బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అంటేనే రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు అందరి చూపు ఇక్కడే ఉంటుంది. దీంతో సాధారణంగానే ఈ పోలీస్ స్టేషన్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్లకు అంతగా అచ్చు రావడం లేదు..పబ్బులు, స్పా, మసాజ్ సెంటర్ ల నుండి మామూళ్లు వసూలు చేస్తూ పట్టుబడుతున్నారు పలువురు పోలీసులు…ఇక్కడ గతంలో పని చేసిన పలువురు పోలీసుల పైనా చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి..కొంత మంది అడ్డంగా ఏసీబీ కి దొరుకుతుంటే, మరి కొంత మంది మాత్రం మాముళ్లు తీసుకుంటూ కూడా వేధింపులకు గురి చేస్తున్నారు..ఇంకొందరు రియల్ ఎస్టేట్ వివాదాల్లో తలదూర్చి సెటిల్ చేస్తున్నారు..గతం లో వ్యాపారవేత్త జయరాం హత్య కేసు సందర్భంలో అప్పటి ఇన్ స్పెక్టర్ పైన ఆరోపణలు రావటంతో విఐపి జోన్ లో ఉన్న ఇద్దరు ఇన్ స్పెక్టర్లను అప్పటి ఉన్నతాధికారులు అటాచ్ చేశారు. ఇదే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ పే సిపి కార్యాలయానికి అటాచ్ చేశారు.

