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వ తేదీ వరకూ మొదటి విడత సామాజిక సాధికార యాత్ర లు జరగనున్నాయి. దీనికి సంబందించిన పోస్టర్ ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు విడుదల చేశారు. మొదటి రోజు ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమ లో సింగనమలలో యాత్రలు జరగనున్నాయి. మొదటి విడతలో 39 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కోనసాగనుంది.
జనంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి
మరోవైపు స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టై జైల్లో ఉండటంతో ఇప్పుడు ఆయన భార్య భువనేశ్వరి జనం మద్యలోకి వచ్చారు. చేయి చేయి కలిపి పోరాటం చేద్దామని ప్రజలకు భువనేశ్వరి పిలుపినిచ్చారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె నుంచి యాత్రను ఆమె ప్రారంభించారు. తండ్రి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి, నిజం గెలవాలికి భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. ఆమె వెంట చిత్తూరు, తిరుపతి జిల్లాల టీడీపీ నేతలతో పాటు ఎమ్మెల్సీ అనురాధ, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు.
నిజం గెలవాలి యాత్రలో పరామర్శలు..
నిజం గెలవాలి యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టు వార్త విని ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. చంద్రగిరిలో మరణించిన ప్రవీణ్‌రెడ్డి, నేండ్రగుంటలో కన్నుమూసిన చిన్నబాబు కుటుంబాన్ని భువనేశ్వరి ఓదార్చారు. వారి కుటుంబాలకు 3 లక్షల చెక్కు అందజేశారు. కష్టకాలంలో అండగా ఉన్న ప్రతీ ఒక్కరి బాధ్యత పార్టీ తీసుకుంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. పరామర్శ తర్వాత చంద్రగిరిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు, రాజకీయాలు చేసేందుకు తాను రాలేదని భువనేశ్వరి అన్నారు. తానెప్పుడు ఇలా బయటకు రాలేదని తెలిపారు. నిజం గెలవాలన్నది ఒక పోరాటమని తెలిపారు.