దేశంలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. రోజురోజుకీ ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం తులం బంగారంపై రూ. 200 వరకు పెరగగా ఈరోజు (గురువారం) కూడా గోల్డ్ ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి, రూ. 61,800కి చేరింది. ఇక దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690వద్ద కొనసాగుతోంది.
* ముంబయిలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 వద్ద కొనసాగుతోంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది.
* కోల్కతాలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800గా ఉంది.
* ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్ ధర రూ. 61,800గా ఉంది.* నిజామాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,800గా ఉంది.
* ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.