Andhra Pradesh: రాజధాని తరలింపా?.. అలా అని ఎవరు చెప్పారు?.. సీఎస్ జవహర్ రెడ్డి ఏమన్నారంటే..

విశాఖపట్నం, అక్టోబర్ 25: రాజధాని తరలింపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతోంది రాజధాని షిఫ్టింగ్ ఎంతమాత్రమూ కాదన్నారు. అసలు రాజధాని షిఫ్టింగ్ అని ఎవరు చెప్పారు? ఉత్తరాంధ్ర అభివృద్ది గురించి ఒక కమిటీ ని వేశాం, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయన్నారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.

కోస్టల్ సెక్యూరిటీ పై ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లో అపెక్స్ కమిటీ సమావేశం, అనంతరం పీఎం మోడీ నిర్వహించిన రాష్ట్రాల ప్రోగ్రెస్ కు సంబందించిన వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖ కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కే ఎస్ జవహర్ రెడ్డి ఆయా కార్యక్రమాల గురించి మీడియా కు వివరిస్తున్న క్రమంలో మీడియా తో మాట్లాడుతూ రాజధానికి సంబంధించి పై వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ది కి సంబందించిన ఏర్పాట్లు మాత్రమే..
జీవో నెంబర్ 2015 పేరుతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఏంటంటే రాష్ట్రంలోనే పూర్తిగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక ప్రాంతాలున్నాయి, ప్రధానంగా శ్రీకాకుళం విజయనగరం తో పాటు విశాఖ ఏజెన్సీలో మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందనీ గతంలో నీతి అయోగ్ వెనకబడిన జిల్లాలను ప్రతిపాదించిన సమయంలో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కొన్నాళ్లపాటు నిధులు కూడా విడుదలయ్యాయి. ఆ మేరకు అభివృద్ధి జరగకపోవడంతో ఉత్తరాంధ్ర అభివృద్ది మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అందుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.ఈ సమయాల్లో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు లేదంటే ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని, అలాగే ఆ సమయంలో అధికారిక పర్యటన కోసం వచ్చే కీలక ఉన్నత అధికారులకు సంబంధించిన కార్యాలయాలు, వాళ్లు నివాసం ఉండాలంటే అవసరమైతే వాటికి సంబంధించిన భవనాలు, ఇతర శాఖలకు సంబంధించిన ఎవరైనా ఈ ముఖ్యమైన అధికారులు ఈ ప్రాంతానికి వస్తే వాళ్లు ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన చర్యలపై త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆ జీ వో లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది.

ఆ కమిటీలో ముగ్గురు సీనియర్ అధికారులని సభ్యులుగా నియమించారు. పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, అలాగే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ని సభ్యులుగా నియమిస్తూ కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ ఓ విడత విశాఖ లో పర్యటించి, జిల్లా అధికారులతో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమయంలో ప్రధానంగా సీఎం ఇక్కడకు వస్తే ఉండడానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం తో పాటు దాదాపు 10 నుంచి 15 లక్షల చదరపు అడుగుల అధికారిక వ్యవహారాల స్పేస్, 1500 వరకు వివిధ రకాల నివాస గృహాలకు సంబందించిన సమాచారాన్ని కూడా జిల్లా యంత్రాంగం అందించింది.

ప్రస్తుతానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమే..
రాజధాని కి సంబందించిన న్యాయ వివాదాలు ప్రస్తుతం సుప్రీం కోర్టు లో పెండింగ్ లో ఉన్నాయి. ఈ వ్యాజ్యం పై డిసెంబర్ లో విచారణ, వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజధాని కి సంబందించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ ను మాత్రం షిఫ్ట్ చేసే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి రాష్ట్రం లో ఎక్కడైనా నివాసం ఉండొచ్చు.
ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే ఆయన కార్యాలయం అక్కడ నుంచి పాలించవచ్చు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పాలన చేయొచ్చు..ఈ వెసులుబాటు తోనే ఉత్తరాంధ్ర అభివృద్ది పేరుతో విశాఖ కు సీ ఎం వో ను షిఫ్ట్ చేసి విశాఖ తో పాటు అమరావతి లో కూడా ఉంటూ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ పాలన సాగించవచ్చు. అదే సమయంలో ఎన్నికల నాటికి రాజధాని విషయం లో కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి విశాఖ కు సీ ఎం వో ను షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర అభివృద్ది పేరుతో ఏర్పాటైన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17 నుంచి విశాఖ కు క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ చేసి, ఇక్కడనుంచి ముఖ్యమంత్రి పాలన సాగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లు రాజధాని మార్పుకు సంబంధించినవి ఎంత మాత్రం కాదంటూ సీ ఎస్ ఇచ్చిన వివరణ పై మరొకసారి రాష్ట్ర వ్యాప్త చర్చ కు తెరలేపినట్టైంది.

Pawan Kalyan: ఏపీ సర్కార్‌పై పవన్‌ ఫైర్‌.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల జీతాలు కూడా పక్కదారి పట్టిస్తున్నారంటూ..

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన పవన్.. మూడు అంశాలపై క్లారిటీ ఇచారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఈపరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు పవన్. టీడీపీతో పొత్తు విషయం బీజేపీతో మాట్లాడి.. డిల్లీలో ప్రకటించాలి అనుకున్నా.. వైసీపీ తీరు వల్లే రాజమండ్రిలో ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చాక పొత్తులపై కోఆర్డినేషన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పవన్‌. ఇప్పటికి జనసేన ఎన్డీఏలోనే ఉందని స్పష్టం చేశారు పవన్. కూటమిలో బీజేపీ కచ్చితంగా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జగన్‌ ఎన్డీఏలో లేరని.. కేవలం ఆయనను ఒక రాష్ట్ర సీఎంగానే కేంద్రం గౌరవిస్తుందని చెప్పారు పవన్. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే నిధులు విడుదల చేసిందని బీజేపీ తనతో చెప్పిందన్నారు పవన్. వారాహి విజయయాత్రలో భాగంగా పెడనలో వైసీపీ ప్రభుత్వంపై పవన్‌ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని.
డెకరేటివ్ సర్ఫేసింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉంటూ, సబ్‌స్ట్రేట్ విభాగంలోకి అడుగుపెట్టిన గ్రీన్‌లామ్ డెకరేటివ్ లామినేట్‌లు, కాంపాక్ట్ లామినేట్‌లు, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ క్లాడ్‌లు, డెకరేటివ్ వెనీర్లు, ఇంజినీరింగ్ చెక్క ఫ్లోర్లు, డోర్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్‌ల కోసం ప్లైవుడ్ వరకు విభిన్న ఉత్పత్తులను అందిస్తోంది. తయారీలో నైపుణ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉపరితల పరిష్కారాలను అందించడంలో అగ్రగామిగా ఉండటంతో, ఈ కొత్త ప్రాజెక్ట్ గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ మార్కెట్ అవకాశాన్ని వేగవంతం చేస్తూ, దాని వృద్ధికి కొత్త ఆదాయ వనరులను అందిస్తుంది.

Radikaa Sarathkumar : బండారు క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి రోజాకు నటి రాధిక మద్దతు, మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆగ్రహం

Radikaa Sarathkumar – Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో రోజాకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజాగా మరో సినీ నటి రాధిక సైతం స్పందించారు. మంత్రి రోజాకు ఆమె మద్దతుగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రాధిక తప్పుపట్టారు. వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను డిమాండ్ చేశారు.
”రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? చివరికి మహిళలను వ్యభిచారులుగా చిత్రీకరిస్తారా? దీని వల్ల మేము భయపడబోము. ఇలా మాటలతో హింసించడం సిగ్గు చేటు. వెంటనే క్షమాపణలు చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోండి. రోజాకు నేను అండగా ఉంటాను. ఇంత నీచంగా మాట్లాడటం దారుణం. ఇవి లో క్వాలిటీ పాలిటిక్స్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ వివక్షపై ప్రధాని మోదీ దృష్టి సారించాలి” అని నటి రాధిక అన్నారు.
నటి ఖుష్బూ సైతం రోజాకు మద్దతుగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణం అన్నారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రోజాకు తక్షణమే క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను డిమాండ్ చేశారు ఖుష్బూ. ఆయన క్షమాపణ చెప్పేదాకా సాగే పోరాటంలో తాను కూడా కలుస్తానని చెప్పారు. ఓవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారని, మరోవైపు మహిళా సాధికారత కోసం చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బండారు లాంటి వ్యక్తులు మహిళా నేతలను ఉద్దేశించి నీచంగా మాట్లాడటం ఆవేదన కలిగించే అంశమన్నారు ఖుష్బూ.

CM Jagan: ఢిల్లీలో బిజీబిజీగా సీఎం జగన్‌.. అమిత్‌షా తో ప్రత్యేక భేటీ..

ఏపీ సీఎం జగన్‌ హస్తినలో రెండో రోజు బిజీ బిజీగా గడిపారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో సీఎం జగన్‌ పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యి..కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ అంశాలపై చర్చించారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం జగన్‌. వాళ్లిద్దరి మధ్య కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు రాజకీయపరమైన చర్చ జరిగింది. ఇక దాంతోపాటు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్, చంద్రబాబు అరెస్టు పైనా కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమీక్షలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలన్న ప్రయత్నాల్లో ఉన్న కేంద్ర సర్కార్‌..తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 17వేల 600 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణాన్ని చేపబడుతోంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో టెలికాం సేవల విస్తరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గత నాలుగు దశాబ్ధాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోందని తెలిపారు సీఎం జగన్‌. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం..తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ, బహుముఖ విధానం-సానుకూల ఫలితాలను అందించిందన్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ మద్దతుతో, ఏపీ సర్కార్‌ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటోంద న్నారు. ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక ఘటనలు తగ్గాయని వెల్లడించారు సీఎం జగన్‌. ఏపీలో 5 జిల్లాలో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు కేవలం అల్లూరి, పార్వతీపురం, మన్యంజిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని గుర్తు చేశారు జగన్‌. ఇక సీఎం జగన్‌ ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కూడా అడిగినట్లు సమాచారం. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తే శనివారం ఉదయం సీఎం జగన్‌, ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది.

Andhra Pradesh: నాయుడుపేట గ్రీన్‌ఫీల్డ్ లామినేట్ ప్రాజెక్ట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్

GreenLam Industries: ప్రపంచంలోని టాప్ 3 లామినేట్ తయారీదారులలో ఒకటైన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలోని తన అత్యాధునిక తయారీ కేంద్రంలో శుక్రవారం నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించినట్లు వెల్లడించింది. లామినేట్ యూనిట్ ఏర్పాటు దక్షిణ భారతదేశంలో తన తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు, నాణ్యమైన లామినేట్ షీట్లు మరియు కాంపాక్ట్ బోర్డ్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలలో కంపెనీ గణనీయమైన ముందడుగు వేసింది.
డెకరేటివ్ సర్ఫేసింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉంటూ, సబ్‌స్ట్రేట్ విభాగంలోకి అడుగుపెట్టిన గ్రీన్‌లామ్ డెకరేటివ్ లామినేట్‌లు, కాంపాక్ట్ లామినేట్‌లు, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ క్లాడ్‌లు, డెకరేటివ్ వెనీర్లు, ఇంజినీరింగ్ చెక్క ఫ్లోర్లు, డోర్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్‌ల కోసం ప్లైవుడ్ వరకు విభిన్న ఉత్పత్తులను అందిస్తోంది. తయారీలో నైపుణ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉపరితల పరిష్కారాలను అందించడంలో అగ్రగామిగా ఉండటంతో, ఈ కొత్త ప్రాజెక్ట్ గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ మార్కెట్ అవకాశాన్ని వేగవంతం చేస్తూ, దాని వృద్ధికి కొత్త ఆదాయ వనరులను అందిస్తుంది.
గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఈ తయారీ కేంద్రం, ఏడాదికి 3.50 మిలియన్ లామినేట్ షీట్‌లు, కాంపాక్ట్ బోర్డ్‌లతో ఆకట్టుకునే ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా నెలకొల్పారు. లామినేట్ పరిశ్రమలో శ్రేష్ఠత, ఆవిష్కరణలకు మరియు ప్రాంతం ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు, తన వినియోగదారులకు అత్యుత్తమ-నాణ్యత కలిగిన లామినేట్ ఉత్పత్తులను అందించేందుకు గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ నిబద్ధతకు ఈ తయారీ కేంద్రం ఏర్పాటు నిదర్శనంగా నిలుస్తుంది.

Chanadra Babu: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీలో టీడీపీ ఆందోళనలు ఉదృతం.. సత్యమేవ జయతే అంటూ నిరసనలు

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఆందోళనలు ఉధృతం చేస్తోంది. కాంతితో క్రాంతి పేరిట మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు లోకేష్‌. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీలో టీడీపీ ఆందోళనలను ఉదృతం చేస్తోంది. సత్యమేవ జయతే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు. మరోవైపు 20 రోజుల తరువాత నారా లోకేష్‌ ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకున్నారు . కుటుంబసభ్యులతో కలిసి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో ములాఖాత్‌ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుతోనే చంద్రబాబును అరెస్ట్‌ చేశారని ఆరోపించారు లోకేష్‌. ముందు 3 వేల కోట్ల స్కామ్‌ అన్నారు. ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. వైసీసీ సర్కార్‌ వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబును జైలుకు పంపారని విమర్శించారాయన. అక్రమ అరెస్టులతో చంద్రబాబును అడ్డుకోలేరన్నారు. పోరాటం ఆపొద్దు శాంతియుతంగా పోరాడండి అని చంద్రబాబు తమతో చెప్పారన్నారు లోకేష్‌….

సత్యమేవ జయతే కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీకి అండగా నిలిచారన్నారు లోకేష్‌. వైసీపీ వైఖరిని నిరసనగా కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలుపునిచ్చామని ట్వీట్‌ చేశారాయన. చంద్రబాబు చైతన్యాన్ని నిర్బంధించడం ఎవరి తరం కాదన్నారు.ఏపీలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొవాలని పిలుపునిచ్చారు లోకేష్‌.

శనివారం రాత్రి 7గంటలకు ఇళ్లలో లైట్స్‌ ఆఫ్‌ చేసి కొవ్వొత్తులు వెలిగిద్దాం అని ట్వీట్‌లో పేర్కొన్నారు లోకేష్‌. తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగలేదన్నారు. నిరసనలు మరింత ఉదృతంచేస్తామన్నారాయన. పాదయాత్ర విషయంలో చర్చించి త్వరలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు లోకేష్‌.

YS Jagan: కురుక్షేత్ర సంగ్రామంలో బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

Follow Us :

YS Jagan on BJP: ఏపీ రాజకీయాలు యమ హాట్‌గా మారుతున్నాయి.. 2024 ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ.. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ సమాయత్తమవుతున్నాయి. ఈ తరుణంలో మాటల తూటాలు పేలుతున్నాయి.

YS Jagan on BJP: ఏపీ రాజకీయాలు యమ హాట్‌గా మారుతున్నాయి.. 2024 ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ.. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ సమాయత్తమవుతున్నాయి. ఈ తరుణంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు విమర్శలు సంధించారు. నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి తప్ప మరేం లేదంటూ పేర్కొ్నారు. అంతేకాకుండా కేంద్ర పథకాలను సైతం సీఎం జగన్ తన ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ తరుణంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కురుక్షేత్ర సంగ్రామంలో బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. తాను వాళ్లను నమ్ముకోలేదని.. ప్రజలను నమ్ముకున్నానంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.

జగనన్న విద్యా కానుక పథకం నాలుగో విడతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రారంభించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుకను అందజేశారు. ఈ సంరద్భంగా సీఎం జగన్.. టీడీపీ, జనసేన, బీజేపీ టార్గెట్ గా విమర్శలు సంధించారు. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వమని.. ఆయన పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా గుర్తుకురాజన్నారు. అన్ని విషయాల్లో బాబును వెనకేసుకురావడానికి కొందరు జత అవుతున్నారంటూ పేర్కనొ్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయని పనులు.. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయంటూ విమర్శించారు. ఆయన బతుకంతా వాగ్దానాలు, వెన్నుపోట్లేనన్నారు.

 

బాబు పెత్తందారీ భావజాలానికి, పేదల ప్రభుత్వానికి మధ్య ఈరోజు ఈ యుద్ధం జరుగుతోందని ప్రజలు గమనించాలన్నారు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధంలో దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు.. బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు.. మీ జగనన్న వీళ్లను నమ్ముకోలేదు. దేవుడి దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకున్నాడంటూ పేర్కొన్నారు. వాళ్లు చేస్తున్న దుష్ర్పచారాలను నమ్మొద్దని.. అందరికీ మంచి చేసే అవకాశం ఇవ్వాలంటూ వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

WEB POSTS :

Andhra Pradesh: ఆ రోజే విద్యార్థులకు ఫ్రీగా ట్యాబ్‌లు పంపిణీ.. సీఎం జగన్ గుడ్‌ న్యూస్..

ఏపీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న 8వ తరగతి విద్యార్ధులకు డిసెంబర్ 21న తన పుట్టినరోజున ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అలాగే వారికి చదువులు చెప్పే టీచర్లకు కూడా ట్యాబ్‌లు ఇస్తామన్నారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక రాష్ట్రమంతటా అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్ధులకు ఉచితంగా కిట్ల పంపిణీ చేశారు. ఈ కిట్‌లో ప్రతీ విద్యార్ధికి 3 జతల యూనిఫాం, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బైలింగువల్ పాఠ్యపుస్తకాలూ, డిక్షనరీ ఉంటుందని చెప్పారు.

ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులుతెచ్చామన్నారు సీఎం జగన్. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చామని, టోఫెల్ పరీక్షలకు విద్యార్ధులను సిద్దం చేయడమే కాదు.. ఇంగ్లీష్ మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నామన్నారు. అలాగే పాఠశాలలు మొదలైన తొలి రోజే విద్యాకానుక అందించామన్నారు సీఎం జగన్.

Janasena: ఇకపై మంగళగిరి కేంద్రంగానే జనసేన ఆపరేషన్స్‌

హైదరాబాద్‌లో ఉంటాడు, ఎప్పుడో వీకెండ్‌లో వస్తాడు, షూటింగ్‌ లేనట్టుంది! ఇలాంటి విమర్శలకు చెక్‌ పెట్టబోతున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఇప్పటివరకూ ఒక లెక్క-ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టుగా ఇకపై మంగళగిరిలోనే ఉండబోతున్నారు‌. పవన్‌ ఒక్కరే కాదు, జనసేన ఆపరేషన్స్‌ అన్నీ మంగళగిరి నుంచే జరగనున్నాయ్‌. ఇప్పటివరకు హైదరాబాద్‌ నుంచి జరుగుతోన్న కార్యకలాపాలను కూడా మంగళగిరి నుంచే నిర్వహించాలని నిర్ణయించారు జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌.ఇకపై జనసేన విభాగాలన్నీ మంగళగిరి పార్టీ ఆఫీస్‌ నుంచే పనిచేయనున్నాయ్‌. ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ను ప్రారంభించిన పవన్‌… మరో భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 12వందల గజాల స్థలంలో జీ+5 భవనం కోసం భూమిపూజ చేశారు. ఎన్నికల్లోపే ఈ భవన నిర్మాణం పూర్తిచేసి ఇక్కడ్నుంచే అన్ని విభాగాలు పనిచేసేలా ప్లాన్‌ చేశారు పవన్‌.

మంగళగిరి జనసేన ఆఫీస్‌లో ప్రస్తుతం ప్రత్యేక యాగం చేస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. మీడియాకి ప్రవేశం లేదంటూ గోప్యంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే  చంద్రబాబు- పవన్ పలుసార్లు కలవడంతో.. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అమిత్ షాతో మంతనాలు జరిపారు. ఆ భేటీకి సంబంధించి.. వివరాలు ఏం తెలియరాలేదు. కానీ ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన జేపీ నడ్డా, అమిత్ షా వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ, జనసేనతో బీజేపీ కూడా జట్టు కడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

WEB POSTS :

Karumuri Nageswara Rao : అమిత్ షా కామెంట్లలకు కారుమూరి కౌంటర్…

Karumuri Nageswara Rao: కేంద్ర హోంశాఖ మంత్రి అమితా విశాఖ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. వరుసగా షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. పనిలో పనిగా రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు.. ఇక, అమితా వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. వైసీపీని విమర్శించడానికే అమిత్ విశాఖకు వచ్చినట్టున్నారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి.. విశాఖ రైల్వే జోన్, మెట్రో రైలు వంటి అంశాలపై అమిత్ షా మాట్లాడడం లేదని నిలదీశారు.. రాష్ట్రానికి సంబంధించి ఏం మాట్లాడకపోయినా.. టీడీపీ, బీజేపీ నేతలు చప్పట్లు కొట్టేస్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో 40 గుళ్లు కూలిస్తే బీజేపీ నేతలు మాట్లాడారా..? అని నిలదీశారు. అమిత్ షా తిరుపతి పర్యటనలో గతంలో టీడీపీ నిరసనలు తెలిపిందని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీని చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శించలేదా? అయినా బీజేపీకి సిగ్గు లేదా..? అంటూ ఫైర్ అయ్యారు.

అన్నింటిలోనూ ఏపీ నంబర్ వన్ అంటూ కేంద్రం ప్రకటనలు ఇస్తుంటే.. అవినీతి అంటూ అమిత్ షా కామెంట్లు చేస్తారా..? అని నిలదీశారు కారుమూరి.. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందన్న అమిత్ షా.. ఇప్పుడిలా మాట్లాడడం సరికాదని హితవుపలికారు. బహిరంగ సభ వేదిక మీద అందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు.. టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నేతల మనస్సు ఓ చోట.. మనిషి ఓ చోట అన్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక, అమిత్ షా సొంతంగా మాట్లాడారని అనుకోవడం లేదన్న ఆయన.. ఎవరో చెప్పిన మాటలు విని అమిత్ షా ఇలా మాట్లాడ్డం సరికాదన్నారు.. కర్ణాటకలో బీజేపీ పరిస్థితేం అయిందో చూశారుగా.. ఇక్కడ.. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి వచ్చినా జగనన్ను ఏం చేయలేరు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ ప్రతి ఇంట్లో మనిషిలా మారారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలదే.. గత ప్రభుత్వంలో కేంద్రం నిధులు విషయంలో ఏం చేశారో.. మేమూ అదే చేశాం అన్నారు. రైతులు రొడ్డేక్కి కేంద్రానికి ఏళ్ల తరబడి ఆందోళనలు చేశారు.. దీనికి అమిత్ షా సిగ్గు పడాలని హితవుపలికారు. చెవిలో ఎవరో ఊదితే.. దాన్నే అమిత్ షా మాట్లాడారు అంటూ సెటైర్లు వేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.

WEB POSTS :