Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్.. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా.. ఎలక్షన్స్ ముందే రిలీజ్..

Nitin Gadkari Biopic : ఇటీవల బయోపిక్స్ ఎక్కువగా వస్తున్నా సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా, పలు రంగాల ప్రముఖుల జీవిత చరిత్రలను వెండితెరపై చూపించడానికి వారి జీవిత కథలతో బయోపిక్ సినిమాలని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు అన్ని సినీ పరిశ్రమలలోను బయోపిక్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ బయోపిక్ హంగామా మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అనేక బయోపిక్స్ రాగా బాలీవుడ్ నుంచి ఇప్పుడు మరో ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్ రాబోతుంది.
ప్రముఖ బీజేపీ(BJP) సీనియర్ నేత, ప్రస్తుత కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్ రానుంది. ‘గడ్కరీ’ అనే టైటిల్ తో ‘హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే ట్యాగ్ లైన్ ప్రమోషన్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ అనంత్ దేశముఖ్ నిర్మాణంలో అనురాగ్ రాజన్ బుసారి దర్శకత్వంలో ‘గడ్కరీ’ సినిమా నితిన్ గడ్కరీ బయోపిక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇది కేవలం మరాఠీ సినిమాగా తెరకెక్కుతుంది. మరి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. అయితే ఈ సినిమాలో నితిన్ గడ్కరీ రోల్ ని ఎవరు చేస్తున్నారో ఇంకా ప్రకటించకపోవడం విశేషం.

నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు చెందిన నేత. స్టూడెంట్ గా ఉన్నప్పట్నుంచే బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మొదటి నుంచి కూడా రోడ్స్, ట్రాన్స్ పోర్ట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. అటల్ బిహారి వాజపేయి ఉన్నప్పుడు దేశంలోని రవాణా సౌకర్యం లేని గ్రామాలకు రోడ్లు వేయాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే కార్యక్రమాన్ని ఈయనే ప్రపోజ్ చేశారు. మహారాష్ట్ర గవర్నమెంట్ లో కూడా రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేసి మహారాష్ట్ర రవాణా రోడ్డు శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు.

కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా దేశ రోడ్ల మీద ఫోకస్ చేశారు. గత 9 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రిగా పనిచేస్తూ దేశంలో ఎన్నో కొత్త రోడ్లని, హైవేలను, ఎక్స్ ప్రెస్ హైవేలను తీసుకొచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో రవాణాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు గడ్కరీ. ఇంకా దేశం మొత్తం మీద అనేక హైవేల నిర్మాణం జరుగుతుంది. దేశమంతటా ప్రయాణం అందరికి సులభతరం చేయాలనే ఉద్దేశంతో ముందు నుంచి కూడా ఒకే శాఖపై పట్టు సాధించి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలువురు గడ్కరీపై బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.

Rajinikanth: కేరళలో సూపర్ స్టార్ నయా మూవీ షురూ. వైరల్ అవుతోన్న వీడియో

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గరబోల్తా కొట్టాయి. దాంతో రజిని ఫ్యాన్స్ అంతా కాస్త నిరాశకు గురయ్యారు. అయితే జైలర్ సినిమా సంచలన విజయం సాధించి అభిమానులను ఫుల్ ఖుష్ చేసింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసింది. జైలర్ సినిమాను లేపింది అనిరుధ్ సంగీతం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ జైలర్ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు.
లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కు లోకేష్పెట్టింది పేరు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా విక్రమ్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దళపతి విజయ్ నటిస్తున్న లియో సినిమాకు ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా లియో సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ షూటింగ్ కేరళలో మొదలైంది. సూపర్ స్టార్ సినిమా కావడంతో షూటింగ్ స్పాట్ కు అభిమానులు భారీగా వచ్చారు. షూటింగ్‌ స్పాట్‌కి రజనీ వచ్చినప్పుడు తలైవా అంటూ నినాదాలు చేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలు సూపర్ స్టార్ మరింత యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, రానా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Akshay Kumar: అక్షయ్ కుమార్ సినిమాకు కొత్త కష్టం.. ఓటీటీ రిలీజ్చేయాలంటే ఇలా చేయాల్సిందే

అక్షయ్ కుమార్ సినిమాలకు కష్టాలు తప్పడం లేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసే హీరోగా అక్షయ్ కు పేరుంది. ఏడాదికి ఆయన 7 సినిమాలు వరకు రిలీజ్ చేస్తుంటాడు. కానీ ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఓఎంజీ 2 సినిమా ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాథియేటర్స్ లో రిలీజ్ అయ్యే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ‘OMG 2’ సెన్సార్ సమస్యను ఎదుర్కొంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు డైలాగ్స్ కు సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ చిత్రయూనిట్ దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో అక్షయ్ కుమార్ సహా చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా పెద్దగా రెస్పాన్స్ లేకుండా థియేటర్లలో సినిమా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా OTT విడుదలకు సమస్య ఏర్పడింది.
OMG 2’ చిత్రం అక్టోబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అక్షయ్ కుమార్ స్వయంగా తన సినిమాను నెట్‌ఫ్లిక్స్ OTTలో చూడమని ఒక ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడింది. ‘OMG 2’ సినిమా OTT వెర్షన్‌పై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి దీంతో సినిమా 27 కట్స్ తో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.
తన సినిమా OTT విడుదల గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, “నాకు ఫైట్ చేయడం ఇష్టం లేదు. నాకు రూల్స్ గురించి తెలియదు, రూల్ బుక్ ఎప్పుడూ చదవను. ఇది అడల్ట్ సినిమా అని అనుకుంటే మనం ఏమీ చేయలేం. చాలా మందికి సినిమా చూపించాం, సినిమా అందరికీ నచ్చుతుంది. యువత కోసం ఈ సినిమా చేశాం అని అన్నారు. ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి శివ భక్తుడి పాత్రలో కనిపించాడు. యామీ గుప్తా, పంకజ్ మల్హోత్రా కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Varun Lavanya : వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ఫోటోలు షేర్ చేసిన మెగాస్టార్..

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని(Lavanya Tripathi) నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లుగా ఎవరికీ తెలియకుండా ప్రేమించుకుంటూ సడెన్ గా నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపోయారు. మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ మధ్యే ఈ నిశ్చితార్థం జరిగింది. మెగా అభిమానులు వరుణ్ పెళ్లిపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పుడు చేసుకుంటారా అని చూస్తున్నారు.

ఇటీవలే బాలీవుడ్ ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వద్దకు వెళ్లి తమ పెళ్లి బట్టలు కూడా డిజైనింగ్ కి ఆర్డర్ ఇచ్చారు. వరుణ లావణ్య పెళ్లి అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ లో ఉండొచ్చని సమాచారం. నిన్న రాత్రి వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కి చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిల మధ్య ఈ సెలబ్రేషన్స్ జరిగాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు తన ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అభిమానులు ఈ ఫోటోల కింద కామెంట్స్ పెడుతూ వీరి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుపుతున్నారు. మరి ఈ ప్రేమ జంట ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కనుందో చూడాలి.

Mahesh Babu: నాని మూవీ సాంగ్ చూసి ఎమోషనల్ అయిన మహేష్ బాబు…

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హయ్ నాన్న. నాని రీసెంట్ గా దసరా సినిమాతో హిట్ అందుకున్నాడు. నాని ఊర మాస్ లుక్ లోకి మారి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటించింది. దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు హాయ్ నాన్న అంటూ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మృణాల్ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు నాని తో కలిసి సినిమా చేస్తోంది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

తండ్రి కూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల మందికి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి గాజు బొమ్మ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ అందమైన సాంగ్ తండ్రి కూతురికి మధ్య సాగే పాట. ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈసాంగ్ పై మహేష్ బాబు రియాక్ట్ అయ్యారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా లో ఈసాంగ్ లింక్ ను షేర్ చేస్తూ.. చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. ‘ఒక తండ్రి నుంచి అతని కుమార్తె వరకు.. ప్రతి తండ్రి మదిలో ప్రతి ధ్వనించే పాట ఇది. హాయ్ నాన్న చిత్రబృందానికి నా ఆల్‌ ది బెస్ట్ అంటూ మహేష్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. హాయ్ నాన్న సినిమాకు అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు.

Bholashankar : ‘సినిమా’ లో హైలైట్ గ నిలవనున్న ఆ సీన్స్

Follow Us :

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమా భోళా శంకర్. వాల్తేరు వీరయ్య వంటి భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తరువాత సినిమాతో భారీ విజయం సాదించాలి అని అనుకుంటున్నారు.. అందుకే తన తరువాత సినిమా భోళా శంకర్ ను శర వేగంగా పూర్తి చేసే పనిలో వున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.. రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా మెహర్ రమేష్ చేస్తున్నారని తెలుస్తుంది..మెహర్ రమేష్ ఈ సినిమాను ఎన్నో హైలెట్స్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఎంతో బాగుంటుందని.. ముఖ్యంగా మెగాస్టార్,వెన్నెల కిషోర్, హైపర్ ఆది మరియు సత్య మధ్య సాగే కామెడీ సీన్స్ ఎంతో హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది.. ఈ సీన్స్ చూస్తే మెగా ఫ్యాన్స్ కు
వింటేజ్ మెగాస్టార్ గుర్తొస్తాడని మూవీ టీం తెలిపింది. అంతేకాదు మెహర్ రమేష్ చిరును తన కెరీర్ లో ఎవ్వరు కూడా ఇంత వరకు చూపించని డిఫరెంట్ లుక్ లో చూపించనున్నారని సమాచారం. కథలోని కీలక ఎమోషన్స్ అన్నిటిని మెహర్ రమేష్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని అన్ని సీన్స్ ఎంతో అద్భుతంగా వచ్చాయని అంటున్నారు. మరి మెహర్ రమేష్ చిరూ ను ఎంత కొత్తగా స్టైలిష్ గా చూపించాడో చూడాలి మరీ . ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరూ కు చెల్లెలుగా నటిస్తుంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడని సమాచారం.అలాగే ఈ సినిమాలో అక్కినేని యువ హీరో అయిన సుశాంత్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారని సమాచారం.

WEB POSTS :

Lavanya Tripathi : మెగా కోడలి కాస్ట్ కోసం గూగుల్ సెర్చ్.. ఏమని వచ్చిందంటే ?

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి.. మెగా కోడలిగా కొన్ని రోజుల్లో మెగాస్టార్ ఇంట అడుగుపెట్టబోతుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు.. హీరో వరుణ్ తేజ్ తో ఆమె నిశ్చితార్థ వేడుక జూన్ 9న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక మెగా కోడలు అని తెలియడంతో లావణ్య గురించిన వివరాలను ఆరా తీయడం మొదలుపెట్టారు మెగా ఫ్యాన్స్. ముఖ్యంగా కొంతమంది అయితే ఆమె క్యాస్ట్ ఏంటి..? అని సెర్చ్ చేస్తున్నారట. లావణ్య త్రిపాఠి ఎవరు..? ఆమె
కుటుంబం ఏంటి..? ఆమె పుట్టింది ఎక్కడ అని అభిమానులు గూగుల్ సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటున్నారు. అంతేనా.. మెగా కోడలు అని ముద్ర పడిన దగ్గరనుంచి ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ అయితే అమాంతం పెరిగిపోయారు. ఇక వరుణ్ ఫ్యాన్స్ అయితే ముద్దుగా వదినా అని పిలవడం కూడా మొదలుపెట్టారు. కాగా, లావణ్య ఏ క్యాస్ట్ కు చెందిన అమ్మాయి అనేది చెప్పాలంటే.. ఆమె ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె డెహ్రడూన్ లో పుట్టింది. లావణ్యకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. లావణ్య నాన్న న్యాయవాది.. అమ్మ రిటైర్డ్ టీచర్. ఇక ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే ఇష్టం ఉండడంతో చదువు పూర్తిచేసి సినిమాల వైపు అడుగులువేసింది.

ఇకపోతే వరుణ్ తో పరిచయం 2016 లో జరిగింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసి పెళ్లి వరకు వచ్చింది. ఇక ఇది ఆమె గురించి సెర్చ్ చేస్తే గూగుల్ లో కనిపించింది. దీంతో అభిమానులు మెగా కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు. అందరిలా క్యాస్ట్ వేరు అని చెప్పకుండా ప్రేమకు విలువనిచ్చి పెళ్లి చేస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు. ఆ లెక్కన చెప్పుకోవాలంటే.. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ కూడా వేరే క్యాస్ట్ నే. స్నేహాను బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక గతంలో కొడుకు పెళ్లి గురించి నాగబాబు కూడా ఈ విధంగానే చెప్పుకొచ్చాడు. తన కొడుకు ఎవరిని ప్రేమించినా.. ఎలాంటి అడ్డు చెప్పకుండా పెళ్లి చేసేస్తాను అని చెప్పుకొచ్చాడు. చెప్పినట్లుగానే వరుణ్ – లావణ్యను కలిపి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక త్వరలోనే వీరి పెళ్లి ఇటలీలో జరగనుందని టాక్. మరి పెళ్లి కూడా ఎంగేజ్ మెంట్ లా సింపుల్ గా చేస్తారో, లేదో చూడాలి

WEB POSTS :

DEVARA : ‘సినిమా లో’ జాన్వీ పాత్ర ఎలా వుండబోతుందో తెలుసా..?

ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. RRR సినిమా ఎన్టీఆర్ రేంజు భారీగా పెంచేసింది అని చెప్పాలి. అదే ఎనర్జీ తో ఇప్పుడు ఎన్టీఆర్ తన 30వ చిత్రం ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లోనే కోస్టల్ బ్యాగ్ డ్రాప్తో రూపొందుతోందని సమాచారం.. దీంతో ఈ మూవీపై భారీ గా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగా నే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టిన విషయం తెలిసిందే.. ఆ వెంటనే దీనికి సంబంధించిన రెండు భారీ
యాక్షన్ షెడ్యూళ్లను కూడా ఎంతో విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం.. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ తాజా షెడ్యూల్లో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా భాగం అవుతారని సమాచారం.. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ‘దేవర’ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె మత్స్యకార కుటుంబానికి చెందిన యువతిగా కనిపించబోతుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఆమె అండర్ కవర్ ఆఫీసర్గా కూడా నటిస్తుందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.. అయితే, తాజా సమాచారం ప్రకారం..ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్కు సవతి కూతురిగా జాన్వీ కపూర్ పాత్ర ఉండబోతుందని సమాచారం.. ఈ విషయం సినిమాలో సస్పెన్స్ ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు, ఇది రివీల్ అయినప్పుడు ప్రేక్షకులంతా కూడా ఆశ్చర్యపోవడం ఖాయం అని తెలుస్తుంది.

WEB POSTS :

Gopichand : ‘భీమా’ తో గోపీచంద్ మళ్ళీ ట్రాక్ ఎక్కుతాడా?

Gopichand: మాస్ హీరో అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచే రూపం మేచోమేన్ గోపీచంద్ సొంతం. జూన్ 12తో 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న గోపీచంద్ నటునిగా 30 సినిమాలు పూర్తి చేసుకున్నారు. తాజాగా ‘భీమా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘రామబాణం’తో 30 చిత్రాలు పూర్తి చేసుకున్న గోపీచంద్ తన 31వ చిత్రంగా ‘భీమా’ను జనం ముందు నిలిపే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మిస్తూ ఉండగా, ఎ. హర్ష దర్శకత్వం వహించనున్నారు. ‘రామబాణం’లా రయ్యున దూసుకుపోలేక పోయినా, మొత్తానికి కొంత వరకూ సంతృప్తి చెందారు. గోపీచంద్. ఆ ఉత్సాహంతో ఇప్పుడు ‘భీమా’గా మెప్పించాలని తపిస్తున్నారు. 23 ఏళ్ళ వ్యవధిలో 30 చిత్రాలు పూర్తి చేసుకున్న గోపీచంద్ కొన్నిసార్లు ఉప్పొంగిపోయే ఆనందంతో ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా సాగారు. మరికొన్నిసార్లు ఉస్సూరుమని కూలిన అలలా అయిపోయారు. ఎవరికైనా సక్సెస్ ఇచ్చే కిక్కే వేరు. గతంలో తాను చూసిన అనూహ్యవిజయాల స్థాయిలో అలరించడానికి గోపీచంద్ మళ్ళీ సై అంటున్నారు. ఈ సారి ‘భీమా’లో వైవిధ్యంగా నటించాలని తపిస్తున్నారు. గతంలో ఇదే టైటిల్ తో విక్రమ్ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందింది. తెలుగులో పాటల ప్రదర్శన కూడా జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ‘భీమా’ జనం ముందుకు రాలేదు. తమిళంలోనూ ఆ సినిమా అంతగా అలరించలేదు. ఈ నేపథ్యంలో ‘భీమా’ టైటిల్ ను గోపీచంద్ కొత్త చిత్రానికి తగిలించుకోవడంపై కొందరిలో సెంటిమెంట్స్ పొడసూపుతున్నాయి

కృషినే నమ్ముకొని సినిమా రంగంలో అడుగుపెట్టిన గోపీ సదరు సెంటిమెంట్స్ ను పక్కకు నెట్టి ‘భీమా’గా మురిపించడానికే సిద్ధమయ్యారు. ఒకసారి బరిలోకి దిగితే వెనుతిరిగే ప్రసక్తే లేదు అన్నది గోపీచంద్ నైజం. తొలి సినిమా ‘తొలివలపు’ చేదు రుచి చూపించినా, గోపీచంద్ తన దరికి చేరిన అవకాశాలతో సాగాలని నిర్ణయించారు. “జయం, నిజం, వర్షం” వంటి చిత్రాలలో ప్రతినాయకునిగా మెప్పించాక మళ్ళీ కథానాయకునిగా కదం తొక్కాలనే తపించారు. ఆ ప్రయత్నంలో గోపీచంద్ తండ్రి టి. కృష్ణకు అత్యంత సన్నిహితుడైన పోకూరి బాబూరావు నిర్మించిన ‘యజ్ఞం’ ప్రేక్షకాదరణ
చూరగొంది. ఎ.యస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో గోపీచంద్ కోరుకున్న స్టార్ డమ్ లభించింది. మరి వెనుదిరికి చూసుకోలేదు గోపి. ఆయన హీరోగా రూపొందిన “ఆంధ్రుడు, రణం, లక్ష్యం, శౌర్యం, శంఖం” వంటి సినిమాలు విజయాలను అందించాయి. దాంతో గోపీచంద్ కోరుకున్న స్టార్ డమ్ ఆయనను పలకరించింది. ఆ పై వరుస పరాజయాలు పలకరించడంతో పట్టువదలని విక్రమార్కునిలాగే సాగారు.. ఆ సమయంలో ‘లౌక్యం’ గోపీచంద్ కు ఊరటనిచ్చింది. ‘లౌక్యం’ తరువాత వచ్చిన ‘జిల్’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. ఆ తరువాత నుంచే మళ్ళీ గోపీచంద్ తో సక్సెస్ దోబూచులాడింది. ఆయన మాత్రం ప్రయత్నలోపం లేకుండా ముందుకు సాగారు. మధ్యలో పలు ఫ్లాపులు పలకరించాయి. ‘పక్కా కమర్షియల్’ పరవాలేదనిపించింది. ఇటీవల వచ్చిన ‘రామబాణం’ కొంత సంతృప్తిని కలిగించింది. అయినా మునుపటి స్థాయి సక్సెస్ మాత్రం గోపీచంద్ ను వరించలేదు. అందుకే ‘భీమా’గా వస్తానంటున్నారు గోపి. మరి ఈ సారయినా గోపీచంద్ అభిలాష నెరవేరి మరో బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.

WEB POSTS :

Adipurush: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొదు.. ఆదిపురుష్ టీమ్ క్లారిటీ

Adipurush Team Gives Clarity On Ticket Price Issue: ఆదిపురుష్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా నామజపమే! జూన్ 16వ తేదీన విడుదలకు ముస్తాబవుతున్న ఈ సినిమా కోసం యావత్ భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన స్టోరీనే అయినప్పటికీ.. ప్రస్తుత ఆధునిక యుగానికి తగ్గట్టు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో డైరెక్టర్ ఓమ్ రౌత్ ఈ ‘ఆదిపురుష్’ని రూపొందించాడు. దీంతో.. ఈ కొత్త ఫార్మాట్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ గ్యాప్లో ఈ సినిమాకి సంబంధించి ఓ తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని ఖండిస్తూ చిత్రబృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది.

‘ఆదిపురుష్’ ప్రదర్శించే ప్రతీ థియేటర్లోనూ.. హనుమంతుడికి ప్రత్యేకంగా ఒక సీటును కేటాయిస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే తెలిపారు. దీంతో.. ఆ సీటు పక్కనే తమకు సీటు దక్కేలా టిక్కెట్లు కొనాలని, చాలామంది సినీ ప్రియులు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే హనుమంతుడి సీటు పక్కన సీట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతిఒక్కరూ తమకు ఆ ఖాళీ సీటు పక్కనే కూర్చునే ఛాన్స్ రావాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే.. హనుమంతుడి సీటు పక్కన సీట్లకు టికెట్ ధర ఎక్కువ కేటాయిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇరువైపులా సీట్లకు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో, వాళ్లకే సీట్లు దక్కుతాయన్నట్టుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆదిపురుష్ మేకర్స్  క్లారిటీ ఇచ్చారు.

“ఆదిపురుష్ టికెట్ ధరలకు సంబంధించి, సోషల్ మీడియాలో ఓ తప్పుడు వార్త చక్కర్లు కొడుతోంది. హనుమంతుడికి రిజర్వ్ చేసిన సీటు పక్కన సీట్లకు ఎక్కువ ధరలు కేటాయిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఇలాంటి తప్పుడు వార్తల్ని ఎవ్వరూ నమ్మొద్దు. జై శ్రీరామ్” అంటూ ఆదిపురుష్న నిర్మిస్తున్న టీ సిరీస్ సంస్థ ట్విటర్  మాధ్యమంగా స్పష్టతనిచ్చింది. కాబట్టి.. ఎవ్వరూ ఆ సీట్ల కోసం ఎక్కువ డబ్బులు ఇవ్వొద్దు. కాగా.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్
సీతగా, సైఫ్ అలీఖాన్రా వణాసురుడిగా నటించిన ఈ సినిమా.. జూన్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది

WEB POSTS :