VK Pandian: ఒడిశా పాలిటిక్స్‌లో సూపర్ సీఎం.. ఐఏఎస్ అధికారికి బంపర్ ఆఫర్.. అసలు ఏం జరిగిందంటే..?

రాజకీయాల్లో అవకాశాలు అంత ఈజీగా రావు.. అలాగే ఒక్కోసారి అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. ప్రస్తుతం ఒడిశా రాజకీయాలలో అలాంటి పరిణామమే జరిగింది. నిన్నటిదాకా రాజ్యాంగేతర శక్తిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆ ఐఏఎస్ అధికారి ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా మారారు.. ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ సీఎంగా పిలిచే స్థాయికి చేరుకున్నారు.. తమిళనాడులో ఇపుడు ఆ ఐఎఎస్ పెరు హ్యాష్ ట్యాగ్ గా మారింది. తమిళనాడుకు చెందిన వి.కార్తికేయ పాండ్యన్ 200 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఒడిశా క్యాడర్‌కు ఎంపికైన కార్తికేయ పాండ్యన్ అనేక కీలక బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఒడిశా ప్రభుత్వం ఆయన్ను కీలక స్థానంలో కూర్చోబెట్టింది.

ట్రాన్స్ఫర్మేషనల్ ఇన్సియేటివ్స్(Transformational Initiatives) పదవి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే క్యాబినెట్ హోదా కూడా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2000 నుంచి ఐ.ఏ.ఎస్ అధికారిగా అనేక బాధ్యతలు చేపట్టిన పాండ్యన్ ఇటీవల ఒడిశా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. 2011 నుంచి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న కార్తికేయ పాండ్యన్.. అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల ముందు బిజేడి అభ్యర్థుల ఎంపికలో పాండ్యన్ కీలకంగా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత ప్రభుత్వంలో ప్రతి కీలక నిర్ణయం వెనుక కార్తీకేయ పాండ్యన్ ఆలోచన ఉండేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ప్రతిపక్షాలైతే నిత్యం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కంటే కార్తికేయ పాండ్యన్ నే ఎక్కువగా టార్గెట్ చేసేవి. ఐఏఎస్ అధికారి రాజ్యాంగేతర శక్తిగా మారారని అన్నింట్లో తల దూర్చేవారని ఆరోపణలు చేసేవి కూడా.. ఇక అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా కార్తికేయ పాండ్యన్ తీరు నచ్చేది కాదు. సీఎంను కలవాలన్నా ముందుగా కార్తికేయ పాండ్యన్ ని కలవాల్సిందే.. ఇక పాండ్యన్ ని కలవడం కూడా అంతగా కుదిరేది కాదని అసంతృప్తిగా ఉండే పరిస్థితి. ఇక త్వరలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కార్తికేయ పాండ్యన్ ఇలాంటి విమర్శల నుంచి విముక్తి కోసం తాను దూరమవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

Assembly Elections: గత ఎన్నికల్లో భారీ ఓట్లు సాధించి టాప్ 10లో నిలిచిన అభ్యర్థులు వీరే! సీఎం ఏ నంబర్‌లో ఉన్నారంటే?

నేషనల్ లెవల్ పొలిటికల్‌ మేజిక్కులకు కేరాఫ్‌ అడ్రస్‌గా వుండే మధ్యప్రదేశ్‌లో ఈసారి ఏం జరగబోతుంది. మార్చి సంక్షోభం కాంగ్రెస్‌ను గద్దెదించింది. కమల్‌నాథ్‌ పోయి కమలనాథులు పవర్‌లోకి వచ్చారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఫోర్త్‌ టర్మ్‌ సీఎం అయ్యారు. మరి ఈసారి బీజేపీ విక్టరీ కంటిన్యూ అవుతుందా? కసితో కాంగ్రెస్‌ పవర్‌ను చేజిక్కుంటుందా? ఎవరి వ్యహాలు వాళ్లవే. మధ్యప్రదేశ్‌ తీర్పు ఎటువంటి అన్నదీ ఆసక్తికరంగా మారింది.

అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్లు, మెజారిటీని పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 230 అసెంబ్లీ అభ్యర్థులలో 10 మంది భారీ ఓట్లను మెజారిటీతో గెలుపొందారు. ఈ టాప్ 10 ఎమ్మెల్యే అభ్యర్థులకు 11 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఇండోర్ 2 అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రమేష్ మెండలా మొదటి స్థానంలో ఉండగా, టాప్ 10 అభ్యర్థుల జాబితాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మూడో స్థానంలో నిలిచారు. ఈ టాప్ 10 ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీ, నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని టాప్ 10 అభ్యర్థులు భారీ విజయాన్ని సాధించారు. ఈ అభ్యర్థులపై భారీ ఓట్ల వర్షం కురిసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నుండి జితూ పట్వారీ టాప్ 10 అభ్యర్థులలో ఉన్నారు.

ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన టాప్ 10 ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఇండోర్ 2 నుంచి రమేష్ మెండోలా పేరు మొదటి స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేష్ మెండోలాకు 1 లక్షా 38 వేల 794 ఓట్లు అంటే 63.95 శాతం ఓట్లు వచ్చాయి. అదేవిధంగా, భోపాల్‌లోని గోవింద్‌పురా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కృష్ణ గౌర్‌కి 1 లక్షా 25 వేల 487 అంటే 58 శాతం ఓట్లు దక్కాయి. బుద్నీ నుంచి బీజేపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు 1 లక్షా 23 వేల 492 ఓట్లు పోలయ్యాయి. మొత్తం నిజయోజకవర్గంలోని ఓట్లలో 60.25 శాతం చౌహాన్‌కు దక్కాయి. ఇండోర్ 5 స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మహేంద్ర హార్దియా 1 లక్షా 17 వేల 836 ఓట్లు రాగా 48.30 శాతం ఓట్లు అతని ఖాతాలో చేరాయి. ఇండోర్ 1 నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శుక్లాకు 1 లక్షా 14 వేల 555 (50.24 శాతం) ఓట్లు వచ్చాయి.

భోపాల్‌లోని నరేలా స్థానం నుంచి బీజేపీకి చెందిన విశ్వాస్ సారంగ్ కోక్‌కు 1 లక్షా 8 వేల 654 (53.24 శాతం), కుక్షి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర బఘెల్‌కు 1 లక్షా 8 వేల 391 (65.63 శాతం), రౌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జితు పట్వారీకి 1 లక్షా 7వేల 740 ఓట్లు వచ్చాయి. మొత్తం నియోజకవర్గ ఓట్లలో 49.95 శాతం దక్కించుకున్నారు. హుజూర్‌ నుంచి రామేశ్వర్ శర్మకు 1 లక్షా 7 వేల 288 (51.35 శాతం) ఓట్లు, భైందేహి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ధర్ము సింగ్ సిర్సామ్‌కు 1 లక్షా 4 వేల 592 (52.10 శాతం) ఓట్లు వచ్చాయి.

Viral video: పాముకు సీపీఆర్ చేసిన పోలీస్‌. వైరల్‌ వీడియో..

మనిషి అనుకోకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు సీపీఆర్‌ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో గుండె పోటుతో ఉన్నట్లుండి పడిపోతున్న వారికి ఇలా సీపీఆర్‌ నిర్వహించి తిరిగి స్పృహలోకి తీసుకొచ్చిన సంఘటనలు చూసే ఉంటాం. కృత్రిమంగా శ్వాసను అందించి మనిషి గుండెను తిరిగి యాక్టివేట్‌ చేయడమే ఈ సీపీఆర్‌ విధానం ముఖ్య ఉద్దేశం.

మనిషి శ్వాస తీసుకోలేని సమయంలో నోటి ద్వారా శ్వాసను అందించడం ద్వారా మనిషిని బతికిస్తారు. అయితే ఇలాంటి సీపీఆర్‌ను పాముకు చేస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా మనిషి నోట్లో ఊదినట్లు పాము నోట్లో గాలి ఊదితే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ.! కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్‌ ఆఫీసర్‌ మాత్రం పాముకు సీపీఆర్‌ చేసిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో క్రిమి సంహారక మందు కలిపిన నీటిని తాగిన ఓ పాము స్పృహప్పిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ ఇది గమనించి వెంటనే పామును బతికించాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా వెంటనే ఆ పామును చేతిలోకి తీసుకొని శ్వాస ఆడుతుందో లేదో చెక్‌ చేశాడు. పాము శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని గమనించిన కానిస్టేబుల్‌ పాము నోట్లో నోరు పెట్టి శ్వాసను అందించడం ప్రారంభించాడు.

ఇలా రెండు సార్లు చేసేసరికి పాము స్పృహలోకి వచ్చింది. దీంతో పామును వదిలేశాడు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో కాస్త తెగ వైరల్‌ అవుతోంది. అనురాగ్ ద్వారీ అనే వ్యక్తి తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు కానిస్టేబుల్‌ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. పామును కాపాడిన ఆ కానిస్టేబుల్‌ పరు అతుల్‌ శర్మగా గుర్తించారు. ఏది ఏమైనా పోలీస్‌ ఆఫీసర్‌ చూపించిన ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే కదూ.!

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో దారుణం.. వృద్ధుడిపై దాడి చేసిన యువకుడి వీరంగం.. వీడియో వైరల్‌..

Delhi Metro: గత కొద్ది రోజులుగా ఢిల్లీ మెట్రోకు సంబంధించి అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని సరదా సంఘటనలు, కొన్ని షాకింగ్‌ విషయాలు కూడా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకుల చేష్టలు, అసభ్యకర ప్రవర్తనలు, డ్యాన్స్‌ రీల్స్‌ వంటి వింత పోకడలకు సంబంధించిన వీడియోలు త‌ర‌చూ వైర‌ల్‌ అవుతుంటాయి. మెట్రోలో కొందరు చేసే చిలిపి పనులు, అల్లరి చేష్టలు, యువతి యువకుల రోమాన్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా అనేకం చూశాం. మెట్రో ప్రయాణికుల మధ్య చిన్నచిన్న కార‌ణాల‌కే గొడ‌వ‌లు పడుతుండటం, వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు చాలా చూశాం. ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక వృద్ధుడి పై తోటి ప్రయాణికుడు దుసురుగా ప్రవర్తించాడు.

వైరల్‌ అవుతున్న వీడియోలో మెట్రో రైలు కోచ్‌లో నిలబడి ఉన్న ఒక వృద్ధ ప్రయాణికుడిపై తోటి వ్యక్తి వాగ్వాదానికి దిగటం కనిపించింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి సదరు పెద్దమనిషిపై ఒక్కసారిగా దాడికి దిగాడు…అది గమనించిన తోటి ప్రయాణికులు జోక్యం చేసుకొని పెద్దాయనకు సాయంగా నిలిబడ్డారు.. దాడి చేసిన వ్యక్తిని వారిస్తూ.. దూరంగా నెడుతున్నారు. అంతా కలిసి అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అయితే, అక్కడ జరిగిన గొడవకు కారణంగా మాత్రం తెలియారాలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వెల్‌కమ్ టు ఢిల్లీ మెట్రో’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దిశా షెరావత్ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోని షేర్ చేసింది. దిశా సెహ్రావత్ అనే ఖాతా ద్వారా ఈ వీడియోని షేర్‌ చేశారు. అయితే, వృద్ధుడిపై యువకుడు ఎందుకు దాడి చేశాడో స్పష్టంగా తెలియరాలేదు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో చాలా మంది స్పందించారు. యువకుడిని వ్యతిరేకిస్తూ పెద్దాయనపై దాడిని ఖండించారు. దిశా షెరావత్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 50 లక్షల మందికి పైగా వీక్షించారు. కొద్దిరోజుల క్రితం మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. బ్యాక్‌ప్యాక్‌లు ధరించిన ఇద్దరు యువకులు రైలులోపల తలపడ్డారు. మీ ఫైటింగ్‌ ఆపాలంటూ..తోటి ప్రయాణికులు ఎంతగా కోరినప్పటికీ వారు తమ గొడవను ఆపలేదు. ఇతర ప్రయాణికులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

BS Yeddyurappa: మాజీ ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్.. జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బిఎస్ యడ్యూరప్పకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటీవల బెదిరింపు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కర్నాటకలో పనిచేస్తున్న ఛాందసవాద గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా, IB ఇటీవల యడ్యూరప్ప భద్రతపై కేంద్రానికి నివేదిక సమర్పించింది. IB నివేదికలో అతని భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. ఆ తర్వాత వారి భద్రతను పెంచడానికి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం

సీఆర్‌పీఎఫ్ కమాండోలకు భద్రత బాధ్యతలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కమాండోలకు చెందిన సాయుధ సిబ్బంది యడియూరప్ప భద్రతను చూసుకుంటారు. యడియూరప్ప భద్రత కోసం మొత్తం 33 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని మోహరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదనంగా, అతని నివాసం వద్ద 10 మంది సాయుధ స్టాటిక్ గార్డులు, ఆరుగురు వ్యక్తిగత భద్రతా అధికారులతో రౌండ్-ది-క్లాక్ భద్రతను నియమించారు.

డ్రైవర్ల బృందాన్ని కూడా భద్రతా వలయం శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన డ్రైవర్లను కూడా వారి కాన్వాయ్‌లో చేర్చారు. ప్రమాదంలో ఉన్న సమయంలో యడూరప్ప సురక్షితంగా తరలించగలరు. 12 మంది సాయుధ ఎస్కార్ట్ కమాండోలను మూడు షిఫ్టుల్లో మోహరించింది. ఉగ్రవాదుల బెదిరింపులకు వ్యతిరేకంగా నిరంతరం నిఘా ఉంచుతారు. నిరంతరం నిఘా ఉంచేందుకు, షిఫ్టుల వారీగా ఇద్దరు పరిశీలకులను నియమిస్తారు. వీరిలో యడియూరప్ప ఎల్లప్పుడూ రెండు అంచెల భద్రతను కలిగి ఉంటారు.

యడ్యూరప్పకు బెదిరింపులు యడ్యూరప్ప భద్రత కోసం మోహరించిన కమాండోలు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం కలవారు. ఆయుధాలు లేకపోయినా పోరాడడంలో నిష్ణాతులని హోం శాఖ వర్గాలు చెప్పినట్లు సమాచారం. వారికి మెషిన్ గన్‌లు, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలను రౌండ్ ది క్లాక్ అమర్చారు. యడ్యూరప్ప కుటుంబానికి చెందిన చాలా మంది రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. గత కొంతకాలంగా తీవ్రవాద గ్రూపుల నుండి యడేూరప్పకు బెదిరింపులు వస్తున్నాయి. ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖ ఈ ముఖ్యమైన చర్య తీసుకుంది.

PM Modi in US Congress: అమెరికన్ కాన్సులేట్‌లో మోదీ క్రేజ్ నెక్ట్స్ లెవల్.. వీడియో చూస్తే అవాక్కవుతారు..

అమెరికన్‌ కాంగ్రెస్ కాన్సులేట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మరోసారి అమెరికన్‌ కాంగ్రెస్‌ కాన్సులేట్‌ను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రావడం.. భారతీయులకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రధాని మోదీ. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్‌-అమెరికా దేశాలు ప్రతీక అన్నారు. అమెరికన్‌ కాంగ్రెస్ కాన్సులేట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మరోసారి అమెరికన్‌ కాంగ్రెస్‌ కాన్సులేట్‌ను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రావడం.. భారతీయులకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రధాని మోదీ. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్‌-అమెరికా దేశాలు ప్రతీక అన్నారు. అమెరికాలో 40 లక్షల మంది ఎన్ఆర్‌ఐలు ఉన్నారన్న ఆయన.. ప్రవాస భారతీయులను చూసి గర్వంగా ఉందన్నారు.

ప్రపంచశాంతి కోసం భారత్‌-అమెరికా దేశాలు కృషి చేస్తునట్టు తెలిపారు ప్రధాని మోదీ. భారత్ అభివృద్ధి ప్రపంచ అభివృద్ధి అన్నారు పీఎం. మోదీ తనకు మంచి మిత్రుడని అన్నారు బైడెన్‌. భారత్‌-అమెరికా మైత్రీబంధం 21వ శతాబ్ధానికి చాలా ముఖ్యమన్నారు. భారత్‌ – అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలు ప్రపంచానికి కూడా చాలా కీలకం అన్నారు బైడెన్. ఇవి తరతరాల పాటు నిలిచిఉంటాయన్నారాయన.ఇక ఈ వైట్‌హౌస్‌ విందుకు మెక్రోసాఫ్ట్ CEO సుందర్‌ పిచాయ్‌, గూగుల్‌ CEO సత్య నాదేళ్ల, Adobe’s CEO శాంతను నారాయణ హాజరైయ్యారు.. ఈ విందులో భారతదేశానికి చెందిన ప్రముఖులతో పాటు బడా వ్యపారవేత్తలు, టెక్ దిగ్గజాలు, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో కలిసి మోదీ విందును ఆశ్వాదించారు. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీలు ఈ విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అమూల్ బేబీ సృష్టికర్త కన్నుమూత.. ప్రముఖుల సంతాపం!

సాధారణంగా ఏ ఉత్పత్తి అయినా ప్రజల వద్దకు చేరాలంటే దానికి బలమైన పబ్లిసిటి ఉండాలి. పబ్లిసిటీ అనేది ఇప్పటిది కాదు.. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపార రంగానికి చెందిన వారు తాము ఉత్పత్తి చేస్తున్న ప్రొడక్ట్స్ కి రక రకాలుగా యాడ్స్ రూపకల్పన చేసి ప్రజలకు తెలిసేలా చేస్తుంటారు. కొంతమంది పబ్లిసిటీని చాలా క్రియేటీవ్ గా చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. అలా క్రియేటీవ్ గా రూపొంది యాడ్స్ లో ఒకటి ‘అమూల్’ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అమూల్‌ గర్ల్‌ను కంపెనీ నేటికీ కొనసాగుతున్నది. తాజాగా అమూల్ గర్ల్ ‘అట్టర్లీ బటర్లీ’ కార్టూన్‌ సృష్టికర్త ప్రఖ్యాత కార్టూనిస్ట్ సిల్వెస్టర్‌ డాచున్హా కన్నుమూశారు.

పాల ఉత్పత్తులో ఎంతో ప్రసిద్దిగాంచిన అమూల్ బ్రాండ్ పేరు చెప్పగానే ‘అమూల్ గర్ల్’ గుర్తుకు వస్తుంది. ఎరుపు రంగు చుక్కల ఫ్రాక్‌లో కనిపించే చిన్నారి ఎంతో ఆకర్షణగా అనిపిస్తుంది.. ఈ కారణంగా అమూల్ బ్రాండ్‌కు ఎంతో కొత్త గుర్తింపు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని అమూల్ బ్రాండ్ కి అమూల్ గర్ల్ కార్టూన్ సృష్టించారు ప్రముఖ కార్టూనిస్ట్ సిల్వెస్టర్ డకున్హా. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆయన జూన్ 20 ర ముంబైలో తుదిశ్వాస విడిచారు. ‘అట్టర్లీ-బటర్లీ’ ప్రచారంతో 1966లో తొలిసారిగా ఆయన అమూల్‌ గర్ల్‌ కార్టూన్‌ను ల్వెస్టర్ డకున్హా గీశాడు. ఆనాటి నుంచి దాని అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ఆర్ట్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతూ వచ్చారు. ఒకరకంగా ఈ కార్టూన్ అమూల్‌ ఉత్పత్తుల అమ్మకాల పెరగడానికి దోహదపడింది.

సిల్వెస్టర్‌ డాకున్హా తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన, జనరంజకమైన యాడ్స్ ని రూపొందించారు. యాడ్స్ రూపొందించడంలో ఆయన క్రియేటివీటీ చాలా గొప్పగా ఉంటుందని అందరూ అంటుంటారు. ఆయన చనిపోయే వరకు డాకున్హా కమ్యూనికేషన్స్ కంపెనీకి చైర్మన్ గా కొనసాగుతూ వచ్చారు. మంగళవారం ఆయన కన్నుమూసినట్లు గుజరాత్ కో ఆపరేటీవ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయెన్ మెహతా ప్రకటించారు. సిల్వెస్టర్ డకున్హా మరణంతో ఆయన తనయుడు రాహుల్ కంపెనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దిగ్గజ కార్టూనిస్ట్ సిల్వెస్టర్‌ డాకున్హా మృతి పట్ల వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

Udayanidhi Stalin: సీఎం కుమారుడు ఉదయనిధి ఆసక్తికర వ్యాఖ్యలు

చెన్నై: తన తాత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అడుగుజాడల్లోనే నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Minister Udayanidhi Stalin) అన్నారు. నాగపట్టినంలో గురువారం ఉదయం కరుణానిధి శతజయంతి వేడుకలలో భాగంగా ఏర్పాటైన సభలో నిరుపేద విద్యార్థులకు ఉపకారవేతనాలు, విద్యా ఉపకరణాలు, మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ… దేశంలో అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థలుగా పేరు గడించిన సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ పాలకుల చేతుల్లో కీలుబొమ్మల్లా మారాయని ఆరోపించారు. అన్నాడీఎంకే మాజీ మంత్రులు విజయభాస్కర్‌, ఎస్పీ వేలుమణి నివాసగృహాలు, కార్యాలయాలు, వారి అనుచరుల నివాసగృహాల్లో ఐటీ దాడులు ముమ్మరంగా జరిగాయని, అయితే బీజేపీ ప్రభుత్వం ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. బీజేపీ(BJP) పాలకులు ఎన్ని అవరోధాలు కల్పించినా, తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసినా డీఎంకే చెక్కుచెదరని, ప్రజల మద్దతు తమ పార్టీకే ఉందని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను ఉసికొల్పినా డీఎంకే సాధారణ కార్యకర్త కూడా భయపడే ప్రసక్తి లేదని అన్నారు. తాను అన్నాదురై, పెరియార్‌ బోధనలను ఒంటపట్టిచుకున్నానని, ఆ ఇరువురి బాటలో పయనించిన తన తాత అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. ఎలాంటి బెదిరింపులకు భయపడనని, అవసరమైతే తాత మారురూపంలా వ్యవహరించేందుకు వెనుకాడనని ఉదయనిధి పేర్కొన్నారు.

మరో వివాదానికి తెర లేపిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ నియామకం వివాదాస్పదం అవుతుంది. ఏకపక్షంగా ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ పేరును లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేయటంతో ఈ కొత్త వివాదం నెలకొంది. అలహాబాద్ మాజీ జడ్జి జస్టిస్ ఉమేశ్ కుమార్ ను ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు లెఫ్టినెంట్ గవర్నర్. DERC ఛైర్మన్ గా రాజస్థాన్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ సంగీత్ లోధా పేరును నిన్న లెఫ్టినెంట్ గవర్నర్ కు సిఫారసు చేసింది ఢిల్లీ ప్రభుత్వం.

ఢిల్లీ రాష్ట్ర కేబినెట్ సిఫారసును కాదని ఏకపక్షంగా ఎలా నియామకం చేస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. ఢిల్లీలోని ఎన్నికైన ప్రభుత్వ సిఫార్సుకు వ్యతిరేకంగా DERC ఛైర్మన్‌ను నియమించడం చట్టం, రాజ్యాంగ విరుద్ధమన్న ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కి ఎందుకు మెజారిటీ ఇచ్చారని ఢిల్లీ ప్రజలపై బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోందన్న విమర్శ ఉంది. ఢిల్లీ ప్రజలకు 24గంటల ఉచిత కరెంటు అందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు అతిషి. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేసింది ఆప్ ప్రభుత్వం.

Opposition leaders meeting: పాట్నాలో విపక్ష పార్టీల ఐక్యత సమావేశం..‘ఇది సిద్దాంతాల యుద్ధం’ సమావేశానికి ముందు రాహుల్..

పాట్నా: మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీల ఐక్యత సమావేశం (Opposition leaders meeting) మరికొద్దిసేపట్లో బీహార్ సీఎం నితీష్‌కుమార్ (Bihar CM Nithish Kumar) నివాసంలో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో 15 ప్రతిపక్ష పార్టీలు పాల్గొననున్నాయి.

విపక్ష పార్టీల ఐక్యత సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ (Rahul Gandhi), మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), శివసేన (యూబీటి) నేత ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే పాట్నా చేరు కున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు, ఎన్డీఏను ఎదుర్కొనేందుకు ప్రధాన ఫ్రంట్ ఏర్పాటు రోడ్ మ్యాప్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యతన విపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు.