Telangana: దారుణం..కోతుల‌కు విషం పెట్టి చంపిన మ‌నుషులు.. నిందితులను పట్టుకోవాలంటూ స్థానికుల డిమాండ్..

Peddapalli District: గ్రానైట్ వ్యాపారం కారణంగా కొండలు అంతరించి పోతున్నాయి. దీంతో వానరాలు తిండి కోసం గ్రామలకు వలస వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని కొందరు వ్యక్తులకు కోతులకు విషమిచ్చి చంపేశారు. చనిపోయిన కోతులను చూసి స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక సర్పంచ్ శ్రావణ్ కు సమాచారం అందించారు. సర్పంచ్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో ఫారెస్ట్ అధికారులు
పాపం.. మూగ జీవలను చంపేశారు… దేవుడికి ప్రతి రూపంగా భావించే వానరాలకు విషం పెట్టి దారుణంగా హత్య చేశారు.. 35కు పైగా కోతులు మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. ఈ సంఘటన పై విచారణ చేపట్టారు. ఈ దారుణ సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బ పల్లి గ్రామ సమీపంలోని స్మశాన వాటిక దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు కోతులకు విషం పెట్టి చంపేశారు. మృతి చెందిన కోతులను తీసుకొచ్చి స్మశాన వాటిక సమీపంలో పడ వేశారు. 35 పైగా కోతులు చనిపోయి ఉన్నాయి..

అయితే, పథకం ప్రకారమే.. ఈ కోతులను చంపేశారని తెలిసింది.. ఇటీవల కోతులు గ్రామాల్లోకి విపరీతంగా వస్తున్నాయి.. గ్రానైట్ వ్యాపారం కారణంగా కొండలు అంతరించి పోతున్నాయి. దీంతో వానరాలు తిండి కోసం గ్రామలకు వలస వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని కొందరు వ్యక్తులకు కోతులకు విషమిచ్చి చంపేశారు.  చనిపోయిన కోతులను చూసి స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక సర్పంచ్ శ్రావణ్ కు సమాచారం అందించారు.  సర్పంచ్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో ఫారెస్ట్ అధికారులు వచ్చి వాటిని పశు వైద్యాధికారి రఘుపతి రెడ్డి ఆయన టీం తో పంచనామా చేయించారు.  విషం పెట్టి చంపిన వ్యక్తులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఏది ఏమైనా మూగజీవాలను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలి తప్ప , విషం పెట్టి చంపడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులే ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు.. ఈ కోతుల అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు..

Telangana Elections: సీఎం సీటుపై గురి! మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్..

GreenLam Industries: ప్రపంచంలోని టాప్ 3 లామినేట్ తయారీదారులలో ఒకటైన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలోని తన అత్యాధునిక తయారీ కేంద్రంలో శుక్రవారం నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించినట్లు వెల్లడించింది. లామినేట్ యూనిట్ ఏర్పాటు దక్షిణ భారతదేశంలో తన తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు, నాణ్యమైన లామినేట్ షీట్లు మరియు కాంపాక్ట్ బోర్డ్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలలో కంపెనీ గణనీయమైన ముందడుగు వేసింది.
నల్లగొండ జిల్లా నక్రేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత తొలిసారిగా ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నక్రేకల్ కు వచ్చాడు. ఈ సదర్భంగా చిట్యాల మండలం పంతంగి టోల్ ప్లాజా నుంచి నక్రేకల్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నక్రేకల్ చౌరస్తాలో జరిగిన సభలో ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపి మధయాష్కీ, వేముల వీరేశం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ.. కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుందని, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చని ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఏదో ఒక రోజు తాను కూడా సీఎం అవుతానంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు సీఎం కోమటిరెడ్డి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మోసపూరిత మాటలతో ఎన్నికల్లో మళ్లీ గెలవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు హెలి కాఫ్టర్ లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పై అబద్ధాలు చెపుతున్నారని ఆయన ఆరోపించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నకిరేకల్‌ నుంచి వేముల వీరేశం గెలుపు ఖాయమని, మెజారిటీ కోసం ప్రయత్నించాలని ఆయన క్యాడర్ ను కోరారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని, ఎన్నికలు రాగానే పథకాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేందుకు సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు పంపిణీ చేశారని కోమటిరెడ్డి విమర్శించారు.

Kantareddy Tirupati Reddy : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

Kantareddy Tirupati Reddy – BRS : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గుడ్ బై చెప్పేస్తున్నారు. హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కుతున్నారు. ఇప్పటికే మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు మరో డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ ను వీడారు
మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కె. తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్డీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి తన క్యాడర్ తో పాటు వస్తున్న తిరుపతి రెడ్డికి హృదయపూర్వక స్వాగతం పలికారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను బలవంతంగా బయటకి పంపించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పార్టీలో చేరడం స్వాగతించదగిన విషయం అన్నారు. తిరుపతి రెడ్డితో పాటు బీఆర్ఎస్ లో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుకుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. వారికి సముచిత గౌరవాన్ని కల్పిస్తామన్నారు.

బీఆర్ఎస్ అసంతృప్త నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం చిచ్చు రాజేసింది. మైనంపల్లి రాకను కొందరు కాంగ్రెస్ కీలక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉండగా కేసుల పెట్టి కాంగ్రెస్ నేతలను వేధించిన మైనంపల్లి హనుమంతరావు లాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా రెండు టికెట్లు ఇవ్వడాన్ని కొందరు కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నారు.

పార్టీ పెద్దలు ఎవరూ తమకు కనీస గౌరవం ఇవ్వలేదన్న వేదన ఆ ఇద్దరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కారణమైందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలో కొందరు నేతలు చేరితే బలం పుంజుకున్నామని అనుకుంటే.. ఉన్న నేతలను కాపాడుకోలేకపోవడం బలహీనతే అంటున్నారు కాంగ్రెస్ లాయలిస్టులు.

Telangana Elections: 6 గ్యారంటీలు సరిపోవు.. హామీల డోస్ పెంచే పనిలో తెలంగాణ కాంగ్రెస్..!

తెలంగాణ కాంగ్రెస్‌లో తుక్కుగూడ సభతో కొత్త జోష్ వచ్చింది.. సభలో సోనియా, రాహుల్ గాంధీలు ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌తో జనాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఎంత వరకు వర్కౌట్ అవుతాయని చర్చ జరుగుతుంది. దీనిపై ఇటు బీజేపీ, బీఆరెస్ లు సైతం కాంగ్రెస్ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. కాని కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్‌లోనే గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌లో మహలక్ష్మి ద్వారా మహిళలకు ప్రతినెలా రూ. 2,500 పంపిణి, రూ. 500 కే వంట గ్యాస్ సిలిండర్.. అర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. రైతు భరోసా ద్వారా ప్రతిఏటా రైతులు, కౌలు రైతులకు రూ. 15,000 బ్యాంక్ అకౌంట్‌లోకి, వ్యవసాయ కూలీలకు రూ. 12,000 పంపీణి.. వరిపంటకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రకటించింది. గృహజ్యోతి స్కీమ్ ద్వార ప్రతి కటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని.. ఇల్లులేని వారికి ఇంటి స్థంలంతో కలిపి రూ. 5 లక్షలతో ఇంటి నిర్మాణం. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. యువ వికాసం స్కీమ్ ద్వార విద్యార్ధులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు. చేయూత స్కీమ్ పథకం ద్వారా వృద్ధులకు, వికాలంగులకు, ఒంటరి మహిళలకు, రూ. 4,000 నెలవారీ పింఛను. రూ. 10 లక్షల రాజీవ్ అరోగ్యభీమా అందించాలని కాంగ్రెస్ పార్టీ తన ఆరు ఆస్త్రాలుగా చెప్పుకుంటుంది.

అయితే వీటిని ఎక్కడి నుండి అమలు చేస్తారని బీఆరెస్ చెబుతున్న వాటికి.. కర్ణాటక, రాజస్థాన్, ఛత్తిస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు ఉదాహరణగా.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌లో 200 యూనిట్లలో ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్‌ని కర్ణాటక, రాజస్థాన్‌లో అమలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, మహాలక్ష్మి ద్వారా రూ. 2,500, కర్ణాటకలో, వరికి క్వింటాల్‌కి రూ. 500 బోనస్ ఛత్తిస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అక్కడ తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే అన్ని గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నామని, తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఇక్కడ రైతుబంధు కొనసాగుతుంది దానిని మరో 5 వేలు పెంచాల్సి ఉంటుంది. తెలంగాణలో పెన్షన్ రూ. 3 వేలు ఇస్తున్నారు. దానిని మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇవి ఇష్టారితిన ఇచ్చిన హామీలు కాదని దీనిపైన ఆర్థిక నిపుణులు అధ్యయనం చేసిన తరువాతనే వీటిని ప్రకటించిందని తెలంగాణ నేతలు చెబుతున్నారు.

అయితే ఇప్పడున్న పథకాలకు తోడు కాంగ్రెస్ తీసుకొచ్చే కొత్త పథకాలకు పెద్ద బడ్జెట్ ప్రభావం ఉండదని..ఇప్పటికే కాళేశ్వరం ,పాలమూరు లాంటి పథకాలు పూర్తావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం లో పెద్ద ప్రాజెక్టులు ఏమి ఉండకపోవడం కలిసి వచ్చే అంశం. రాష్ట్రంలో పెరుగుతున్న ఆదాయంతొ కొత్త పథకాలకు ఇబ్బందలు ఉండవని భావిస్తున్నారు. అయితే ఈ ఆరు గ్యారంటీ స్కీమ్స్ ని జనాల దగ్గరకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ వ్యూహత్మకంగా డోర్ టూ డోర్ ప్రచారాన్ని చేస్తుండడం.. తాము అధికారంలో ఉన్నా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నామని జనాలను కాంగ్రెస్ మెప్పించే ప్రయత్నం చేస్తుంది. కాని కాంగ్రెస్ తమ ఆస్త్రాలుగా భావిస్తున్న ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఎంత వరకు విజయతిరాలకు చెరుస్తుందో చూడాలి మరి.

ED Notice To Navdeep : నటుడు నవదీప్‏కు ఈడీ నోటీసులు, 10న హాజరుకావాలని ఆదేశం

ED Notice To Actor Navdeep : టాలీవుడ్ నటుడు నవదీప్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మాదాపూర్ డ్రగ్స్‌ కేసులో విచారణ కోసం ఈనెల 10న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు డ్రగ్స్ కన్జ్యూమర్ గా పేర్కొన్న నేపథ్యంలో ఓ సారి నార్కోటిక్‌ బ్యూరో విచారణ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. 10తేదీన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. నవదీప్ కు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ తో సంబంధాలున్నట్లుగా నార్కోటిక్ బ్యూరో విచారణలో గుర్తించింది.
కాగా గత నెలలో నగరంలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు మాదాపూర్ పోలీసులతో కలిసి డ్రగ్స్ సరఫరా విషయాలో ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో భాగంగా పలువురుని అదుపులోకి తీసుకన్నారు. వీరిలో నైజీరియాకు చెందిన వ్యక్తులతో పాటు ఓ దర్శకుడు, మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.వీరి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసినవారిని విచారించగా నటుడు నవదీప్ కు వారితో సంప్రదిపులు జరిపినట్లుగా తెలుసుకున్నారు. దీంతో నవదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే హీరో నవదీప్ ను పోలీసులు విచారించారు. ఈక్రమంలో మరోసారి నోటీసులు జారీ చేయటంతో పాటు అక్టోబర్ 10న విచారణకు రావాలని ఆదేశించారు.

కాగా డ్రగ్స్ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కోరుతు పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సెప్టెంబర్ 19 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ఈడీ నోటీసులపై నవదీప్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

మాకొద్దు బాబోయ్ ఈ పోలీస్ స్టేషన్ ..! పోస్టింగ్‌ అంటే ఇష్టమే గానీ,.. అక్కడికి వెళ్లాలంటేనే..?!

హైదరాబాద్, అక్టోబర్07; హైదరాబాద్ సిటీలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఉన్న క్రేజే వేరు. ఒకప్పుడు బంజారాహిల్స్ పోస్టింగ్ అంటేనే సిటీలోనే కాదు రాష్ట్రంలోనే నంబర్ వన్ పోలీస్ స్టేషన్ గా ఉండేది. అలాంటి పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ గా పోస్టింగ్ అంటేనే రాష్ట్రస్థాయిలో ఆ అధికారులకు ఉండే డిమాండ్ వేరు.. అలాంటి హాట్ కేక్ లాంటి పోలీస్ స్టేషన్ కు గత కొన్ని సంవత్సరాల నుండి నిత్య వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.. అసలే వెస్ట్ జోన్ ఆపై వీఐపీ ఏరియా వందల కొద్ది పబ్బులు మసాజ్ సెంటర్ లు … అన్ని ఉండేది ఇక్కడే. ఒకానొక సందర్భంలో ఇక్కడి ఇన్ స్పెక్టర్ నెలసరి ఆదాయం రూ. 10 లక్షలు పైబడే ఉండేది .. అలాంటి పోలీస్ స్టేషన్ కు ఇప్పుడు ఇన్ స్పెక్టర్ గా వెళ్లాలంటేనే పోలీసులు జంకుతున్నారు .. కారణం ఏదైనా కానీ, ఇక్కడ తప్ప ఎక్కడైనా ఇవ్వండి..అని కొందరు అంటుంటే , వివాదాలు ఉన్నా సరే ఇక్కడే కావాలి.. అని మరికొందరు పైరవీ చేసుకుంటున్నారు…

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అంటేనే రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు అందరి చూపు ఇక్కడే ఉంటుంది. దీంతో సాధారణంగానే ఈ పోలీస్ స్టేషన్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్లకు అంతగా అచ్చు రావడం లేదు..పబ్బులు, స్పా, మసాజ్ సెంటర్ ల నుండి మామూళ్లు వసూలు చేస్తూ పట్టుబడుతున్నారు పలువురు పోలీసులు…ఇక్కడ గతంలో పని చేసిన పలువురు పోలీసుల పైనా చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి..కొంత మంది అడ్డంగా ఏసీబీ కి దొరుకుతుంటే, మరి కొంత మంది మాత్రం మాముళ్లు తీసుకుంటూ కూడా వేధింపులకు గురి చేస్తున్నారు..ఇంకొందరు రియల్ ఎస్టేట్ వివాదాల్లో తలదూర్చి సెటిల్ చేస్తున్నారు..గతం లో వ్యాపారవేత్త జయరాం హత్య కేసు సందర్భంలో అప్పటి ఇన్ స్పెక్టర్ పైన ఆరోపణలు రావటంతో విఐపి జోన్ లో ఉన్న ఇద్దరు  ఇన్ స్పెక్టర్లను   అప్పటి ఉన్నతాధికారులు అటాచ్ చేశారు. ఇదే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ పే సిపి కార్యాలయానికి అటాచ్ చేశారు.

Warangal: వరంగల్‌లో వీధికుక్కల హల్ ఛల్.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను గాయపరచిన కుక్క

Follow Us :

Warangal: వీధి కుక్క దాడిలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ తోపాటు పలువురు గాయపడిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మట్టవాడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీను బట్టల బజార్లో విధులు నిర్వహిస్తున్నారు. అటుగా వెళుతున్న రాజమ్మ అనే వృద్ధురాలిని కుక్కలు దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనుపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

గాయపడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీను, రాజమ్మ తో పాటు కాశిబుగ్గకు చిందిన నవీన్, కాజీపేట కు చెందిన పర్వేజ్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితులను పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఎంజీఎం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఇప్పటికే అనేకసార్లు కుక్కల దాడి ఘటన జరుగుతున్న నిద్రమత్తులో ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు పై జంగా రాఘవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

WEB POSTS :

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు శేజల్‌. దుర్గం చిన్నయ్య పోలీసులకు డబ్బులు ఇచ్చి మేనేజ్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీలో సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సీబీఐకి ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకే సీబీఐకి ఫిర్యాదు చేశానన్నారు. ఇక తనపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారని.. న్యాయం జరిగే వరకు ఢిల్లీలోనే ఉంటానని శేజల్‌ అన్నారు.

WEB POSTS :

రూ. వెయ్యి కోట్ల భూములు కొట్టేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పాలనలో పాదర్శకంగా భూ రికార్డులు ఉండేవని.. ఇప్పుడు నిషేధిత భూములను కూడా దోచుకుంటున్నారని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.. వెయ్యి కోట్ల రూపాయల భూములను కొట్టేస్తున్నారంటూ ఆయన ఘాటైన ఆరోపణలు చేశారు.. ధరణి సమస్యలు పరిష్కారం కాక రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి కలెక్టరేట్ల ముందు వేలాది మంది రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు.. సమస్యల పరిష్కారం కోసం 30శాతం కమిషన్లు అడుగుతున్నారని రేవంత్‌ రెడ్డి ఫైరయ్యారు.

కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తుందని, ధరణి రద్దు చేస్తే రైతు బందు, రైతు బీమా రాదని కేసీఆర్ తెలంగాణ ప్రజలని కన్ఫ్యూజ్‌ చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.. ధరణి రద్దు చేస్తే తమ కుట్ర బయట పడుతుందని ప్రభుత్వం భయపడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ధరణిని రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే నూతన విధానం తీసుకొస్తామన్నారు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ భూములపై విచారణ జరిపిస్తామన్నారు..

WEB POSTS :

Khammam: మద్యం మత్తులో దర్జాగా హైవే పైకాళ్లు చాపి కూర్చున్న వ్యక్తి.. వాహనాలు తాకుతూ వెళ్తున్నా కదలని వైనం….

పగటి పూట బిక్షాటన చేస్తూ..రాత్రుళ్ళు ఫుల్ గా మందు కొడతాడు. ఆ వ్యక్తి రాత్రి మందు ఎక్కువై మత్తులో డివైడర్ కు ఆనుకుని రెండు కాళ్ళు చాపి దర్జాగా హైవే పై కూర్చున్నాడు. సృహలో లేకపోవడంతో కాళ్ళకు ఆనుకుని వందలాది వెహికిల్స్ వెళ్తున్న అతనికి స్పృహ లేదు.

తాగర అన్న.. తాగి ఊగ రా అన్నట్టు గా ఒక వ్యక్తి ఫుల్ గా తాగి నడి రోడ్డు మీదనే మద్యం మత్తులో కూర్చున్నాడు. వందలాది వాహనాలు రయ్.. రయ్..మంటు పోతున్నాయి కానీ అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. వెళ్ళే వాహనాలకు అడ్డుగా కాళ్ళు చాపి కూర్చోవడంతో బస్, లారీలు..చక్రాల కింద కాళ్ళు ఎక్కడ నలిగిపోతాయో అనే విషయం కూడా పట్టించుకోకుండా ఎవ్వరూ దారిన వారు వెళ్తున్నారు. ఇంత వరకు ఒకే.. అయితే అటుగా వెళ్ళే పోలీసులు కూడా కనీసం కన్నెత్తి చూడకుండా.. చూసి చూడనట్టు హైవే పెట్రోలింగ్ వెహికిల్ లో రయ్.. మంటు దూసుకు పోయారే.. కానీ మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి పోలీసులు కూడా వదిలేశారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఆర్టీసీ బస్ స్టాండ్ కు ఇన్ గేట్ సమీపంలో మెయిన్ హైవే రోడ్డు పై రాత్రి చోటు చేసుకున్న సంఘటన ఇది. సత్తుపల్లి లో పగటి పూట బిక్షాటన చేస్తూ..రాత్రుళ్ళు ఫుల్ గా మందు కొడతాడు. ఆ వ్యక్తి రాత్రి మందు ఎక్కువై మత్తులో డివైడర్ కు ఆనుకుని రెండు కాళ్ళు చాపి దర్జాగా హైవే పై కూర్చున్నాడు. సృహలో లేకపోవడంతో కాళ్ళకు ఆనుకుని వందలాది వెహికిల్స్ వెళ్తున్న అతనికి స్పృహ లేదు. ఇంక ఆర్టీసీ బస్సులు మాత్రం డివైడర్ వద్ద ఆ యువకుడు కూర్చునే సరికి బస్ స్టాండ్ లోకి బస్ లు మలుపు తిప్పెందుకు ఇబ్బంది పడ్డారు. ఇదంతా బాగా నే ఉంది..

ఎలాంటి బాధ్యత లేదన్నట్టుగా సత్తుపల్లి పోలీసులు పోలీస్ వాహనం లో అక్కడే రయ్..రయ్..మంటు తిరుగుతున్నారు.. తమకు ఎందుకు అన్నట్లుగా.. రోడ్డు మధ్య ఉన్న  అతని పట్టించుకుని కనీసం రోడ్డు పక్కకు కూడా తీసుకు వెళ్ళలేదు. మరో ఇద్దరు కానిస్టేబుల్స్ బైకు మీద వచ్చి చూసుకుంటూ తాపీగా మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి దగ్గరలోనే బైకు ఆపి ఎంచక్కా సెల్ ఫోన్ మాట్లాడుతూ.. టీ లు తాగుతున్నారు. ఈ దృశ్యాలు చూసిన కొందరు సమాజం పట్ల మరి బాధ్యత లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు. నిర్లక్ష్యంగా రోడ్ల మీద వ్యవహరిస్తూ వాహన చోదకులు ఇబ్బందులు గురి చేస్తున్న వారి పై కొంచెం పోలీసులు కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు.

 

WEB POSTS :